Education Round Table Conference : ప్రజా దీవెన, హైదరాబాద్ : విద్యార్థుల అభిరుచికి అనుగుణం గా భాషా బోధన అందించాలి తప్ప వారిపై ఎల్ కేజీ నుండే బలవం తంగా పరభాషను రుద్దాలనే ప్రయత్నాన్ని ప్రభుత్వం చే యరాదని రౌండ్ టేబుల్ సమావేశంలోనివక్తలు అభి ప్రా యపడ్డారు. మాతృభాషతో పాటు ఇంగ్లీష్,హిందీ, సం స్కృ తం లాంటి భాషలను అందుబాటులోకి తెచ్చి విద్యార్థు ల ఇష్టానుసారమే ఆయా భాషలో వారికి పాఠాలు చెప్పే వి ధా నాన్ని తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఖై ర తాబాద్ ప్రెస్ క్లబ్ లో నూతన విద్యాపాలసీ దాని పర్యవ సా నాలు అనే అంశంపై సకల జనుల వేదిక, తెలంగాణ జ ర్నలి స్ట్ ఫోరం సంయుక్తంగా ప్రొఫెసర్ లక్ష్మణ్ , ప్రొఫెసర్ వి నాయ క రెడ్డిల అధ్యక్షతన నిర్వ హించిన రౌండ్ టేబుల్ స మావే శంలో ప్రధాన వక్తలుగా తెలంగాణ ప్రభుత్వ సలహా దారు లు కే కేశవరావు, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ మా జీ చైర్మన్ అల్లం నారాయణ, ఉపాధ్యాయ సంఘాల సీ ని యర్ నాయకులు మోహన్ రెడ్డి లతో పాటు అనేక మంది ప్రొఫెసర్ లు,ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని ప్రసం గించారు.
ప్రభుత్వ సలహాదారులు కే కేశవరా వు మాట్లాడుతూ గత కొంతకాలం క్రితం విద్యా కమిషన్ ఇచ్చిన ఎడ్యుకేషన్ పాల సీ కేవలం నివేదిక మాత్రమే అని, దీనిపై ఇంకా కసరత్తు జర గాల్సిన అవసరం ఉందని 20 రోజులలో వెబ్ సైట్ లో పబ్లిక్ డొమైన్ రూపంలో దానిని ఉంచు తామని, తదనంతరం వ చ్చే సల హాలు సూచనలు స్వీకరించి మార్పులు చేర్పులు చే సిన తర్వాత తుది రూపు ఇచ్చి ప్రభుత్వానికి అందిస్తామ న్నారు. దీనిపై ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవ సరం లేదన్నారు. జీతాల పెరుగుదల ఉంటుందితప్ప తగ్గిం చే ప్రసక్తే ఉండదని స్పష్టం చే శారు. ముగ్గురు వైస్ ఛాన్స్ ల ర్ లతో పాటు, ఉపాధ్యాయ సంఘా లు, విద్యపై పనిచేస్తు న్న ఎన్జీవో సంస్థలు, విద్యార్థి సంఘాలతో త్వరలో సమావే శం నిర్వహిస్తామన్నారు.
మాజీ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లా డు తూ విద్యా వ్యవస్థ మెరుగుదల కోసం బ డ్జెట్ లో 18 శా తం నిధులు కేటా యించాలన్న ప్రతిపాదన మంచిగానే ఉం దని, ఆచరణలో ఈ ప్రభు త్వం చేస్తుందా లేదా అనేది అను మానం కలిగిస్తుందన్నారు. విద్య వైద్యం విషయంలో ప్రభు త్వాలు బడ్జెట్లో పెద్దపీట వేసినప్పు డే సామాన్య ప్రజలకు అవి అందు బాటులోకి వస్తాయని, ఈ దిశగా ప్రభుత్వాలు ప్రయత్నించాలి తప్ప ఉచిత పథకాల వెంట ప్రభుత్వాలు ప రుగు తీస్తున్నాయన్నారు. విశ్వవిద్యాలయంలో 72 శాతం ఖాళీ గా ఉండటం ఆందోళన కలిగించే అంశమని, వాటిని భ ర్తీ చేసే విషయంలో సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర నీటిపారుదల శాఖ మాజీ చైర్మన్ వి ప్రకాష్ మాట్లాడు తూ ప్ర భుత్వం వేసిన విద్యా కమిషన్ కి ప్రత్యామ్నాయంగా సకలజనుల వేదిక, తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యం లో ఒక పీపుల్స్ కమిషన్ ను ఏర్పాటు చేయాల్సిన అవస రం ఎంతైనా ఉందని, ఈ కమిషన్ గ్రా మీణ స్థాయి నుంచి పట్టణం వరకు అటు ప్రజల, విద్యార్థుల, ఉపాధ్యా యుల అభిప్రాయాలను పరిగణ లోకి తీసుకొని ఒక మంచి పాలసీ ని రూపొందించి ప్రభుత్వానికి అందిం చాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ఎట్టి పరిస్థి తుల్లో మూసివేరాదని, మూడేళ్ల చిన్నారి ఆరుకిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్లడం అనేది అసాధ్యం కాబట్టి, ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను త గ్గించాలనే ఆలోచన విరమించుకో వాలని కోరారు. ఇతర దేశాల్లో ప రీక్ష విధానం ఉండదని, ఇ క్కడ మా త్రం పరీక్షల పేరుతో ప్రతి నిత్యం బందీ ఖానాల్లో బంధించి 16 గంటల పాటు ప్రైవేట్ పాఠశాలల యాజ మా న్యాల నిర్బంధ విద్యను రద్దుతున్నారన్నారు.
