Monday, September 28, 2026
More
    Homeనల్గొండNagarjuna Sagar MLA Jayaveer Reddy : తిరుమలగిరి సాగర్ మండలంలో పెండింగ్ ఫారెస్టు...

    Nagarjuna Sagar MLA Jayaveer Reddy : తిరుమలగిరి సాగర్ మండలంలో పెండింగ్ ఫారెస్టు భూములకు త్వ రితగతిన డిఫామ్ పట్టాలివ్వాలి

    📰 Generate e-Paper Clip

    — నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుం దూరు జయవీర్ రెడ్డి

    Nagarjuna Sagar MLA Jayaveer Reddy: ప్రజా దీవె న, నాగార్జున సాగర్: నాగార్జునసాగర్ నియోజకవ ర్గం లోని తిరుమలగిరి సాగర్ మండ లంలో పెండింగ్ లో ఉన్న ఫారె స్టు భూములకు త్వరితగతిన డి -ఫామ్ పట్టాలు ఇవ్వాలని నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి కోరారు. శనివారం నాగార్జునసాగర్ లోని విజయవిహార్ లో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖ ర్ తో నాగార్జునసాగర్ నియోజక వర్గ పరిధిలో తిరుమలగిరి సాగర్ మండలంలో పెండింగ్ భూముల సమస్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

    తిరుమలగిరి సాగర్ మండలంలో దీర్ఘకాలిక భూ సమస్యల ను పరిష్కరించాలని కోరారు. గత 30 సం వత్సరాలుగా అ టవీ భూములు సాగు చేసుకుంటున్న పేద రైతుల కు డి- ఫా మ్ పట్టాలు ఇవ్వాలని, అసైన్మెంట్ భూముల పంపిణీ ప్రక్రి యను వేగవంతం చేయాలని కోరారు.

    జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లా డుతూ ఫారెస్ట్ భూము లకు డి-ఫామ్ పట్టాలిచ్చే ప్రక్రియ కొనసాగుతున్నదని, వెరి ఫికేషన్ పూర్తయిన వెం టనే తగు చర్యలు తీసుకుంటామ ని తెలిపారు.ప్రభుత్వ భూముల పై ప్రస్తుతం ఉన్న వారిని గుర్తించేందు కు ప్రత్యేకంగా నాలుగు బృందాలు ఏర్పాటు చేశామని, గ్రామ స్థాయి లో సర్వే నిర్వహించి, గ్రామసభల ద్వారా ధృవీకరణ చేపడుతున్నా మని తెలిపారు.

    ఇప్పటివరకు సుమారు 12,000 ఎ కరాల భూమి సర్వే పూ ర్తయిందన్నారు.సర్వే నంబర్ల ఆధారంగా రి కార్డులు సిద్ధం చేస్తున్నామని వి వరించారు. రైతుబంధు వంటి ప థకాలు దుర్వినియోగం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసు కు న్నామని తెలిపారు.

    ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖా స్తుల్లో రెవెన్యూ సంబంధి త సమ స్యలను పరిష్కరించడంలో చొరవ తీసుకోవడం జ రిగిందని చెప్పారు. ఫారెస్టు భూములకు సంబంధించి రెవె న్యూ అధికారులు, సిబ్బంది త్వరితగతిన వెరిఫికేషన్ పూర్తి స మస్య పరిష్కారానికి చర్యలు తీ సుకోవాలని ఆదేశించా రు.

    ఈ సమావేశంలో మాజీ మంత్రి జా నారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రె విన్యూ అదనపు కలెక్ట ర్ జే. శ్రీని వాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ తు మ్మల పల్లి శేఖర్ రెడ్డి, జిల్లాగృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, తిరుమలగిరి సాగర్ తహ సిల్దార్ అనిల్ తదిత రులు పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.