Munugodu mla rajagopal Reddy :; ప్రజా దీవెన, గట్టు ప్పల: గట్టుప్పల్ మండల కేంద్రం శుక్రవారం చేనేత కార్మికుల ఆనందంతో కళకళలాడింది. మునుగోడు ఎమ్మెల్యే కోమ టిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నేతన్నల జీవితాల్లో వెలుగులు నిం పే కార్యక్రమంలో పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు. నేత న్నల బీమా పథకం కింద ఏడు గురు లబ్ధిదారులకు రూ.35 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. అదే విధం గా చేనేత రుణమాఫీ ప థకం కింద 141 మంది నేతన్నలకు మొత్తం రూ.1 కోటి 10 లక్షల 75 వేల రూపాయల సహాయం అం దించారు. ఈకార్యక్రమం నేతన్నల కుటుంబాల్లో నూతన న మ్మకాన్ని నింపిందని చెప్పవచ్చు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భావోద్వేగంగా మాట్లాడుతూ చి న్ననాటి నుంచే చేనేత కార్మికుల కష్టాలను దగ్గరగా చూసిన అనుభవం తనకు ఉందని చెప్పారు. మా గ్రామంలో నేతన్న లతో కలిసి పెరిగాం,వారి జీవితం నాకు తెలుసని గుర్తుచే సుకున్నారు.టెక్నాలజీ పెరుగుదలతో మరమగ్గాలు రావడం వల్ల సంప్ర దాయ నేత న్నల పరిస్థితి మరింత కష్టమైందని ఆయన అ న్నారు.
“ప్రపంచానికి ఆ త్మగౌరవాన్ని ఇచ్చేది నే తన్నలే కానీ వారి జీవితం మాత్రం ఇంతవరకు అభివృద్ధి చెందలేదని ఆ వేదన వ్యక్తం చేశారు.నేతన్నలు తయారు చేసే వస్త్రాలు మార్కెట్లో పెద్ద లాభాలు తెస్తున్నప్పటికీ, ఆలాభాలు వారికి అందక పో వడం అన్యా యం అని పేర్కొ న్నారు.మరోసారి నేతన్నల స మ స్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి, వారితో కలిసి ము ఖ్యమంత్రి వద్దకువెళ్లి న్యాయం సాధిస్తానని హామీ ఇచ్చారు.
పేదరి కంలో ఉన్న చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లి పరిష్కారం చూపిస్తానన్నారు.“నేతన్నల స మస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు నే ను మీ వెంట ఉంటా” అని ఆయన స్పష్టం చేశారు. గట్టుప్పల్ మండల ఏ ర్పాటు తన రాజీనామా వల్లే సాధ్యమైందని చెప్పి, ప్రజల అ భివృద్ధి కోసం త న పోరాటం కొనసాగుతుందని తెలిపారు.


