Minister Komatireddy : ఎల్ నినో ఎఫెక్ట్‌పై మంత్రి కోమటి రెడ్డి కీలక వ్యాఖ్య, కరువు పరిస్థి తులను ఎదుర్కొనేందుకు ఇంజ నీర్లు సూచనలివ్వాలి

–SLBC సొరంగం పూర్తయితే ఫ్లోరైడ్ కు శాశ్వత పరిష్కారం
Minister Komatireddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో ఎల్ నినో ప్ర భా వంతో వర్షాభావ పరిస్థితులు నె లకొన్న నేపథ్యంలో సాగునీరు, వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవ సరం ఉందని రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖ మం త్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నా రు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వర య్య ఇంజనీర్స్ భవన్లో “ఎల్ నినో ఎఫెక్ట్ – సాగునీటి రంగం & వ్యవసాయం” అంశంపై నిర్వ హించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు.నల్లగొండకు చెందిన ప్రముఖ ఇంజనీర్ గుర్రం కోటిరెడ్డి చిత్ర పటానికి మంత్రి నివాళులర్పించి, ఆయన సేవలను స్మరించుకు న్నారు. అనంతరం గుర్రంకోటి రె డ్డి మెమోరియల్ అవార్డు గ్రహీ తలను సన్మానించి అవార్డులను అందజేశారు.
ఇంజనీర్ల సూచనలు అవసరం
ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం తో వర్షాలు తగ్గి రైతులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని తెలి పారు. కరువు పరిస్థితులను ఎ దుర్కొనేందుకు ప్రభుత్వానికి ఇం జనీర్లు విలువైన సూచనలు ఇ వ్వాలని కోరారు. ప్రస్తుత పరిస్థి తుల్లో ప్రభుత్వం తాగునీటికి అ త్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.“ఇంజనీర్లు లేనిదే దేశం లేదు. వ్యవసాయ రంగం లో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకం” అని మంత్రి పేర్కొన్నారు.
ఎస్ఎల్ బిసితో ఫ్లోరైడ్‌కు శాశ్వ త పరిష్కారం
నల్లగొండ జిల్లాకు అత్యంత కీల కమైన SLBC సొరంగం ప్రాజె క్టుపై మంత్రి కీలక వ్యాఖ్యలు చే శారు. SLBC సొరంగాన్ని పూర్తి చేసేందుకు జరుగుతున్న ప్రయ త్నాల్లో ఇంజనీర్ల పాత్ర కీలకమని అన్నారు.“SLBC సొరంగ మార్గం పూర్తయితే నల్లగొండ జిల్లాలో ఫ్లో రైడ్ సమస్యకు శాశ్వత పరిష్కా రం లభిస్తుంది. గ్రావిటీ ద్వారా రెండు పంటలకు సాగునీరు అం దించే అవకాశం ఉంటుంది. SL BC సొరంగం పూర్తయితే నా జ న్మ ధన్యమవుతుందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సీఈ గా శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేప ట్టిన తర్వాత సొరంగం పనులు వేగంగా జరుగుతున్నాయని మం త్రి తెలిపారు.
గుర్రం కోటిరెడ్డి, శ్యామ్ ప్రసాద్ సేవల స్మరణ
ఇంజనీర్ గుర్రం కోటిరెడ్డి తన ని యోజకవర్గంలోని తిప్పర్తి మం డ లానికి చెందినవారని మంత్రి గు ర్తుచేశారు. తిప్పర్తికి వెళ్లిన ప్రతి సారీ కోటిరెడ్డి గుర్తుకు వస్తారని అన్నారు.అదే విధంగా రిటైర్డ్ ఇం జనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిజా యితీకి మారుపేరుగా నిలిచారని కొనియాడారు. బ్రాహ్మణ వెల్లెంల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నీటిని చూస్తున్నప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గుర్తుకు వస్తారని మంత్రి పే ర్కొన్నారు.తెలంగాణలో ప్రా జె క్టుల నిర్మాణంలో విశేష సేవలం దించిన ఇంజనీర్లందరినీ ఈ సం దర్భంగా స్మరించుకుంటున్నానని తెలిపారు.
రూ.20 వేల కోట్లతో హామ్ రోడ్లు
రోడ్ల అభివృద్ధిపై కూడా మంత్రి కీ లక ప్రకటన చేశారు. తన ఆధ్వ ర్యంలోని ఆర్అండ్బీ శాఖ, మం త్రి సీతక్క ఆధ్వర్యంలోని పంచా యతీరాజ్ శాఖల ద్వారా తొలి దశలో సుమారు రూ.20 వేల కో ట్లతో HAM రోడ్లను నిర్మిస్తున్నా మని తెలిపారు.ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం కల్పించడం తో పాటు.. గ్రామం నుంచి మం డల కేంద్రానికి, మండలం నుంచి జిల్లా కేంద్రానికి మెరుగైన కనెక్టివి టీ కల్పించడమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నామని చెప్పా రు. అవసరాన్ని బట్టి సింగిల్ లేన్ రోడ్లను డబుల్ రోడ్లుగా, ఫోర్ లే న్ రోడ్లుగా అభివృద్ధి చేయనున్న ట్లు మంత్రి వివరించారు.
అవార్డు గ్రహీతలకు సన్మానం
గుర్రం కోటిరెడ్డి మెమోరియల్ అ వార్డులను చంద్రమౌళి – రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్,శ్రీపతి నరసింహ రెడ్డి – మాజీ అధ్యక్షులు, జాతీ య భవనాల అసోసియేషన్
అందుకున్నారు.ఈ కార్య క్రమం లో చీఫ్ సైంటిస్ట్ మురళి, FIE చై ర్మన్ ప్రొఫెసర్ రమణ నాయక్, కార్యదర్శులు వెంకటేశం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.




