Sunday, September 27, 2026
More
    HomeIndiaCm Revanth Reddy delhi tour : బిగ్ బ్రేకింగ్, ఢిల్లీ వేదికగా 'హైపర్...

    Cm Revanth Reddy delhi tour : బిగ్ బ్రేకింగ్, ఢిల్లీ వేదికగా ‘హైపర్ -కనెక్టివిటీ’ నెగోషియేషన్స్, కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్

    📰 Generate e-Paper Clip

     

    Cm Revanth Reddy delhi tour :  ప్రజా దీవెన, న్యూ ఢి ల్లీ: భారతదేశ భవిష్యత్తు రవాణా ముఖచిత్రాన్ని మార్చేసే ఒక కీలకమైన ‘కనెక్టివిటీ డీల్’ కోసం దేశ రాజధాని వేదికైం ది. సరిగ్గా నేడు సాయంత్రం 6:30 గంటలకు న్యూఢిల్లీలోని కమాండ్ సెంటర్‌లో ఒక అత్యున్నత స్థాయి వ్యూహాత్మక స మావేశం జరగబోతోంది. కేంద్ర రైల్వే, ఐటీ శాఖల అధిపతి అశ్విని వైష్ణవ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కేం ద్ర మంత్రి కిషన్‌ రెడ్డి భేటీ కానున్నారు. ఇదిలా ఉండగా రెం డు రోజుల క్రితమే తెలంగాణ ప్రగతి వేగాన్ని పెంచేలా సీఎం రేవంత్ రెడ్డి ఒక డిజిటల్ అప్పీల్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పంపారు. కేవలం అభ్య ర్థనలతో కాలయాపన చేయకుండా, యాక్షన్ ప్లాన్‌లోకి దిగాలన్నదే ఈ లేఖ ముఖ్య ఉద్దేశంగా చె ప్పుకొచ్చారు. తెలంగాణలో తలపెట్టిన భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రాపిడ్ కనె క్టివిటీ ప్రాజెక్టులకు సంబంధించి IRFC (ఇండియ న్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్) నుండి రావలసిన మెగా నిధు లను త్వరితగతిన విడుదల చేయించడమే ఈ లేఖలోని అసలు లక్ష్యమని పేర్కొన్నారు.

    కేంద్రంలో కీలక పాత్రలో ఉన్న కిష న్ రెడ్డి, ఈ నిధుల సాధన లో తెలం గాణకు ‘కటలిస్ట్’ (ఉత్ప్రేరకం)లాగా వ్యవహరించి చొరవ చూపాలని సీఎం కోరారు. లేఖ అందిన వెంటనే స్పం దించిన కిషన్ రెడ్డి, భారత సర్కార్‌తో వేగంగా సంప్రదింపు లు జరిపి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ తో ఈ ‘టాప్-లెవెల్ మీ టింగ్‌’ను ఫిక్స్ చేశారు.

    కాగా సాయంత్రం జరగబోయే ఈ సమావేశం కేవలం నిధుల గురించి మాత్రమే కాదని, తెలంగా ణ రూపురేఖలను మార్చే హై-స్పీడ్ నెట్‌వర్క్ ప్రాజెక్టులకు సంబంధించిన గ్రీన్ సిగ్నల్ కోసమని చెబుతున్నారు. బుల్లెట్ రైళ్లు, అత్యాధునిక అర్బ న్ రవాణా కారిడార్ల నిర్మా ణానికి అవసరమైన ఇంధనాన్ని (ఫండిం గ్) ఈ సమావేశం అందించబోతోంది. ఢిల్లీ కమాండ్ రూమ్ నుండి వె లువడే ఈ సమావేశ నిర్ణయాలు ఎలా ఉం డబోతున్నాయో వేచి చూ డాలని, నిధుల సాధనలో తెలం గాణ సీఎం విజయం సాధిస్తారా అనే అనుమానం కూడా లేకపోలేదు.

    ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయాలి

    భార‌త వాయు సేన (IAF) ఆధ్వ‌ ర్యంలో నిర్మించ‌నున్న ఆది లాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అన్ని వ‌స‌తుల‌తో అభివృద్ధి చేయా ల‌ని రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని ముఖ్య‌ మంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశా రు. ముఖ్యమంత్రి ఢిల్లీలోని ర‌క్ష‌ణ శాఖ కార్యాల‌యం క‌ర్త‌వ్య భ‌వ‌న్‌ లో రాజ్‌నాథ్ సింగ్ తో భే టీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు ర‌క్ష‌ణ శాఖ భూ ములు బ‌ద‌లాయించినందుకు రా జ్‌నాథ్ సింగ్‌కి కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

    రాష్ట్ర ప్ర‌భుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఒక‌టైన ఆ దిలాబాద్ ఎ యిర్‌పోర్ట్ అభివృద్ధికి సంబంధించి భూ సేక‌ ర‌ణ‌, యుటిలిటీస్ బ‌ద‌లా యింపు అంశాల్లో పూర్తిగా స‌హ‌ కరిస్తామ‌ని కేంద్ర మంత్రికి తెలియ‌జేశా రు. ఆదిలాబాద్‌లో భార‌తీయ వా యుసేన ఆధ్వ‌ర్యంలో రానున్న విమానాశ్ర యం దేశ స‌మ‌గ్ర‌త‌, ర‌క్ష‌ణ‌ కు సంబంధించిన అంశమైనందు న‌, దానిని భారీగా విస్తరిస్తున్న నే ప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫు న అన్ని విధాలా స‌హ‌క‌రిస్తామ‌ని ముఖ్య‌మంత్రి తెలి పారు.భార‌త వాయు సేన టెర్మిన‌ల్‌తోపాటు ప్ర‌యాణికుల సౌక‌ర్యార్ధం నిర్మించ‌నున్న పౌర విమాన‌యాన శాఖ‌కు చెం దిన టెర్మిన‌ల్ బిల్డింగ్‌తో పాటుగా కార్గో, ఎంఆర్‌వో (MRO), హ్యాంగ‌ర్ (Hangar) సదుపాయాలను పెద్ద ఎత్తున ఏర్పా టు చేసేందుకు స‌హ‌క‌రించాల‌ని ఈ సందర్భంగా కేంద్ర మం త్రిని కోరారు.

    ఇటీవ‌ల మ‌ధ్య ఆసియాలో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యం లో ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన ఎయిర్‌ లైన్స్ త‌మ హ్యాంగ‌ర్స్‌ను ఏర్పాటు చేసుకోవ‌డానికి స‌రైన ప్ర‌దేశాల‌ను అన్వేషిస్తున్నాయ‌ని, హ్యాంగర్ ఏ ర్పాటుకు ఆదిలాబాద్ ఎ యిర్‌పోర్ట్ అత్యంత అనుకూల‌మైనందున,ఆ దిశ‌గా అభివృ ద్ధి చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.త‌మ కీల‌కమైన ప్రాజెక్టు ఏ ర్పా టుకు డీఆర్‌డీవో / డీఆర్‌డీఎ ల్ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా దే వ‌ర‌క‌ద్ర స‌మీప ప్ర‌దేశాన్ని ఎంపిక చేసుకున్నందున ఆ ప్రాజె క్ట్‌ను త్వ‌ర‌గా మంజూరు చేయాల‌ని ముఖ్య మంత్రి కేంద్ర మంత్రిని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.