ytda new board members announced : ప్రజా దీ వె న, నల్లగొండ: తెలంగాణ ప్ర జల ఆరాధ్యదైవం, యాదాద్రి ల క్ష్మీనరసింహ స్వామి ఆల య చరిత్రలో ఒక సరికొత్త అ ధ్యా యం మొదలైందని చెప్పవ చ్చు. కేవలం రాతి కట్టడాల సుం దరీకరణే కాకుండా ఇకపై ఆలయ పాలనలోనూ సరికొత్త వై భవాన్ని చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చే సింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యాదగిరి గుట్ట ల క్ష్మీనరసింహ స్వామి దేవ స్థానం (YTDA) నూతన పాలక మండలిని ఏర్పాటు చేస్తూ రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ప్రి న్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సరికొత్త ఉత్తర్వులు జారీ చేశారు.తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజి యస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం ప్రకారం రాబోయే రెండేళ్ల పాటు ఈసరి కొత్త బోర్డు ఆలయ ప్రగతి చక్రాలను తిప్పనుంది.
కొత్త సారథి.. వెరైటీ కాంబినేషన్
ఈ నూతన బోర్డుకు ఛైర్మన్‌గా ఎం. సత్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. రాబోయే రెండేళ్ల పాటు స్వామివారి సేవలో, భక్తుల సౌకర్యార్థం ఈ కమిటీ కీలక నిర్ణయాలు తీ సుకోనుంది. ఈ బోర్డులో కేవలం రాజకీయ నాయకులే కా కుండా సామాజిక, సినీ, అధికార వర్గాల కలయిక ఒక అద్భు తమైన ‘టీమ్’ను తలపిస్తోంది. మొత్తం 10 మంది ప్రధాన స భ్యులు, 7 గురు ఎక్స్-అఫీషియో సభ్యులతో కూడిన ఈ జంబో టీమ్ త్వరలోనే యాదగిరిగుట్ట కొండపై ప్రమాణ స్వీ కారం చేయనుంది.అయితే, ఈ జాబితాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఒక ప్రత్యేకమైన పేరు కొణిదెల సురేఖ మెగాస్టా ర్ చిరంజీవి సతీమణి కావడం గమనార్హం. ఆలయ బోర్డు లో ఆమె సభ్యురాలిగా చేరడం యాదాద్రి ఆధ్యాత్మిక ప ర్యా టకానికి మరింత గ్లామర్, మైలేజ్ తెచ్చి పెట్టడం ఖాయంగా కనిపిస్తోందన్న చర్చ వినిపిస్తోంది.
సరికొత్త పాలకమండలి ‘టీమ్’ ఇదే
భవిష్యత్తులో యాదాద్రిని తిరుమ ల స్థాయికి తీసుకెళ్లే బా ధ్యతను భుజాన వేసుకోబోతున్న ఆ 11 మంది సభ్యులు వీరే అనడంలో సందేహం లేదనిపిస్తోంది. ఛైర్మన్ గా ఎం. సత్యనారాయణ రెడ్డి, సభ్యులుగా వినోద్ వెంకటస్వామి (mla), కొణిదెల సురేఖ మెగా స్టా ర్ (చిరంజీవి భార్య), చిల పగారి రాజం, విజయేందర్,పోచబోయిన ఈశ్వరమ్మ యాద వ్, గుండు మల్లయ్య, స్వాతి కాంతమణి, ఎం. రాఘవేందర్ రావు, డాక్టర్ లక్ష్మీనారా యణ నాయక్, ది ఫౌండర్ ట్రస్టీ స భ్యులుగా కొనసాగుతారు.
ఆలయానికి వెన్నుదన్నుగా ఎక్స్అఫీషియోలు
పాలకమండలి నిర్ణయాలకు ప్రభుత్వ పరంగా వేగంగా రెక్క లు తొడ గడానికి, ఎక్కడా లోపాలు లేకుండా చూసు కోవడా నికి 7 గురు అగ్ర శ్రేణి అధికారులను ఎక్స్-అఫీషియో సభ్యు లుగా నియమించారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఎండోమెంట్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శా ఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, యాద గిరిగుట్ట టెం పుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్ గా, యాదగిరిగుట్ట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO), స్థానా చార్య లేదా సీనియర్ మోస్ట్ ప్రధా న అర్చకులు ఎక్స్అఫీషి యో సభ్యులుగా కొనసాగుతారు.
భక్తుల రద్దీని తట్టుకోవడం, విఐపి మేనేజ్మెంట్, ఘాట్ రోడ్ల అభివృద్ధి, కొండపై లడ్డూ ప్రసాదం క్వాలిటీ పెంచడం వంటి ఎన్నో సవాళ్లు ఈ నూతన బోర్డు ముందు ఉన్నాయ ని చె ప్పవచ్చు. మరి ఈ కొత్త టీమ్ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వా మి క్షేత్రాన్ని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా ఎలా తీర్చి దిద్దుతుందో భవిష్యత్తులో వేచి చూడాల్సి ఉంది.



