Brs jagadeesh Reddy fires on Congress BJP : ప్ర జా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాజకీయాల్లో మరో హో రా హోరీ పోరుకు నల్గొండ వేదికైంది. ఒకవై పు ఓటర్ల జాబి తా సవరణ (SIR), మరోవైపు డిజిటల్ సభ్యత్వ నమోదుపై బి ఆర్ఎస్ పార్టీ నల్గొండ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల వి స్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. మాజీ ఎమ్మె ల్యే భూపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి మాజీ మంత్రి జ గదీష్ రెడ్డి, పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ఎ మ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు మార్, జెడ్పీ మాజీ ఛైర్మన్ బండ నరేందర్ రెడ్డి ముఖ్య అతి థులుగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమా వేశంలో నేతల ప్రసంగాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పదునైన విమర్శలతో, దేశవ్యాప్త ఓట్ల కుట్రలపై హెచ్చరికల తో హాట్ హాట్ గా సాగాయి.
సీఎం రేవంత్ పర్యటన ఒక ‘బిగ్ స్కామ్’
సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, స్థానిక మంత్రుల పై నిప్పులు చెరి గారు. “ఈ నెల 17 న నల్గొండలో పెద్ద స్కామ్ చేసేందుకే సీ ఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు. ఈ ‘హ్యాంరోడ్లు’ అన్నీ వట్టి ముచ్చటే.. అంతా హంబక్ కేవలం కమిషన్ల కొరకే ఈ హంగామా చేస్తున్నారన్నారు. స్థానిక మంత్రి కోతల వెంకట్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని, జిల్లాకు ఇ ప్పటివరకు ఒక్క రూపాయి తేవడం చేతకాలేదు కానీ, ప్రజ లను మోసం చేయడానికి సీఎం రేవంత్‌తో కలిసి డ్రామాలు ఆడుతున్నారు. జిల్లా మంత్రులిద్ద రూపూర్తిగా అసమర్థుల ని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
పదవి కాపాడుకునే ‘కాకా’ రాజకీయం
“తన తమ్ముడికి పదవి వచ్చి, తన మంత్రి పదవి ఎక్కడ ఊ డిపోతుందోనని వెంకట్ రెడ్డి భయపడుతున్నాడు. రేవంత్ రెడ్డిని ప్రసన్నం చే సుకునేందుకే ఈ సభల పేరిట షో పుటప్ (Show put-up) చేస్తున్నాడు. మిల్లర్ల దగ్గర మూటలు తీ సుకున్న ఈ దుర్మార్గుల వల్ల జిల్లా లో అభివృద్ధి పడకేసింద ని చెప్పారు. కేసీఆర్ వచ్చిన ప్రతిసారీ నల్గొండను బ్రహ్మాం డంగా మార్చారు. మెడికల్ కాలేజీలు, భగీరథ నీళ్లు, రూ.1 300 కోట్లతో నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేసింది బిఆర్ ఎ స్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు.
పార్టీ కార్యకర్తలకు టాస్క్
గ్రామాల్లో BRS బూత్ ఏజెంట్లు (B LAs) ప్రతిరోజూ BLOల వెంబడి ఉంటూ ఇల్లుల్లు తిరగాలి. ఓట్లు గ ల్లంతు కాకుండా పకడ్బందీగా పని చేయాలి. ఎక్కడా గొడవలు పడొ ద్దు, ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే RDOకు లిఖితపూర్వ కం గా ఫిర్యాదు చేయాలని సూచించారు.
బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తనదైన శైలిలో దేశవ్యాప్త ఉదాహరణలను ప్రస్తా విస్తూ ఓటర్ల జాబితా ప రిశీలన (SIR) ప్రాధాన్యతను వివ రించారు.ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ ను అస్త్రంగా చేసుకునే పశ్చిమ బెం గాల్, బీహార్ రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొల గించి, అక్కడ బలమైన ప్రాంతీయ పార్టీలను ఓడించి బీ జే పీ అధికారంలోకి వచ్చింది. మనం అప్రమత్తంగా లేకపోతే తెలంగాణ లోనూ అదే ప్రమాదం పొంచి ఉందని వివరించా రు.
