Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda Collector Chandra Shekhar: సీఎం సభాస్థలిని పరిశీలించిన కలె క్టర్, ఎస్పీ, అధికారులు

    Nalgonda Collector Chandra Shekhar: సీఎం సభాస్థలిని పరిశీలించిన కలె క్టర్, ఎస్పీ, అధికారులు

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Chandra Shekhar: ప్రజా దీవెన, కనగల్: ఈనెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా ప ర్యటనకు రానున్నందున పర్యట న ఏర్పాట్ల విషయమై గు రువారం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ,జిల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవార్ లు సం బంధిత శాఖల అధికారులతో కలిసి న ల్గొండ జిల్లా కనగల్ సమీపం లో ఏర్పాట్లను పరిశీలించారు. కనగల్ వద్ద సుమారు 14,500 కోట్ల రూపాయలతోహ్యాం రో డ్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి శంకు స్థాపన చేయనున్న దృష్ట్యా, అలాగే ఇతర అభి వృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నేప థ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లపై, బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లు, హ్యంరోడ్ల పై లాన్ ఏర్పాటుకై స్థలాన్ని పరిశీలించారు.

    ముందుగా కనగల్ మండల కేంద్రం లోని జూనియర్ కళాశా ల సమీపంలో వెనకవైపు ఉన్న స్థలాన్ని బహిరంగ సభ కో సం పరిశీలించారు. అంతేకాక గోదాం పక్కన దేవరకొండ రో డ్డు వద్ద హ్యం రోడ్ పైలాన్ ఏ ర్పాటుకై పరిశీలించారు. దీం తో పాటు, బహిరంగ సభ స్థలాన్ని, వాహ నాల పార్కింగ్ స్థ లాన్ని, అలాగే హే లిప్యాడ్ స్థలాలను పరిశీలించారు. దీంతో పాటు, చెట్ల చెన్నారం వద్ద హెలిప్యాడ్ కు,ధర్వేశిపురం వద్ద కూడా హెలిప్యాడ్ ఏర్పాటుకు స్థ లాలను పరిశీలించారు.

    ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ తల్లి దర్శనం, బహిరంగ సభ, హ్యం రోడ్ల పైలాన్ హేలిపాడు స్థలాలపై రాష్ట్ర రోడ్లు, భవనా లు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి దృష్టి తీసుకు వెళ్లిన త ర్వాత బహిరంగ సభ నిర్వహిం చే ప్రదేశాన్ని ఖరారు చేసేం దుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ సంద ర్భంగా బహిరంగ సభకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజ లకు ఇబ్బందులు ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుం డా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీతో కోరారు.

    అదేవిధం గా రాష్ట్ర ముఖ్యమంత్రి కనగల్ తో పాటు ధర్వేశి పురం రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ దర్శనం ఉన్నందున అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ట్రాఫిక్ జామ్ కా కుండా వాహనాలమళ్లింపు వంటివాటిపై కూడా చర్చించా రు.బహిరంగ సభ వేదిక, టెంట్లు, కుర్చీలు, అలాగే భారీకేడ్లు ,స భాస్థలి, పైలాన్ నిర్మాణం తదిత అంశాలపై కలె క్టర్ ,ఎస్పీ లు పరిశీలించారు. రె వెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీని వాస్, ఆ ర్ అండ్ బి ఎస్ ఈ శ్రీధర్ రెడ్డి, డిఈ గణేష్, ఆ ర్టిఏ మెంబర్  కూసుకుంట్ల రాజశేఖర్ రెడ్డి, మాజీ జెడ్ పి టి సి శ్రీనివాస్ గౌడ్, గడ్డం అనూప్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్ర తినిధులు ఉన్నారు.

     కోమటిరెడ్డి ప్రతీక్ పాఠశాలలో ఆకస్మికతనిఖీ

    నల్లగొండ: నల్గొండ జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్ర భుత్వ ఉన్నత పాఠశాల ద్వారా నాణ్యమైన విద్యను అం దించడం పైనే ఉపాధ్యాయులు దృష్టి సారించాలని జిల్లా క లెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. గురువారం ఆయన బొ ట్టు గూడ కోమటిరెడ్డి ప్ర తీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆక స్మికంగా తనిఖీ చేసి తరగతి గదులు, పరిసరాలు, డైనింగ్, లైబ్రరీ, క్రీడా పరికరాలు, తదితరాలను తనిఖీ చేశారు.

    పాఠశాల ద్వారా గుణాత్మక విద్య తో పాటు, పరిసరాలు కూ డా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూడాలని, టాయిలెట్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, తరగతి గదులు, పాఠ శాల ఆవరణ శుభ్రంగా ఉండాలని, పాఠశాలలు ప్రారంభం అవుతున్న దృష్ట్యా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అం దించేందుకు పాఠశాల పక్కనే ఉన్న స్థలంలో తాత్కాలికంగా కిచెన్ ఏర్పాటు చే యాలని చెప్పారు.

    అలాగే తరగతి గది లో ఏసీలు వినియోగించేటప్పుడు తర గతి గదులు మూసి ఉంచాలని, పాఠశాలలోని లైబ్రరీ, గేమ్స్, ఇతర అన్ని పరిక రాలు విద్యార్థు లు వినియోగించుకునే విధంగా చూడడమే కాకుండా వాటిని జాగ్రత్తగా సంరక్షించా లన్నారు.పాఠశాలలో పచ్చదనం ఉండే వి ధంగా మొక్కలకు నిరంతరం నీ రందిం చాలని, మొక్కలు ఎండిపో కుండా చూ డాలని, పాఠశాల ఆ వరణలోకి వాహనాలు రాకుండా చూ డాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంట నల్గొండ ఎంజిఓ అరుoధ తి, పాఠశాల హెడ్మాస్టర్ తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.