ఉపాధ్యాయ సంఘాల నాయకు లు మోహన్ రెడ్డి మాట్లా డుతూ ఉపాధ్యాయ పోస్టుల్లో మహిళల సంఖ్య పెరిగినటు వంటి నేపథ్యంలో ప్ర త్యేక పరిస్థితుల్లో వారు తీసుకునే సెల వుల సమయంలో ఆయా స్కూల్ లలో ఉపాధ్యాయ పోస్ట్ ఖాళీగా ఉంటున్నాయని, ఇలాంటి విషయాలను గమనించి పోస్టుల భర్తీని ఎప్పటికప్పుడు చేపట్టాలని అన్నారు. ప్రాథ మిక విద్యను విస్మ రిస్తే విద్యా వ్యవస్థ బ్రష్టు బట్టి పో తుంద ని ఆవేదన వ్యక్తం చేశారు.
లెక్చరర్ల సంఘం నాయకులు మ ధుసూదన్ రెడ్డి మాట్లాడు తూ వ్యక్తులతో వ్యవస్థ మారదని, పాలకులకు అధికారుల కు మధ్యన అవగాహన లేమి వల్ల పనులు ముందుకు సాగ డం లేదన్నారు. కళాశాల మం జూరు చేస్తున్నారు తప్ప ఆ కళా శాలలో పనిచేసే అధ్యాపక పోస్టుల ను మంజూరు చే యకపోవడమే దురదృష్టకరమన్నారు.
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సలహాదారులు ఉపేంద ర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ సిఆర్ టి ని భాగస్వా మ్యం చేయకుండా వి ద్యాపాలసిని ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థలో శిక్ష ణ ప్రధానమని, అవస రమైతే మారుతున్న కాలానికి అనుగుణంగా అధ్యాపకుల కు సైతం శిక్షణను అందించాలన్నారు.
తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారు తి సాగర్ మాట్లాడుతూ మెరుగైన విద్య అందరికీ అందుబాటులోకి రావాలంటే బడ్జెట్ లో మొదటి ప్రా ధాన్యత విద్యారంగానికి ఇవ్వా లని, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కళాశాలలు కోర్టు మెట్లు ఎక్కుతు న్న ప్రస్తుత ప రిస్థితుల్లో అవే కోర్టు లు ప్రభుత్వం ఇవ్వకపోతే తల్లి దం డ్రుల నుండి ఫీజులు వసూలు చే యాలని చెప్పాడు పట్ల తల్లిదండ్రు లు ఆందోళన చెందుతున్నారు అని అన్నారు.
రిటైర్ అయిన ఉద్యోగులు తమ పె న్షన్ బెనిఫిట్స్ కోసం కోర్టు మెట్లు ఎ క్కాల్సిన దుస్థితి నెలకొందని ఆ వే దన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో వివిధ సంఘాల నాయకులు వి ద్యాసాగర్,ప్రొఫెసర్ మనోహర్, ప్రొ ఫెసర్ రామకృష్ణ, కృష్ణారెడ్డి, టీజేఎ ఫ్ రాష్ట్ర నాయకులు యోగానం దం, అవ్వారి భాస్కర్, నవీన్ కు మార్ యారాలు పాల్గొన్నారు.


