
Nalgonda vinayaka nimajjanam : ప్రజా దీవెన, వేము లపల్లి: వినాయక నవరాత్రులు ముగియడంతో గణనాథుడి నిమజ్జనానికి భ క్తులు పెద్ద సంఖ్యలో వేములపల్లి వద్దకు చే రుకున్నారు. అయితే ని మజ్జనం కోసం ఏర్పాటు చేసిన నా గార్జునసాగర్ ఎడమకాలువ లో సరిపడా నీరు లేకపోవడం తీ వ్ర అసహనానికి దారితీసింది. ఇప్పటికే కొన్ని విగ్రహాలను కాలువ లో నిమజ్జనం చేయగా, నీటిమట్టం తక్కువగా ఉం డటంతో అవి పూర్తిగా మునగకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
నల్లగొండ, మిర్యాలగూడ ప్రాం తాల నుంచి గణేష్ విగ్రహాల తో వేములపల్లికి చేరుకున్న ఉత్సవ కమిటీలు, భక్తులకు క్షే త్రస్థాయి లో కనిపించిన పరిస్థితి ఆందోళన కలిగించింది. నీ టిని విడుదల చేశామని చెబుతున్నప్పటికీ.. నిమజ్జన ప్రదే శంలో మాత్రం సరిప డా నీరు ఎందుకు కనిపించలేదంటూ వారు ప్రశ్నించారు.
ప్రకటనలు వేరు.. క్షేత్రస్థాయి పరిస్థితి వేరా?
గణేష్ నిమజ్జనాల కోసం నీటిని విడుదల చేసినట్లు ప్రభు త్వం, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రకటిం చినప్పటికీ వేముల పల్లి కాలువలో నీటి లభ్యత మాత్రం అందుకు భిన్నంగా కని పించిందని స్థాని కులు పేర్కొన్నారు. దీంతో ఎప్పుడు నీటిని విడుదల చేశారు? ఎంత పరిమాణంలో నీటిని విడుదల చే శారు? ఏ కాలువ నుంచి ఎంత ప్రవాహం వచ్చింది? వేము లపల్లి వరకు వాస్తవంగా ఎంత నీరు చేరింది? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
వేలాది మంది భక్తులు పాల్గొనే నిమజ్జన కార్యక్రమానికి ముందుగానే నీటి లభ్యత, భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించా ల్సిన అవసరం ఉందని స్థానికులు అంటు న్నా రు. ఏర్పాట్లలో లో పాలు ఉంటే భక్తులు ఇబ్బందులు ఎదు ర్కోవాల్సి వస్తుందని ఆ వేదన వ్యక్తం చేశారు.
అధికారుల అత్యవసర స్పందన
వేములపల్లి వద్ద నీటి కొరతపై భక్తుల నుంచి అసహనం వ్య క్తమవుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించినట్లు స మాచారం. రోడ్లు భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి చొరవతో గణేష్ నిమజ్జనాల కోసం సాగర్ ఎడమకాలు వలోకి నీటిని విడుదల చేయాలని అత్యవసరంగా ఆదేశా లు ఇచ్చారు.అధికారుల ఆదేశాలతో విడుదలైన నీరు సా యంత్రం వరకు వేములపల్లి ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో నిమజ్జనానికి వచ్చి న భక్తులకు కొంత ఊరట లభించే ప రిస్థితి ఏర్పడింది.
అయితే నిమజ్జనానికి ముందే నీటి లభ్యతపై పూర్తి స్థాయి లో సమన్వయం జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్థా నికులు అభిప్రాయపడుతున్నారు.ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య వ్యత్యాసం ఎందుకు ఏర్పడిందో ప్రభు త్వం స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. ప్రజలకు మా టలు మాత్రమే కాదు.. క్షేత్రస్థాయిలో కనిపించే ఫలితాలే కా వాలి అంటూ భక్తులు, స్థానికులు పేర్కొంటున్నారు.