స్మృతి ఇరానీ ఓటే గల్లంతు
దేశ మాజీ మంత్రి స్మృతి ఇరానీ ఓ టు కూడా ఇలాగే గల్లం తు అయిందంటే వ్యవస్థ ఎంత పకడ్బందీగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. గ్రామ స్థాయిలో ‘బ్లూ’ (BLA)లు అ ల సత్వంగా ఉంటే మన ఓట్లు మాయమవడం ఖాయమ న్నా రు. పశ్చి మ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ నల్లకోటు వేసుకుని స్వయం గా కోర్టులో వాదించినా ఓటరు జా బితా ను మార్చలేకపోయారన్నా రు. ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నిక ల కమిషన్‌కు ఉన్న అధికారాలను ఎవరూ ప్రశ్నించలేరన్నా రు.
యూపీలో 2 కోట్ల ఓట్ల తొలగింపు
కేవలం ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే దాదాపు 2 కోట్ల ఓట్లను తొల గించారు. గతంలో ఏపీలోనూ ‘సేవామిత్ర’ యాప్ ద్వారా వై సీపీ కార్యకర్తల ఓట్లను టీడీపీ తొలగిస్తే కోర్టుల చుట్టూ తిర గాల్సి వచ్చిందని చెప్పారు.ఎన్నికల కమిషన్ 2002 సంవ త్సరాన్ని ప్రామాణికంగా తీసుకుని, ఆ నాటి కుటుంబ స భ్యుల ఓట్లతో ప్ర స్తుత ఓట్లను మ్యాపింగ్ చేస్తూ ఈ సరికొత్త జాబితా (SIR) రూపొందిస్తోందని ప్రవీణ్ కుమార్ స్పష్టం చే శారు. ఇందుకోసం కేడర్ కింది విధంగా పనిచేయాలని పిలు పునిచ్చారు. BLOలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లాలి. ఆధార్ లేదా ఇతర గు ర్తింపు పత్రాలను పరిశీలించి ఎన్యుమరేటర్ ఫారం నింపాలన్నారు.
చనిపోయిన, వలస వెళ్లిన వారి ఓట్ల తొలగింపు కోసం ఈసీ ఐ నెట్ (ECI Net) ద్వారా ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవా లి. ఎవరిదైనా అన్యాయంగా ఓటు తీసేస్తే.. సర్వే నాటి ‘ఎ న్యుమరేటర్ ఫారం నకలు కాపీ’ ఆధారంగా పై అధికారు ల కు ఫిర్యాదు చేయాలని, “బాబాసా హె బ్ అంబేద్కర్ ఇచ్చిన సమాన ఓ టు హక్కును కాపాడుకోవడమే మన మొదటి క ర్తవ్యమని, తెలంగాణలో పుట్టినప్పటి నుండి మరణించే వ రకు ప్రజలకు సంక్షేమం అందాలన్నా, రైతు రాజ్యం రావా ల న్నా మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, ఆదిశగా కార్య కర్తలు సైనికుల్లా పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నల్ల కోటు వేసుకొని కోర్టులో వాదనలు వినిపించినా ఓటరు జాబితాను మార్చలేకపోయారని గుర్తుచేశారు. భారత రా జ్యాంగం ఆధారంగా ఎన్నికల కమీషన్ కు ఆర్టికల్ 324 ప్రకా రం కల్పించిన అధికారాలు ఎవరూ ప్రశ్నించలేరని తెలి పా రు.తెలంగాణ కాంగ్రెస్ నాయకులను నమ్మి మీనాక్షి నట రా జన్ రాజ్యసభ ఎంపి గా నామినేషన్ వేస్తే, ఎన్నికల రిట ర్నిం గ్ అధికారి ఆమె నామినేషన్ తిరస్కరించారని, సుప్రీం కోర్టు కూడా రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని తప్పుబట్టలేద న్నారు. నల్లగొండ పట్టణ పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, నాయ కులు మాలే శరణ్య రెడ్డి, నిరంజన్ వలి, కంచర్ల కృష్ణారెడ్డి, జమాల్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.




