Thursday, October 8, 2026
More
    HomeOpinionRoad Safety Nalgonda : నల్లగొండలో అరైవ్ అలైవ్ లో భా గంగా రోడ్డుభద్రతపై వినూత్న...

    Road Safety Nalgonda : నల్లగొండలో అరైవ్ అలైవ్ లో భా గంగా రోడ్డుభద్రతపై వినూత్న వి స్తృత అవగాహన కార్యక్రమం

    📰 Generate e-Paper Clip

     

    Road Safety Nalgonda : ప్రజా దీవెన, నల్లగొండ: నల్ల గొండ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల ని వారణకు ప్ర జల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో “అరైవ్ అలై వ్” కార్యక్రమం భా గం గా నల్లగొండ పట్టణ కేంద్రంలో రో డ్డు ప్రమాదాల నివారణ మరియు భద్రతపై విస్తృత అవగాహన కార్య క్రమం ఘనంగా నిర్వహించబడింది.

    ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్యఅ తిథిగా హాజరై ప్రజలు, వాహనదారులను ఉ ద్దేశించి మాట్లా డారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, అతి వేగం, ట్రా ఫిక్ నియమాలను పట్టిం చుకోకపోవడం వంటికారణాల వ ల్ల జరుగుతున్నాయని ఆయన తెలి పారు. ప్రతి వాహనదా రు ట్రాఫిక్ ని యమాలను తప్పనిసరిగా పాటించాల్సిన బా ధ్యత కలిగి ఉన్నారని స్పష్టంచేశారు.

    ఈ సందర్భంగా హెల్మెట్ వినియో గం ప్రాముఖ్యతను ప్రజల కు వివరించేందుకు పోలీస్ కళాబృందం మరియు చిన్నారు ల నృత్యం ద్వారా ప్రత్యేక అవగాహన ప్రదర్శన ని ర్వహిం చారు. యమధర్మరాజు వేషధారణలో కళాకారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ, హెల్మెట్ ధ రించకపోవడం వల్ల ప్రమా దాల సమయంలో ప్రాణనష్టం సంభవించే అవకాశాలు ఎ క్కువగా ఉంటాయని తెలియజేశారు.వాహనం నడిపే సమ యంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరిం చాలని సందేశాన్ని ప్రజ లకు చేరవేశారు. ఈ ప్రదర్శనకు ప్రజల నుంచి విశేష స్పంద న లభించింది.

    ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ యువత అధిక వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమా దాలు జరుగుతున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలకు రో డ్డు భద్రతపై సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలని సూచించా రు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా శిక్షార్హ మని, అలాంటి చ ర్యలపై పోలీసులు కఠిన చర్యలు తీసు కుంటారని హెచ్చరించారు.

     

    అదేవిధంగా వాహనదారులు తమ వాహన పత్రాలు సక్ర మంగా కలిగి ఉండాలని, ట్రిపుల్ రైడింగ్ చేయ రాదని, మొ బైల్ ఫోన్ ఉపయో గి స్తూ డ్రైవింగ్ చేయకూడదని సూ చిం చారు. రాబోయే రోజుల్లో పాఠ శాలలు, కళాశాలలు మరి యు గ్రా మీణ ప్రాంతాల్లో కూడా రోడ్డు భ ద్రతపై మరిన్ని అవగాహన కార్యక్ర మాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డి.ఎస్ .పి శివరాం రెడ్డి, ఎస్‌బి సిఐ రాము, వన్ టౌన్ సిఐ రాజ శే ఖర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య, ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ కరుణాకర్, ఎస్సైలు, పోలీస్ కళాబృందం సభ్యులు, వి ద్యార్థిని విద్యార్థులు, ఇతర వా హనదారులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.