Sunday, September 27, 2026
More
    HomeAndhrapradeshThree Women of Same Family Die by Suicide in Guduru : బిగ్...

    Three Women of Same Family Die by Suicide in Guduru : బిగ్ బ్రేకింగ్, కృష్ణా జిల్లా గూడూరు లో విషాదం, ఒకే ఫ్యామిలీలోని ముగ్గురు మహిళలు బలవర్మరణం

    📰 Generate e-Paper Clip

    Three Women of Same Family Die by Suicide in Guduru: ప్రజా దీవెన, విజయవాడ:నిశ్శబ్ద రోదనలు లేని రేపటి కోసం గూడూరు విషాదం నేర్పినపాఠం. అచంచలమై న నమ్మకం, ఒకరికొకరు అండగా ఉంటామనే ధీమా కొరవ డిన చోట ని రాశ ఎంతటి ఘోరా నికి దారితీస్తుందో గూడూ రులో జరిగిన సంఘటన మనకు మరోసారి గుర్తుచేసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు మానసిక సంఘర్షణకు తాళ లేక, ఉరివేసుకుని బలవన్మరణానికి పా ల్పడటం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. అయితే, ఈ విషాదం కేవలం ఒ క వార్తగా మిగిలిపోకూడదు. భవిష్యత్తు లో ఇలాంటి ఘోరాలు పునరావృతం కాని ఒక ఆరోగ్యకర మైన సమాజాన్ని మనంనిర్మించుకోవాల్సిన అవసరం ఎంతై నాఉంది.

    ఆర్థిక ఇబ్బందులో, వ్యక్తిగత సమస్యలో తెలియదు కానీ, ముగ్గురు మహిళలు ఒకేసారి అంతటి కఠి నమైన నిర్ణయం తీసుకున్నారంటే వారు ఎంతటి మానసిక క్షోభను అ నుభ వించి ఉంటారో ఊహించవచ్చు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రా మంలోనూ, వార్డులోనూ ఉచిత మానసిక కౌన్సిలింగ్ కేంద్రా లు అందుబాటులోకి రావాలి. మనస్తాపానికి గురైన వారు తమ బాధను పంచుకోవడానికి 24/7 అందుబాటులో ఉం డే హెల్ప్‌లైన్ వ్యవస్థలు మరింత పటిష్టం కావాలని ఆశిస్తు న్నారు.

    సమాజం బాధ్యత ,ఒకరికొకరు తోడుగా

    టెక్నాలజీ పెరిగి మనుషుల మధ్య దూరం పెరుగుతున్న ఈ కాలంలో, పక్కింటి వారి కష్టసుఖాలను తెలుసుకునే తీరిక లేకుండాపోతోంది. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ తమ చు ట్టు పక్కల వారు ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారో గమనించే సం స్కృతి పెరగాలని కూడా సూచిస్తున్నారు. “నేనున్నాను” అనే ఒక్క నమ్మకం మనిషిని చావు అంచుల నుండి వెనక్కి తీసుకురాగలదు. ఆ నమ్మకాన్ని ఇచ్చే బాధ్యత మన స మా జానిదేనని గుర్తు చేస్తున్నారు.

    గూడూరులో బలవన్మరణానికి పాల్పడిన ఆ ముగ్గురు మ హిళల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆశి ద్దామని, ఈ నిశ్శ బ్ద రోదనలు ఇక్కడితో ఆగిపోవాలి. సమస్య ఏదై నాప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాద ని భవిష్యత్తులో ఏ ఒక్కరూ ఒంట రితనం వల్లనో, ఆశాభంగం వల్లనో ప్రాణాలు తీసుకునే ప రి స్థితి రాకూడదని, అందరం కలిసి ఒక సురక్షితమైన, ఆదరిం చే సమాజాన్ని నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేద్దామని అప్పీల్ చేస్తు న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.