Saturday, October 10, 2026
More
    HomeOpinionMinister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీ లక అప్పీల్, వరిపంట...

    Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీ లక అప్పీల్, వరిపంట వద్దు, ఆ రుతడి పంటలే ముద్దు 

    📰 Generate e-Paper Clip

    Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: ఎల్ నినో కారణంగా ప్రస్తుతం నాగార్జునసా గర్ ప్రాజెక్టులో ఉన్న నీరు తాగు నీటికే సరిపోతుందని, అంతేకా క పైనుండి నీరు వచ్చే అవకాశం కూడా లేనందున రైతులు ఎట్టి పరిస్థితులలో వరి వేయకుండా ఆరు తడి పంటలు వే సుకునేలా అధికారులు అవగాహన కల్పిం చాలని రాష్ట్ర రో డ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కో మటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారు లను ఆదేశించారు.ఒకవేళ నాగా ర్జు నసాగర్ నిండినప్పటికీ చెరువులు నింపే పరిస్థితి లేదని, ఇ ప్పటికే బోర్లలో కూడా గ్రౌండ్ వా టర్ తగ్గిపోతున్నందు కష్ట కాలంలో అధికారులు ప్రజా ప్రతినిధులు రైతులకు అండగా నిలబడి ఆరుతడి పంటలు వేసుకునేలా చూడాల్సిన అవ సరం ఉందని ఆయన అన్నారు.

    శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మం దిరం లో నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి స మావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం నాగార్జు నసాగర్ ప్రాజెక్టులో నీరు డెడ్ స్టో రేజ్ లో ఉందని, శ్రీశైలం నుండి నీ రు వచ్చినప్పటికి పంటలకు సా గునీరు ఇచ్చే పరిస్థితి లేదని, ఉ న్న నీరు జూన్ 2027 వర కు తాగునీటికే సరిపోతుందని, వీటన్నిటిని దృష్టిలో ఉంచు కొని రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని కోరారు.

    ఏఎంఆర్పి కూడా సగమే నిండిందని, గతంలోఎప్పుడు ఇ లాంటి పరిస్థితి లేదని, రా బో యే రోజుల్లో సూపర్ ఎల్ నినో కా రణంగా దక్షిణ తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉంటా యో తెలియని పరిస్థితి నెలకొందని, అందువల్ల అధికారు లు, ప్రజాప్రతిని ధులు రైతులు ఆరుతడి పంటలు వేసుకు నేలా కష్టపడి పనిచే యాలని, ఇలాంటి కరువు పరిస్థితుల్లో రైతు లకు అందరూ అండ గా ఉండాల్సిన అవసరం ఉంద న్నా రు. జిల్లాలో పంట మార్పిడి లో భాగంగా 33 వేల ఎక రాల లో వరికి వదులు ఆరుతడి పంటలు వేయడం జరిగిం దని ,అయితే దీన్ని లక్షన్నర ఎకరాల లక్ష్యంగా తీసుకుని రైతు లతో ఆరుతడి పంటలు వేయించాలన్నారు.

    జిల్లాలో 9 వేల ట్రాన్స్ఫార్మర్ల పై ఉన్న ఓవర్ లోడ్ ను దృష్టి లో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి అవసర మై న విద్యుత్ సామాగ్రిని తెప్పిస్తామన్నారు. కరువు వచ్చిన ప్పటికి నల్గొండ జిల్లాకు శాశ్వతంగా సాగునీరు అందించే ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ఆగస్టు 2028 నాటికి పూర్తి చేస్తామని, పనులు కొనసాగుతున్నాయని, ఎఎం ఆర్ర్పీ, ఎ స్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లేముల ద్వారా జిల్లాలో నాలుగు ల క్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు.

    ఎస్ఎ ల్బీసీ కోసం ఎంతైనా ఖర్చు చేయాలని రాష్ట్ర ముఖ్య మంత్రి ఆదేశించారని, కరువు వచ్చినా సరే శ్రీశైలం డెడ్ స్టో రేజ్ లో ఉన్నప్పటికీ ఎస్ఎల్బీ సీ నుండి సాగునీరు అం దిం చవచ్చన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కష్ట కా లంలో రైతులకు అండగా ఉండాలని, ప్రజలకు ధైర్యం చెప్పా లని, ఆరుతడి పంటలు వేసుకునే విధంగా రైతులకు అవగా హన కల్పించాలన్నారు.

