Thursday, October 8, 2026
More
    HomeOpinionTelangana DGP CV Anand ? : బిగ్ బ్రేకింగ్, రాష్ట్ర పోలీస్ వ్యవస్థ లో...

    Telangana DGP CV Anand ? : బిగ్ బ్రేకింగ్, రాష్ట్ర పోలీస్ వ్యవస్థ లో కీలక మార్పులు, తెలంగాణ డీజీపీగా సివి ఆనంద్ కు అవకాశం 

    📰 Generate e-Paper Clip

    Telangana DGP CV Anand : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నా యి. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 30న అధికారికంగా పదవీ వి రమణ చేయనున్న నేపథ్యం లో కొత్త నాయకత్వంపై ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నా యి. ఈ నేప థ్యంలో వచ్చే మే నెల మొదటి వారంలోనే సీవీ ఆనంద్ రాష్ట్ర నూత న డీజీపీగా బాధ్యతలు స్వీకరించే అ వకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే హోంశాఖ ప్ర త్యేక ప్ర ధాన కార్యదర్శిగా కీలక బాధ్యత లు నిర్వహిస్తున్న ఆయన సాంకే తి కతతో కూడిన ఆధునిక పోలీసింగ్‌ కు కొ త్త దిశను చూపిస్తారనే అంచనాలు ఉన్నాయి.

    ఇదిలా ఉండగా తాజాగా జరిగిన ప రిపాలనా మార్పుల్లో శి ఖా గోయల్‌ను ఆ స్థానంలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. ఈ మార్పులు కేవలం పదవుల మార్పులే కాకుండా, భవిష్యత్ తెలంగాణ భద్రతా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా కీలకమైన అడుగులుగా భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే, కొత్త డీజీపీగా సీవీ ఆనం ద్ రాకతో తెలంగాణ పోలీ సింగ్‌లో టెక్నాలజీ ఆధారిత మా ర్పులు, వేగవంతమైన నిర్ణయాలు, ప్రజలకు మరింత చేరువై న సేవలు అందుబాటులోకి రానున్నాయనే ఆశలు నెలకొ న్నాయి.

        ఏడుగురు ఐపీఎస్ ల బదిలీలు

    తెలంగాణలో పరిపాలనా వ్యవస్థను మరింత స్మార్ట్‌గా, భవి ష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర పోలీసు విభా గంలో వ్యూహాత్మక పునర్వ్యవస్థీ క రణ భాగంగా ఏడుగురు ఐపీఎ స్ అధికారులకు కొత్త బాధ్యతలు అ ప్పగిస్తూ సీఎస్ రామ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

    డిజిటల్ యుగానికి సరిపోయే భద్రతా వ్యవస్థను బలోపే తం చేయడంలో భాగంగా శిఖా గోయల్‌ను హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ని యమించారు. విజిలెన్స్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందు కు డీఎస్ చౌహాన్‌కు డీజీ బాధ్యత లు అప్పగించారు.మల్టీజోన్-2లో భద్రతా వ్యూహాలను మరింత సమర్థవంతం గా అమలు చేయడా నికి షానవాజ్ ఖాసిం ఐజీగా బాధ్యత లు చేపట్టగా, పోలీసు పర్సనల్ విభాగంపై కూడా అదనపు బాధ్యతలు వహించ నున్నా రు.

    భవిష్యత్ నగర రూపకల్పనలో కీ లక పాత్ర పోషించే “ఫ్యూ చర్ సిటీ ”కి కమిషనర్‌గా తరుణ్ జోషిని యామకం ప్రత్యేక ప్రాధాన్యత సం తరించుకుంది. ఇక డ్రగ్స్ నియంత్రణలో టె క్నాలజీ ఆధారిత చర్యలను బలోపేతం చేయడానికి అవి నాష్ మొహంతిని డీజీగా నియమించగా, అవినీతి నిరోధక విభాగం (ACB) డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు కూడా అ ప్పగించారు.

    పట్టణ భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి మల్కా జి గిరి పోలీసు కమిషనర్‌గా బి.సుమతి నియమితులయ్యా రు. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలో పేతం చే యడానికి ఐజీ కార్తికేయకు ఎస్‌బీ ఐజీగా అదనపు బాధ్య తలు అప్పగించారు.ఈ మార్పులు తెలంగాణలో స్మార్ట్ పా లన, వేగవంతమైన భద్రతా స్పందన, మరియు భవిష్యత్ స వాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచే దిశగా కీలక అడుగు గా పరిశీలకులు భావిస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.