Monday, September 28, 2026
More
    HomeOpinionNalgonda Collector Census Self Enumeration : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక అప్పీల్, జనగణన...

    Nalgonda Collector Census Self Enumeration : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక అప్పీల్, జనగణన ప్రక్రియలో “స్వీ యగణన”విధానాన్ని సద్వినియో గపర్చుకోవాలి

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Census Self Enumeration: ప్ర జా దీవెన, నల్లగొండ: జనగణన- 2027 ప్రక్రియలో భాగంగా ప్రజల సౌ కర్యార్థం ప్రవేశపెట్టిన “స్వీయ గ ణన” (SelfEnu meration) విధానాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసు కోవాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ కోరారు. శనివారం జి ల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆయ న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో స్వీయ గణన ప్రక్రియ 26ఏప్రి ల్ 2026 నుండి 10 మే 2026 వరకు నిర్వ హించడం జరుగుతుందని, జనగణనను ప్రభుత్వం రెండు దశల్లో నిర్వహిస్తున్నదని మొదటి విడత మే11 నుం డి జూ న్ 9 వరకు హౌస్ లిస్టింగ్ హౌస్ సెన్సెస్ ఉంటుందని, ఫిబ్రవ రి 9, 2027 నుండి ఫిబ్రవరి 28, 2027 వరకు జనగ ణన ఉంటుందని తెలిపారు.

    జనగణన ప్రక్రియలో భాగంగా ముఖ్యమైన స్వీయ గణనలో అంద రూ భాగస్వాములు కావాలని,ప్రజలు తమ వివరాల ను స్వయంగా అధికారిక వెబ్ పోర్టల్ se.censu s.gov.in ద్వారా నమోదు చేసుకో వాలని కోరారు. కుటుంబ సభ్యు ల్లో ఎవరైనా ఒకరు 15 నుండి 20 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తి చే యవచ్చని,నమోదు పూర్తయ్యాక మొబైల్ లేదా ఇ మెయిల్‌కు ఒక S E ID వస్తుందని, తర్వాత దశలో ఎన్యూ మరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఈ SE ID చూపిస్తే నమో దు ధృవీకరణ పూర్తవుతుందని తెలిపారు.

    నల్లగొండ జిల్లాలో 5 లక్షల 3 వేల గృహాలు ఉన్నాయని, 37 29 హౌ సింగ్ బ్లాక్ లను, 479 సర్కిల్లను ఏర్పాటు చేయడం జరిగిందని, 31 79 గణకులను 5031 మంది సూ పర్వైజ ర్లను, 41మంది చార్జి అధి కారులను నియమించినట్లు ఆ యన వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి నిర్వహిస్తు న్న ఈ జనగణన పూర్తిగా డిజిటల్ స్థాయిలో ని ర్వహించడం జరుగుతుందన్నారు. ఈ విడత నిర్వహిం చే జనగణమనలో కులం వివరాలను కూడా నమోదు చేయ డం జరుగుతుందని, జనగణనకు సంబంధించి నాలుగు వి డతల శిక్షణ నిర్వహించాల్సి ఉండగా, ఇదివరకే రెండు విడ తలు పూర్తి చేశామన్నారు .

    ఏప్రిల్ 27 నుండి మూడో విడత శిక్షణ ఇవ్వనున్నామని వె ల్లడించారు. స్వీయగణనపై విస్తృత ప్రచారం కల్పించాలని, ప్రజలందరూ భా గస్వాములు అయ్యేలా చూడాలని, దీని వల్ల రాష్ట్ర, జాతీయ స్థాయిలో రూపొందించే పథకాలకు ఇ ది ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. రెవెన్యూ అదన పు కలెక్టర్ జె .శ్రీనివాస్, సిపిఓ శ్రీనివాస్ నాయక్, డిపిఆర్ఓ యు. వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.