Monday, September 28, 2026
More
    HomeAndhrapradeshNalgonda SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, రెండు రాష్ట్రాల మో స్ట్...

    Nalgonda SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, రెండు రాష్ట్రాల మో స్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు చేసిన పోలీసులు 

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పో లీస్ శాఖకు సవాలుగా మారిన కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అత్యంత సా హసోపేతంగా అ రెస్టు చేశారు.జిల్లాలో వరుస చోరీలు జ రుగుతుండటంతో దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్‌ పి శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్లగొండ సీ సీ ఎస్ ఇన్‌స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి, మిర్యాలగూడ రూరల్ ఇన్‌స్పెక్టర్ పీ.ఎన్.డి. ప్రసాద్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు అత్యాధు నిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, వంద లాది సీసీటీవీ ఫుటేజీలను పరిశీ లించి, ఈ దొంగతనాల వెనుక ఉన్నది క రుడుగట్టిన పాత నేరస్థుడు భూష్మి శ్రీకాంత్ @ అమ్మిరాజు ము ఠా అని గుర్తించారు. ఈ మేరకు నల్లగొండ ఎస్పీ శరత్ చంద్రపవార్ బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమా వే శంలో పూర్తి వివరాలు వెల్లడించారు.

    జూన్ 30న ఔటర్ రింగ్ రోడ్ (OR R) వద్ద నిఘా పెట్టిన పో లీసులకు, నిందితుడు ఒక డీసీఎం వాహనంలో నాగా ర్జు నసాగర్ వైపు నుండి హైదరాబాద్ వస్తున్నట్లు సమాచా రం అందింది. పోలీసులు వాహనా న్ని వెంబడించి ఆపే ప్రయ త్నం చేయగా, నిందితుడు ఒక్కసారిగా కిందకు దూకి తన వద్ద ఉన్న ఇను ప రాడ్‌తో డ్యూటీలో ఉన్న సీసీ ఎ స్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి పై దాడికి తెగబడ్డాడు.ఈ క్రమం లో పోలీసులు ముందస్తుగా మూడు రౌండ్లు గాలిలో హెచ్చ రిక కాల్పులు జరిపారు. అయినప్పటికీ నిందితుడు లొంగ కుండా దాడిని కొనసాగిం చడంతో, పోలీసులు ఆత్మరక్షణ లో భాగంగా నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపి లొంగదీ సు కున్నారు.

    గాయపడిన నిందితుడిని వనస్థ లిపురం ప్రభుత్వ ఆసుప త్రికి తర లించి చికిత్స అందించారు. (పోలీ సులపై దాడికి సంబంధించి ఆది భట్ల పిఎస్‌లో Cr. No.532 /20 26 u/s 109, 121 BNS కింద విడిగా కేసు నమోదైంది). ఈ మేర కు ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం జిల్లా నర్సాపూర్ పరిధిలోని స్టేషన్ పేట కు చెందిన భూస్మి శ్రీకాంత్ @ అమ్మి రాజు (41) ముఠానాయ కు డుగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండ లం అంజనీపురం కు చెందిన వేల్పుల అతేంద్ర అలియా స్ అత్తిలి (21) లను అరెస్టు చేసి నట్లు ఎస్పీ తెలిపారు.

    ప్రధాన నిందితుడు శ్రీకాంత్ సా మాన్యుడు కాదు, ఇతనిపై గతం లో ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను హత్య చేసిన కేసు ఉం ది. జైలు నుండి విడుదలైన తర్వాత కూడా మారకుండా మ ళ్లీ రెండు రాష్ట్రాల్లో 42 కి పైగా చోరీలకు పాల్పడ్డాడు. రెండు రాష్ట్రాల్లోని 10 ప్రధాన నేరస్థ లాల్లో ఇతని వేలిముద్రలు ల భ్యమవ్వగా, నల్లగొండ జిల్లాలోనే 8కేసులలో ఇతడిని నిం దితునిగా గుర్తించారన్నారు.

       పోలీస్ సిబ్బందికి పురస్కారాలు

    ప్రాణాలకు తెగించి కరుడుగట్టిన ముఠాను పట్టుకున్న ఇన్‌ స్పెక్టర్లు జితేందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పి. ఎన్.డి. ప్రసాద్, ఎస్.ఐ విజయ్ కు మార్ మరియు హెడ్ కానిస్టేబుల్ విష్ణువ ర్ధనగిరి సహా సిబ్బంది అందరినీ జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అ భినందించి, వారికి నగదు బహుమ తులు మరియు ప్రశం సా పత్రాలను ఎస్పీ శరత్ చంద్రపవార్ ప్రకటించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.