Sunday, September 27, 2026
More
    HomeOpinionTungaturthi Water Crisis : తుంగతుర్తి ‘తటాక’ శోకం, ఆకాశం వైపు చూపు.. కాలువల వైపుఆశ...

    Tungaturthi Water Crisis : తుంగతుర్తి ‘తటాక’ శోకం, ఆకాశం వైపు చూపు.. కాలువల వైపుఆశ ఏ నిముషానికా నిరాశ

    📰 Generate e-Paper Clip

     

    Tungaturthi Water Crisis : ప్రజా దీవెన, తుంగతుర్తి: ఒ కప్పుడు గోదావరి జలాల పరవళ్లతో ‘ప సిడి’ పండిన నేల.. నేడు చుక్క నీరు లేక ‘ఎడారి’ని తలపిస్తోంది. అటు వరుణు డు కరుణించక, ఇటు గోదావరి జలాలు రాక తుంగతుర్తి ని యోజకవర్గ రైతాంగం కన్నీటి ప ర్యంతమవుతోంది.గడిచిన ఐదారు సంవత్సరాలుగా కాలేశ్వరం ప్రాజె క్టు పుణ్యమా అ ని తుంగతుర్తి రూపురేఖలే మారిపోయాయి. ఎటు చూసినా నిండు కుండల్లా మెరిసిన చెరువులు, కుంటలు.. పచ్చటి పొ లాలతో కళకళలాడిన బీడు భూ ములు నిన్నటి వరకు ఒక అందమై న స్వప్నం. కానీ, గత రెండున్నర ఏళ్లుగా ఆ కల కా స్తా కరిగిపోతోంది.గోదావరి జలాలు అరకొరగా రావడం.. ఈ ఏడాది వానలు కూడా ముఖం చాటేయడంతో సస్యశ్యా మ లమైన నేలలు మళ్లీ పాత కరవు రోజుల్లోకి జారుకుంటున్నా యి.

    ఏతకు వచ్చిన నార్లు.. వేయలేకపోతున్న నాట్లు

    రైతన్నలు వేలాది రూపాయలు అ ప్పులు చేసి, ఆశలతో వరి నార్లు అ యితే పోశారు. నారు ముదిరి ‘ఏ త’కు వచ్చి నా పొలాల్లో నీటి చుక్క లేక నాట్లు వేయలేని దుస్థితి. అధి కారులు “మెట్ట పంటలు వేసుకోం డి” అని సలహాలు ఇస్తు న్నా, అప్పటికే వేసిన పత్తి విత్తనాలు వర్షం లేక మొలక దశ లోనే వాడిపోతున్నాయి. గుంటుకలు తిరగాల్సిన పత్తి చే లు.. తేమ లేక భూమికే అంటు కుపోతుంటే రైతుల గుండె లు చెరువవుతున్నాయి.

      అడుగంటిన భూగర్భం.. ఒక రైతు – నాలుగు బోర్లు

    గోదావరి జలాలు ఉన్నప్పుడు భూ గర్భ జలాలు ఉరకలెత్తా యి.. బోర్ల బండ్లు ఊళ్లలోకి రావడం ఆగిపో యింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఒక్కో రైతు మూడు నుంచి నాలుగు బోర్లు వేస్తున్నా ఫ లితం శూన్యం. వేలాది రూపా యలు ఖర్చు పెట్టి వేసిన బోర్లలో ఏదో ఒకదానిలో అరకొర నీరు వస్తున్నా అది దేనికీ చాలడం లేదు.ఐదు ఎకరాలు నా టు వేయాల్సిన రైతు.. కేవలం ఎకరం, రెండెకరాలకే పరి మితం కావాల్సి వస్తోంది.

    రాజకీయ ‘రాద్ధాంతం’.. రైతుల ‘అగమ్యగోచరం’

    గోదావరి నీళ్లు సముద్రం పాలవు తున్నా, తుంగతుర్తి కాలు వల్లోకి మాత్రం రావడం లేదు.నీళ్లు లిఫ్ట్ చేయాలి అని కొంద రు నేతలంటే.. లిఫ్ట్ చేస్తే ప్రాజెక్టులు తెగుతాయి అని మరి కొందరు భయపెడుతు న్నారు. ఈ రాజకీయ విమర్శలు అ ర్థం కాక, అసలు తమకు నీళ్లు ఎందుకు రావడం లేదో తెలి యక సామాన్య రైతు తలలు పట్టుకుం టున్నాడు. గత ఏ డాది కనీసం చె రువులైనా నిండాయి, ఈ ఏడాది ఆ పరిస్థితి కూడా లేదా? అని నిలదీస్తున్నాడు.

      ప్రభుత్వమా.. ఆలకించు ఈ ఆవేదన

    యూరియా కోసం యాప్ల చుట్టూ తిరగలేక, ఎరువులు కొం దామన్నా చేతిలో పైసలు లేక, వరుణుడి కరుణ కోసం ఆకా శం వంక చూస్తూ.. గోదావరి నీళ్ల కోసం కాలువల వంక చూ స్తూ తుంగతుర్తి రైతాంగం నర కయాతన అనుభవిస్తోం ది.ఈ తీవ్ర వర్షాభావ పరిస్థితులను, ఎండిపోతున్న చెరువు లను గమనించి రా ష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించా లి. రాజకీయాలకు అతీతంగా గో దావరి జలాలను విడుదల చే సి, తుంగతుర్తి అన్నదాతను ఈ కరవు కోరల నుండి రక్షించా లని యావత్ రైతాంగం చేతులు జోడించి వేడుకుంటోంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.