Monday, September 28, 2026
More
    HomeOpinionCM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, దక్షిణాసియాలోనే గొప్పటెక్స్‌టైల్ రాజధానిగా...

    CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, దక్షిణాసియాలోనే గొప్పటెక్స్‌టైల్ రాజధానిగా తెలంగాణను తీర్చిదిద్దుతాం 

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: వస్త్ర ప రిశ్రమ రంగంలో 2047 నాటికి తె లంగాణను దక్షిణాసియా లోనే గొ ప్ప టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిది ద్దుతామని ము ఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టెక్స్‌టైల్ రంగ అభి వృద్ధి కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్‌కు అనుగుణం గా ప్రపంచాన్ని మార్చగల వాతావర ణాన్ని సృష్టించడంలో మాతో భాగ స్వామ్యం కావాలని పారిశ్రామిక వేత్తలకు పిలు పునిచ్చారు. రాష్ట్ర ప్ర భుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండి య న్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (CITI)తో కలిసి 13వ ఏషియా టెక్స్‌టై ల్ సదస్సు (ATEXCON 2026)ను నిర్వహించింది. ఈ సద స్సులో ముఖ్య మంత్రి అటెక్స్‌కాన్-2026 నివేదిక ను విడు దల చేశారు. ఈ సదస్సులో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు, జాతీయ, అంతర్జాతీ య ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సు సందర్భంగా ఏ ర్పాటు చేసిన టెక్స్‌ టైల్ ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి మం త్రులతో కలిసి సందర్శించారు.

    ఈ సందర్భంగా సదస్సులో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే “అత్యుత్తమ వస్త్రాలను తయారు చేసిన గొప్ప చరిత్ర భార త దేశానికి ఉంది. శతాబ్దాలుగా క‌ ళలు, సంస్కృతి, సంప్రదాయాలు టెక్స్‌టైల్స్‌ రంగాన్ని పరిపూ ర్ణం గా తీర్చిదిద్దాయి. నిజాంకాలంలో ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపారులు హైదరాబాద్ నగరానికి వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగో లు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఈ విష యాన్ని గర్వంగా చెప్పగలదు. టెక్స్‌టైల్స్ మా డీఎన్ఏలో ఉంది.

    వస్త్ర పరిశ్రమలో తెలంగాణ ముందంజలో ఉండటానికి చా రిత్రక కారణాలున్నాయి. దేశంలో పత్తి ఉత్పత్తిలో అగ్రగామి గా ఉన్నాం. పత్తి నాణ్యతకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. టె క్స్‌టైల్ తెలంగాణకు కేవ లం పరిశ్రమ మాత్రమే కాదు. ప్ర జ ల జీవనాధారం. ప్రసిద్ధి చెందిన పో చంపల్లి ఇక్కత్, గద్వాల చీరలు, వరంగల్ దుర్రీస్, నారాయణపేట చేనేత వరకు అ నేకం ఇక్కడున్నా యి. తెలంగాణలో నైపుణ్యం ఉంది. మం చి సంకల్పం కూడా ఉంది. డీప్‌టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏ రో స్పేస్, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్, ఎనర్జీ వంటి అనేక రం గాల్లో తెలంగాణ ముందంజలో ఉంది. వరంగల్‌లో కాకతీ య ప్ర‌పంచస్థాయి మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చే శాం. అందులో అనేక అప్పరెల్‌ పార్కులున్నాయి.

    తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ద్వారా 2034 నాటికి ఒక ట్రిలి య న్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలి యన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం. వస్త్ర పరిశ్రమకు సంబంధించి తెలంగాణ ప్రభు త్వం భూమి, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ప్రోత్సహిస్తుంది. అవసరమైన అనుమతులను వే గంగా మంజూరు చేస్తుంది. ప్రపంచ పోటీకి అనుగుణంగా విధానాలు అనుసరిస్తున్నాం. అత్యుత్తమ మానవ వనరుల బలం ఉంది.

    తెలంగాణలోని పత్తి పొలాలకు లండన్, న్యూయార్క్, పా రిస్, మి లాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ షోలకు అనుసం ధానం కావాలి. మీకు విజన్ ఉంటే, మేము సరైన భాగస్వా ములంఅవుతాం. అందరం కలిసి, ప్రపంచాన్ని మార్చగల టెక్స్‌ టైల్ ఎకోసిస్టమ్‌ను నిర్మిద్దాం. హైదారాబాద్ గ్లోబల్ సి నిమా హబ్ గా ఎదుగుతోంది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూ డియోలను ఇక్కడ ప్రా రంభించాను. టాలీవుడ్, బాలీవుడ్ ఇప్పటికే హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తుండగా, ఇప్పుడు హాలీ వుడ్ కూడా చేరింది. సినిమా సంబం ధిత ఫ్యాషన్ రం గాన్ని కూడా తె లంగాణ నుంచే అభివృద్ధి చెందేలా ప్రోత్స హిస్తాం.

    పరిశ్రమల అభివృద్ధితోపాటే ప ర్యా వరణ పరిరక్షణకు ప్రా ధాన్యత ఇ స్తున్నాం. గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌లను అభివృద్ధి చే స్తాం. సంప్రదాయ ఆ లోచనలతో పాటు ఆధునిక పరి క రా లతో కలిపి డిజైన్, కట్టింగ్, స్టి చింగ్‌లో యువతకు ముఖ్యం గా మహిళలకు శిక్షణనిస్తాం. ప్రపం చంలోని ప్రతి దేశం తె లంగాణలో తయారైన దుస్తులను ధరించేలా చేయాలన్నది మా సంకల్పం. తె లంగాణ రైజింగ్ ప్రయాణంలో అం దరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పెట్టుబడిదారుల కు పిలుపునిచ్చారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.