IndiaOpinionPoliticsక్రైంజాతీయంతెలంగాణనల్గొండహైదరాబాద్

Jhiram Ghati Case Verdict : బిగ్ బ్రేకింగ్, ఝిరం ఘాటీ కేసు లో సంచలన తీర్పు, 10 మందికి మరణశిక్ష

--13 ఏళ్ల నాటి మారణహోమానికి కీలక మలుపు --30 రోజుల్లో హైకోర్టుకు అప్పీల్‌కు అవకాశం

 

Jhiram Ghati Case Verdict : ప్రజా దీవెన, రాయ్‌పూర్: ఛత్తీస్గ ఢ్‌ను కుదిపేసిన ఝిరం ఘాటీ మారణకాండకు సం బంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 13లో మావోయి స్టులు జరిపిన ఘోర దాడిలో 29 మంది ప్రాణాలు కోల్పోయిన ఘ టనకు సంబంధించి 10 మంది దోషులకు ప్రత్యేక NIA కోర్టు మ రణశిక్ష విధించింది. ఈ తీర్పుతో 13 ఏళ్లకు పైగా కొనసాగుతున్న కేసు మరో కీలక దశకు చేరుకుంది. 2013 మే 25న బస్తర్ జిల్లా దర్భా పోలీ స్ స్టేషన్ పరిధిలోని ఝిరం ఘాటీలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పరివర్తన ర్యాలీలో పాల్గొని తిరిగి వెళ్తున్న కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్‌పై మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ అ ధ్యక్షుడు నంద్‌ కుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్, నాటి అసెంబ్లీ ప్రతి పక్ష నేత మహేంద్ర కర్మ, మాజీ కేంద్రమం త్రి విద్యాచరణ్ శుక్లా, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముద లియా ర్‌తో పాటు పలువురు కాoగ్రెస్ నాయకులు మరణించారు. భద్రతా సిబ్బంది, పౌరులు కూడా ఈ దాడిలో ప్రాణాలు కో ల్పో యారు.

  101 మంది సాక్షులు, భారీగా ఆధారాల పరిశీలన

కేసు విచారణలో భాగంగా 101 మంది సాక్షుల వాంగ్మూలా లను నమోదు చేసిన కోర్టు.. పెద్ద సంఖ్యలో పత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించింది. ఈ నెల ప్రారంభంలో జగదా ల్పూర్‌లోని ప్ర త్యేక NIA కోర్టు 10 మందిని దోషులుగా ని ర్ధారించింది. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

24 అభియోగాల్లో 7 కింద మరణశిక్ష

తాజా తీర్పులో 10 మంది దోషు లకు సంబంధించి మోపిన 24 అ భియోగాల్లో 7 అభియోగాల కింద మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఒక్కొక్కరికి రూ.800 జరిమానా కూడా విధించింది. అయి తే మరణశిక్ష తక్షణమే అమల్లోకి రాదు. హైకోర్టు ఉత్తర్వులు వెలువడిన తర్వాతే శిక్ష అమలు ప్రక్రియ ముందుకు సాగుతుంది. అ ప్పటి వరకు దోషులు కేంద్ర కారా గారంలోనే ఉంటారు. తీ ర్పుపై30 రోజుల్లోపు హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకా శం కూడా కోర్టు కల్పించింది.

కుట్ర కోణంపై భూపేష్ బఘేల్ ప్రశ్నలు

ఇదిలా ఉండగా, ఝిరం ఘాటీ దాడి దర్యాప్తుపై కాంగ్రెస్ నే త, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ గతంలో పలు సం దర్భాల్లో ప్రశ్నలు లేవనెత్తారు. ఈ దాడి వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)కు స్వతంత్రంగా దర్యాప్తు చేసే అవకాశం కల్పించి ఉంటే, కుట్ర వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించే అవకాశం ఉండేదని ఆయన పేర్కొ న్నా రు.13 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో ప్రత్యేక NIA కో ర్టు తాజా తీర్పు వెలువరించడంతో.. ఇక హైకోర్టు దశలో కే సు ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మా రింది.

Related Articles

Back to top button