Monday, September 28, 2026
More
    HomeOpinionCivil supplies commissioner StephenRaveendra :సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అల్టిమేటం, పిపిసి కేంద్రాల్లోని...

    Civil supplies commissioner StephenRaveendra :సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అల్టిమేటం, పిపిసి కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి 

    📰 Generate e-Paper Clip

     

    Civil supplies commissioner StephenRaveendra:  ప్రజా దీవెన, సూర్యాపేట: పిపిసి కేంద్రాలలో నిల్వ ఉన్న ధా న్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర సివిల్ స ప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. మం గళవారం వరి ధాన్యం కొ నుగోలు కార్యక్రమాల పురోగతిని సమీక్షించుటకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి పిల్లలమర్రి కొనుగోలు కేంద్రంను సం దర్శించి, అక్కడ రైతులు మరియు పిపిసి సిబ్బందితో ఇంటరాక్ట్ అ య్యారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు అంది స్తు న్న సౌకర్యాలు, కొనుగోలు ప్రక్రి య, మౌలిక వసతులు, ధా న్యం ని ల్వ మరియు నిర్వహణ అంశాల ను పరిశీలించి త గు సూచనలు అందించారు.

    ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కే నరసింహ, అడిషనల్ డైరెక్టర్ రోహిత్ సింగ్ జనరల్ మేనేజర్ నాగేశ్వర రావు, డిప్యూటీ కమిషనర్ కొండ లరావు, డిఎస్ఓ మోహన్ బాబు, డిఎం శ్రీధర్ రెడ్డి, డిసిఓ ప్రవీణ్, డి ఎంఓ నాగేశ్వర శర్మ, తహసిల్దార్ కృష్ణయ్య, రైతులు, సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.

     


    సాగు విధానాల్లో విప్లవాత్మక మార్పులు రావాలి

    సూర్యాపేట: సూర్యాపేట జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖలు సమన్వయం తో సాగు విధానాల్లో విప్లవాత్మక మా ర్పులు తేవాలని, ముఖ్యంగా రైతులకు అధిక ఆదాయం అందించే పంటలపై దృష్టి సా రించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నం ద్ లాల్ పవార్ అధికారులను ఆదే శించారు. ప్రజా పాల న ప్రగతి ప్రణా ళిక లో భాగంగా ఉద్యాన మరియు పట్టు ప రిశ్రమ శాఖల ఆధ్వర్యంలో పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ని ర్వహించిన రైతు వారం కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నా రు.

    వ్యవసాయం కేవలం సాంప్రదాయ పంటలకే పరిమితం కా కుండా, రై తులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ని లిచే విధంగా ఆధునీకరణ చెందాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఉ ద్యానవన మరియు వ్యవసాయ శాఖ అధికారులు సమన్వ యంతో పనిచేసి, క్షేత్రస్థాయిలో రైతుల్లో అవగాహన పెం పొందించాలని ఆ యన సూచించారు.

    ప్రస్తుతం మా ర్కెట్‌ లో ఆయిల్ పామ్‌కు ఉన్నడి మాండ్‌ను దృష్టిలో ఉంచుకు ని సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంచాలని కలె క్టర్ అధికారులకు దిశానిర్దేశం చే శారు. ఆసక్తి ఉన్న రైతుల ను గుర్తించి, ఇప్పటి కే సాగు చేస్తున్న తోటలకు ‘ఫీల్డ్ విజిట్’ చేయించాలని, త ద్వారా సాగు పద్ధతులు, వచ్చే లాభాలపై వారికి ప్రత్యక్ష అ వగాహన కల్పించాలని సూచించారు.

    మండలాల వారీగా లక్ష్యాలను ని ర్దేశించుకుని, లబ్ధిదారుల జాబితా ను తక్షణమే సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా లో నీటి వసతి పు ష్కలంగా ఉన్న నేపథ్యంలో కూర గాయ ల సాగును లాభసాటిగా మార్చాలని కలెక్టర్ పేర్కొన్నారు. కూరగాయల సాగులో ఆధునిక పద్ధతులు, వ్యవసాయ యంత్రీక రణను జోడించి శ్రమను తగ్గించి దిగుబడిని పెం చాలని తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రం (కెవికె) ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన వి త్త నాలు అందేలా చూడాలన్నారు. నీ టి పొదుపుతో పాటు సాగు వ్యయం తగ్గించేందుకు సాంకే తిక తను వాడాలని సూచించారు.

    పర్యావరణానికి మేలు చేసే, తక్కువ ఖర్చుతో కూడిన నానో యూరియా వాడకంపై విస్తృత ప్ర చారం చేయాలి. ఇందు లో ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘా లు (పీఏసీఎస్) చొరవ చూపి రైతు లకు చేరువ చేయాలని కలెక్టర్ తె లిపా రు. వరి ఒక్కటే కాకుండా, మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని , ప్రతి అధికారి క్షేత్రస్థాయి లో రైతుల తో సమన్వయం చేసుకుంటూ, వా రికి అదనపు ఆదాయం కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని సూ చిం చారు.

    వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి మాట్లాడు తూ సాం ప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి, అధిక ఆదాయా న్నిచ్చే ఆయిల్ ఫామ్ సాగు వైపు రైతులు మొగ్గు చూపా ల ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణరెడ్డి పి లుపుని చ్చారు. ​ఆయిల్ ఫామ్ ఒకసారి నాటితే దాదాపు 25 నుండి 30 ఏళ్ల వరకు నిరంతర ఆదాయాన్ని ఇ స్తుందని తెలిపారు. వరి వంటి పం టలతో పోలిస్తే పెట్టుబడి తక్కు వ ని, కూలీల సమస్య కూడా ఉండద ని రైతులకు వివరించా రు.

    రైతులు పండించిన గెలలను కొనుగోలు చేసేందుకు ప్ర భు త్వం ఇప్పటికే నిర్దేశి త కంపెనీలతో ఒప్పందం కుదుర్చు కుం దని, అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా రై తు లకు గి ట్టుబాటు ధరలభిస్తుందని, దళా రీల ప్రమేయం ఉం డదని భరోసా ఇ చ్చారు. ​మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు అవసరమైన సాంకేతిక ప రిజ్ఞానం, ఎరువులు మరియు మార్కెటింగ్ సహాయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉం టుం దని హా మీ ఇచ్చారు.

    ఆసక్తి ఉన్న రైతులు ఉద్యానవన శాఖ అధికారులను సంప్ర దించి త మ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ ​ కా ర్యక్రమంలో జిల్లా హర్టికల్చర్ నాగయ్య, జిల్లా వ్యవ సాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, జి ల్లా మార్కెట్ అధికారి నాగేశ్వర శ ర్మ, కెవికె సైంటిస్ట్ నరేష్, తహసి ల్దార్ కృష్ణయ్య, ఇతర అ ధికారు లు తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.