Wednesday, September 30, 2026
More
    HomeOpinionNakrekal MLA Vemula Veeresham : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కీలక వ్యాఖ్య, విద్యారంగంలో...

    Nakrekal MLA Vemula Veeresham : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కీలక వ్యాఖ్య, విద్యారంగంలో గొ ప్పమార్పుకు ప్రజాప్రభుత్వం కృషి 

    📰 Generate e-Paper Clip

    Nakrekal MLA Vemula Veeresham : ప్రజా దీవెన, నకిరేకల్: విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉం దని ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరే శం అన్నా రు. ఇందులో భాగంగా విద్యార్థుల కు ఆధునిక సౌకర్యాలతో విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు చె ప్పా రు. ప్రజా పాలన, ప్రగతి ప్రణా ళికలో భాగంగా మే 11 నుం డి 17 వరకు నిర్వహిస్తున్న విద్యా వారో త్సవం సందర్భంగా సోమవారం ఆయన నల్గొండ జిల్లా నకిరేకల్ ని యోజక వ ర్గం,కట్టంగూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పా ఠశాలలో 40.50 లక్షల రూపాయ ల పీఎంశ్రీ పాఠశాల ని ధుల ద్వారా నిర్మించిన రెండు అదనపు తరగతి గదులను, ల్యాబ్‌ను ప్రారంభించా రు. అలాగే కేజీవీబీ పాఠశాలలో 3 8.50 లక్షల రూపాయలతో నిర్మిం చనున్న కాంపౌండ్ వాల్, సెప్టిక్ ట్యాంక్ పనుల కు శంకుస్థాపన చే శారు.

    ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వే ముల వీరేశం మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో దేశంలో నే గొప్ప మా ర్పులకు శ్రీకారం చు ట్టిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నా య కత్వంలో ప్రతి నియోజకవర్గా నికి ఒక యంగ్ ఇండియా ఇం టిగ్రే టెడ్ రెసిడెన్షియల్ పాఠశాలతో పా టు, తెలంగాణ పబ్లి క్ స్కూల్ ఏ ర్పాటు చేస్తున్నామని ,ఒకే ప్రాంగణంలో 1650 మంది విద్యార్థులు చదివేలా అత్యాధునిక సౌకర్యాలతో పా ఠశాలలను అభివృద్ధి చేస్తు న్నామన్నారు. విద్యార్థులకు బ్రేక్‌ ఫాస్ట్, మధ్యాహ్న,రాత్రి భోజనం, క్రీడా మైదానాలు, వసతి వంటి అ న్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తె లిపారు. ప్రతి విద్యార్థి పై ప్రభుత్వం సంవత్సరానికి రూ.50 వేల వరకు ఖ ర్చు చేస్తోందన్నారు.

    జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లా డుతూ ఎంత ఎదిగినా విద్య మా త్రమే శాశ్వతంగా ఉంటుందని, విద్యార్థులు చదు వుతో పాటు తమ ప్రతిభను పెంపొందించుకోవాలని అన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి అత్యంత ప్రా ధాన్యత ఇస్తున్నది, ప్రతి నియోజకవ ర్గానికి రూ.200 కోట్ల తో యంగ్ ఇం డియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను మంజూరు చేసిం దన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాల్లో విద్యార్థులు డ్రాయింగ్, సింగింగ్, సెల్ఫ్ డిఫెన్స్, కంప్యూటర్ శిక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్, సై న్స్, క్రీడలు వంటి తమకు ఇష్టమైన అంశాల్లో శిక్షణపొందాలని కోరారు.

    జిల్లాలోని కేజీవీబీలు, పీఎం శ్రీ పా ఠశాలలు, జడ్పీ పాఠశాల ల్లో అభి వృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, వచ్చే విద్యా సంవ త్సరం నాటికి అన్ని పాఠశాలలను మరింత మె రుగైన సౌకర్యాలతో సి ద్ధం చేస్తామని తెలిపారు. ఈ ఏడా ది పదో తరగతి ఫలితాల్లో నల్గొండ జిల్లా 98.47 శాతం ఉత్తీర్ణ త సాధించి రాష్ట్రంలో పదో స్థానంలో ని లిచిందని కలెక్టర్ తెలిపారు. ఫెయి ల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక త రగతు లు నిర్వహించి వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

    అనంతరం జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలో జూనియర్ కళా శాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, తహసిల్దార్ పు ష్పల త,ఎంఈఓ అంజయ్య, ఎం పీడీవో జ్ఞాన ప్రకాష్ ,ఏఈ వెంక ట నరసయ్య, సర్పంచ్ శ్యామల శేఖ ర్, కట్టoగూరు మా జీ జెడ్పిటిసి మాదా యాదగిరి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.