Monday, September 28, 2026
More
    HomeOpinionHyderabad chitfund cheating బిగ్ బ్రేకింగ్, నమ్మకానికి చెల్లుచీటి, హైదరాబాద్ మీర్‌పేట్‌లో రూ.2కోట్ల...

    Hyderabad chitfund cheating బిగ్ బ్రేకింగ్, నమ్మకానికి చెల్లుచీటి, హైదరాబాద్ మీర్‌పేట్‌లో రూ.2కోట్ల చిట్టీల మాయాజాలం

    📰 Generate e-Paper Clip

     

    Hyderabad chitfund cheating :  ప్రజా దీవెన, హైదరా బాద్: హైదరాబాద్ శివారు మీర్‌పేట్ ప్రాంతంలో పదేళ్ల న మ్మకం ఒక్కసారిగా పేకమే డలా కూలిపోయింది. ‘వెంకట సాయి చిట్‌ఫండ్స్’ పేరుతో సురేష్ మ రియు అతని భార్య సాగించిన ఈ ఆర్థిక దందా ఇప్పుడు బాధితుల ను రోడ్డున పడేసింది. పదేళ్లుగా స జావుగా సాగుతోందని నమ్మిన ప్రజ ల ఆశలను నీరుగారుస్తూ సమారు రూ.2కోట్ల భారీ కుం భ కోణం వెలుగులోకి వచ్చింది.

    సంఘటన పూర్వాపరాలు ఇలా ఉ న్నాయి..నిందితుడు సురేష్, తన భార్యతో కలిసి గత దశాబ్ద కాలంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తు న్నాడు. పదేళ్ల పాటు సమయానికి చెల్లింపులు చేస్తూ స్థానికుల్లో విప రీతమైన నమ్మకాన్ని సంపాదించు కున్నాడు. ఈనమ్మకాన్నే పెట్టుబడిగా మార్చు కొని గత కొంతకాలం గా భారీ మొత్తంలో వసూళ్లకు పా ల్ప డ్డాడు.మొత్తంగా 25 మందికి పైగా బాధి తుల సంఖ్య కాగా పెట్టుబడి పరిధి ఒక్కొక్కరు రూ. 2.5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు చెల్లించారు.

    అయితే మొత్తానికి మొత్తం కుంభ కోణం దాదాపు రూ.2కో ట్ల మేరనమ్మించి వంచించిన తీరు చిట్టీ గ డువు ముగిసినా, డబ్బులు అడిగి న బాధితులకు సురేష్ దంపతులు చుక్క లు చూపించారు. డబ్బులు ఇస్తాం ఇదిగో చెక్కు, అదిగో ప్రా మి సరీ నోటు” అంటూ కాలయాపన చే స్తూ వచ్చారు. తీరా అసలు విష యం అర్థమయ్యేసరికి అది కేవలం ‘టైమ్ పాస్’ టెక్నిక్ అని బాధితులు గ్రహించారు. ఆ చెక్కులు కూడా చె ల్లవని తెలియడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించా రు.

    భవిష్యత్తులో ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండాలం టే ఇలాం టి ‘ప్రైవేట్ చిట్టీల’ ఉచ్చులో పడకుండా ఉండటా నికి చట్టంచెబుతో న్న జాగ్రత్తలు ఇలా ఉన్నాయి. ప్ర భుత్వం వద్ద రిజిస్టర్ అయిన (Re gistered Chit Fund Compan ies) సంస్థల్లోనే పెట్టుబడి పెట్టాలి.పదేళ్ల నమ్మకం గ్యారెంటీ కాదు ప దేళ్లు బాగున్నారని గుడ్డిగా నమ్మకండి. ప్రతి లావా దేవీకి పక్కా రశీదులు అడగాలి.

    అధిక లాభాల ఆశ మార్కెట్ రేటు కంటే ఎక్కువ లాభాలు ఇస్తామంటే అక్కడ ఏదో మోసం ఉందని గ్రహించండి. వ్యక్తి గత పూచీకత్తుగా ఇచ్చే ప్రామిసరీ నోట్లు లేదా చెక్కులు రక్ష ణ ఇస్తాయని అనుకోవడం భ్రమ. చట్టపరమైన చిక్కులు ఎ దురైన ప్పుడు అవి సరిపోకపోవచ్చు.మీ కష్టార్జితాన్ని ఎక్క డో దాచుకునే ముందు వందసార్లు ఆలోచించం డి. మీర్‌పేట్ ఘటన మనకు నేర్పే పాఠం ఒక్కటే నమ్మకం కన్నా నియ మ నిబంధనలే మిమ్మల్ని కాపాడ తాయని వెల్లడిస్తోంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.