    ఇకపై జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశాలను నిరం తరం నిర్వహించాలన్నారు. జిల్లా లోని వివిధ ప్రాజెక్టుల కిం ద రైతు లు రెండు పంటలు వరి వేస్తున్నా రని, దీనివల్ల భవి ష్యత్తులో భూ ములు సారం కోల్పోయి ఎందుకు పనికి రా కుండా పోతాయని, విపరీతంగా ఎరువులు వాడడం, నిరం తరం వరి సాగు చేయటం వల్ల భవిష్యత్ లో ఎలాంటి పం టలు వేసుకోలేని పరిస్థితి వస్తుం దన్న విషయాన్ని రైతులకు అవ గాహన కల్పించాలన్నారు.

    ఇందులో భాగంగా కూర గాయల పం టలు, ఉద్యాన పంట లు పండించాలని, ఆర్గానిక్ వ్యవసాయం చేసే విధంగా రైతు లకు అవగాహ న కల్పించాలని, జిల్లాకు 5వేల యూనిట్ల స్ప్రింక్లర్లు కావాలని అ ధికారులు కోరగా తక్షణమే వాటి ని మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని మం త్రి తెలిపారు.

    ఎంఎల్ సి శంకర్ నాయక్ మాట్లాడుతూ ఎల్ నినో వల్ల రా బోయే రోజుల్లో సాగునీటికి మరింత ఇబ్బంది ఏర్పడే ప్రమా దం ఉందని, అందువల్ల పంట మార్పిడి పై రైతుల వద్దకు వెళ్లి చెప్పాల్సిన అవసరం ఉందని, ప్రజాప్రతినిధులు, అధి కారులు కలిసి పని చేసి రైతులను చైతన్యం చేయాలని, ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నందున పంట మార్పిడి కిం ద మెట్ట పంటలు వేసుకునే విధంగా చైతన్యం చేయాలన్నా రు.

    జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎల్ నినో వల్ల వర్షాలు లేనం దున ప్రాజెక్టుల్లో కూడా సరైనంత నీరు లేదని, రానున్న రోజుల్లో పై నుండి సాగునీరు వచ్చే అవకాశాలు లే వని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో రై తులు వేసుకోబోయే పంటలు, తాగునీరు, ఇతర సౌకర్యాల పై చర్చించి ప్రణాళిక రూపొందించేందుకు జిల్లా సాగునీటి సలహా మండల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. సెప్టెంబర్ లో కూడా సూపర్ ఎల్ నినో ప్రభావం ఉంటుం దని ఉత్తర తెలం గాణకు మాత్రమే అక్కడక్కడ వర్షాలు వ చ్చే అవకాశం ఉందని, దక్షిణ తెలంగాకు వర్షాలు లేవన్న వా తావరణ శాఖ సూచనలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవ సరం ఉందని , రైతులు పంటల మా ర్పిడిలో భాగంగా ఆరు తడి పంటలు వేసుకోవాలని, ఆగస్టు 15 వరకు మాత్రమే ఆరుతడి పంట లు వేసుకునేందుకు అవకాశం ఉ న్నందున వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వె ళ్లి రైతులను చైతన్యం చేయాలని కోరారు.మున్సిపాలిటీలలో రూ ప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ను ప్రోత్సహించాలని కలెక్టర్ అ న్నారు.

    నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి, తదితరులు మాట్లాడారు.స్థానిక సంస్థల ఇం చార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కర ణ్ రెడ్డి, జిల్లా నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మే యర్ ఆమీర్ అలీ,హాలియా నిడ మనూరు పిఏసిఎస్ అధ్యక్షులు, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్,చిట్యాల మార్కె ట్ కమిటీ చైర్మన్, తదితరులు హాజరయ్యారు. కాగా ప్రాజెక్టులు, గ్రౌండ్ వాటర్, వ్యవసాయ, ఉ ద్యాన శాఖల అధికారులు, వి ద్యుత్ అధికారులు డిఆర్డిఓ ప్ర స్తుతం సాగునీటి పరిస్థితి, పం టలు, రాబోయే రోజుల్లో చేపట్ట వలసిన కార్యాచరణ పై సమా వేశానికి వివరించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.