Thursday, October 8, 2026
More
    HomeAndhrapradeshTTD Extends NRI Darshan Window: ఎన్ఆర్ఐ భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

    TTD Extends NRI Darshan Window: ఎన్ఆర్ఐ భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

    📰 Generate e-Paper Clip

    TTD Extends NRI Darshan Window: విదేశాల్లో నివ సిస్తూ తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకోవాలని భావించే ఎన్ఆర్ఐ భక్తులకు టీటీడీ కీలక నిర్ణయం తీసు కుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందేందుకు ఉన్న అర్హత గ డువును ఒక నెల నుంచి మూడు నెలలకు పెంచుతూ కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మార్పుతో విదేశాల నుంచి వచ్చే భక్తులు తమ ప్రయాణ ప్రణాళికలకు అనుగుణంగా మరింత సౌకర్యంగా దర్శనం చేసుకునే అవకాశం పొందనున్నారు.

    ఇప్పటి వరకు అమలులో ఉన్న నిబంధనల ప్రకారం భారత్‌ కు వచ్చిన ఎన్ఆర్ఐలు 30 రోజులలోపు తిరుమలలోని సుపథం మార్గం ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికె ట్ (Darshan Ticket) పొందాల్సి ఉండేది. ఇందుకోసం ఒ రిజినల్ పాస్‌పోర్ట్‌ (Original Passport)తో పాటు దాని ప్ర తులను సమర్పించాల్సి వచ్చేది. తక్కువ గడువు కారణం గా అనేక మంది భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీటీడీ దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమా చారం.

    TTD announces 90 day Special Entry Darshan eligibility period for NRI devotees at Tirumala Temple.

    భక్తుల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన టీటీడీ, అర్హత కాలాన్ని 90 రోజులకు పెంచింది. దీంతో విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన వారు తమ కుటుంబ కార్యక్రమా లు, ఇతర పనులను పూర్తి చేసుకుని అనుకూల సమయం లో తిరుమల దర్శనానికి వెళ్లే వెసులుబాటు కలుగుతుంది.

    మరోవైపు శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ ట్రస్టుకు కూడా భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ట్రస్టుకు లక్ష రూపాయల విరాళం అందిం చిన దాతకు కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం ఐదుగురికి వీఐపీ బ్రేక్ దర్శనం సౌకర్యం కల్పిస్తున్నారు.

    Also Read: Tirupati tragedy family suicide : బిగ్ బ్రేకింగ్, తిరుపతిలో తీరని విషాదం, ఒకే కుటుంబంలో నలుగురి బలి,మిస్టరీగా మిగిలిన కారణాలు

    ఈ సేవను పొందాలనుకునే వారు దర్శనానికి ఒక రోజు ముందు తిరుమలలోని దాతల విభాగంలో విరాళం చెల్లిం చాలి. అనంతరం ఐదుగురు సభ్యుల కోసం వీఐపీ బ్రేక్ దర్శ న టికెట్లకు మొత్తం రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. త దుపరి రోజు సాయంత్రం 4 గంటలకు వారికి శ్రీవారి దర్శనం కల్పిస్తారు.

    దాతలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు తిరుమలలో ప్రత్యేక కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు టీటీడీ (TTD) తెలిపింది. భక్తులు, దాతలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు అధికా రులు పేర్కొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.