CM Revanth Reddy communist parts : ప్రజా దీవెన, హైదరాబాద్: ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సీపీఐ ప్ర తి నిధి బృందం సమావేశ మైంది. సీ పీఐ శాసనసభ్యుడు కూ నమనేని సాంబశివ రా వు నేతృత్వంలో డాక్ట ర్ బీఆర్ అం బేద్కర్ రాష్ట్ర సచివా ల యంలో ముఖ్యమంత్రిని కలిశా రు. కార్మికులకు కనీస వేత నాల పెంపు నిర్ణయంపై ఈ సందర్భం గా ముఖ్యమంత్రికి ధ న్యవాదాలు తెలి పారు.ఈ సందర్భం గా రైతుల అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్ర భుత్వం సహకరించక పోయిన ప్పటికీ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మొక్కజొన్న దిగుబడి బాగా వచ్చిం దన్నారు. కేంద్రం మొక్క జొన్న కొను గోలు చేయడం లేదని చెప్పారు. ప్రభుత్వానికి నష్టం వ చ్చి నా రైతులు ఇబ్బందు లు పడొ ద్దని మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామని అన్నా రు.ఈ సమావేశంలో సీపీఐ ఎమ్మెల్సీ సత్యం, నాయకులు పశ్య పద్మ, ఈ. నరసింహ, చాడ వెంక ట్ రెడ్డి, బాగం హేమం తరావు, శంకర్, బాలనరసింహ, వీఎ స్ బోసు, రాజ్యసభ స భ్యుడు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.
రైతు పండించిన ప్రతిగింజా కొనుగోలు
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తు న్నామని ముఖ్యమంత్రిఎ. రేవంత్ రెడ్డి చె ప్పారు. మద్దతు ధరలు ప్రకటించ డమే తప్ప కేంద్రం రాష్ట్రంలో పంటను కొ నుగోలు చేయడం లేదని, క నీసం 30 శాతం కూడా సే కరిం చడం లేదని వివరించారు. ముఖ్య మంత్రితో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వం లోని ప్రతినిధి బృందం సమావేశ మైం ది. రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పెండింగ్ ఉన్న కార్మికుల కనీస వే తనాల పెంపు నిర్ణయంపై ఈ సం దర్భంగా ప్రతినిధి బృం దం ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపింది.
ఈ సందర్భంగా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తున్నామన్నా రు. పశ్చిమ బెంగా ల్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా హా మా లీలు తరలివెళ్లడంతో ఇక్కడ కొంత కొరత ఏర్పడిందని, అ లాగే, ఎండల కారణంగా మధ్యాహ్నం స మయంలో పని జ రగడం లేదన్నా రు. ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం సమీక్ష చేస్తున్నానని తెలిపారు.
సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇ చ్చి కొనుగోలు చేస్తున్నామ ని, మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామ ని తెలిపారు.మూసీ నిర్వాసితులు ఎవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేద ని, స్థానికంగానే నివాసాలు మం జూ రు చేస్తామన్నారు. ఈ విష యంలో పార్టీలు రాజకీయం చే యడం తగదన్నారు. మూసీ పునరు జ్జీవం చేసి అద్భుత మై న పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మూసీ కాలుష్యం వల్ల నల్గొండ జి ల్లా ప్రజలకు జీవన్మరణ సమ స్య గా మారిందని, అక్కడ ఎదురవుతున్న పరిస్థితులను వివ రించారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు వల్ల యువ తకు ఉ పాధి లభించడమే కాకుండా నగర ప్రజల జీవన విధానం మెరుగవుతుందని చెప్పారు.
ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేస్తున్నామని, చేపడుతున్న కా ర్యక్రమాలను వారికి వివరించారు. నాణ్య మైన విద్య అం దించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, అందులో భాగం గా విద్యార్థులకు నాణ్య మైన బ్రేక్‌ఫాస్ట్, భోజనం అందిస్తు న్నాం తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చే స్తున్నామ ని చెబుతూ, ఆరుట్ల పాఠశాలను ఒకసారి సంద ర్శించాలని సీపీఎం నాయకులను కోరారు. ఈ సమావే శం లో సీపీఎం నాయకులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగా రెడ్డి, పి. సుదర్శన్, జ్యోతి , నున్నా నాగేశ్వ రరావు, మల్లు లక్ష్మి, సామినేని స్వ రాజ్యం, ఎం. గోపాలరావుతో పా టు రాజ్యసభ సభ్యుడు వేం నరేం దర్ రెడ్డి పాల్గొన్నారు.

