IndiaOpinionPoliticsజాతీయంతెలంగాణహైదరాబాద్

UPI Charges on Transactions Up to ₹2,000 : బిగ్ బ్రేకింగ్,యూపీఐ వినియోగ దారులకు భారీ ఊరట, రూ.2 వే ల వరకు చార్జీలకు చెక్, కేంద్రం కీ లక ఆదేశాలు

UPI Charges on Transactions Up to ₹2,000 : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: యూపీఐ వినియోగదారులకు కేంద్ర ప్రభు త్వం కీలక ఊరటనిచ్చింది.రూ.2 వేల వరకు చేసే యూపీఐ చెల్లిం పులపై ఎలాంటి రుసుము వసూ లు చేయరాదని స్ప ష్టం చేసింది. బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొ వైడర్లు ప్రత్య క్షంగా లేదా పరోక్షం గా కస్టమర్లపై ఎలాంటి చార్జీలు విధిం చకూడదని ఆదేశించింది. అంతేకాకుండా రూ.2 వేల వరకు రూపే డెబిట్ కార్డు చెల్లింపులపై నా ఎలాంటి చార్జీలు ఉండ వని కేంద్రం వెల్లడించింది. అయితే రూ.2 వేలకుపైగా జరిగే కొన్ని ర కాల వ్యాపార లావాదేవీలపై మ ర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వి ధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

    భారీగా సాగుతున్న యూపీఐ లావాదేవీలు

దేశంలో డిజిటల్ చెల్లింపుల విని యోగం భారీగా పెరుగుతు న్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.2025-26 ఆర్థిక సంవ త్సరంలో రూ.2 వేల వరకు జరిగి న యూపీఐ లావాదేవీల విలువ రూ.24 వేల కోట్లకు పైగా ఉన్న ట్లు సమాచారం. మొత్తం యూ పీఐ లావాదేవీల్లో ఇవి సుమారు 4 శాతం కాగా, విలువ పరంగా దాదాపు మూడింట రెండు వం తుల వాటాను కలిగి ఉన్నట్లు కేం ద్రం పేర్కొంది.

     చట్ట సవరణ తర్వాత బిల్లు

ఇటీవల పార్లమెంటు ఆమోదిం చిన పన్నులు, ఇతర చట్టా ల (స వరణ) బిల్లు–2026 ద్వారా చెల్లింపుల పరిష్కార వ్యవస్థల చ ట్టం–2007లోని సెక్షన్ 10Aకు సవరణలు చే శారు. ఈ నేపథ్యం లో తాజాగా కేంద్రం ఈ మేరకు నోటిఫి కేషన్ జారీ చేసింది. రూ. 50 కోట్లకు పైగా వ్యాపార టర్నో వర్ ఉన్న వ్యక్తులు ఎలక్ట్రానిక్ విధానాల్లో చెల్లింపులు స్వీక రించే సందర్భంలో బ్యాంకులు లేదా సి స్టమ్ ప్రొవైడర్లు నిర్ది ష్ట చెల్లింపు వి ధానాలపై రుసుము విధించకూ డదనే నిబం ధనలు ఉన్నాయి. ఇందులో రూపే డెబిట్ కార్డులు, భీమ్-యూపీఐ,యూపీఐ-క్యూఆర్ కోడ్ వంటి విధానాలు ఉన్నా యి.

అయితే తాజాగా చేసిన సవరణతో ఈ-కామర్స్ సంస్థల యూపీ ఐ, రూపే డెబిట్ కార్డు చెల్లింపులపై MDR విధించే అవకాశాలకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. మొ త్తంగా, చిన్న మొ త్తాల డిజిటల్ చెల్లింపులపై అదనపు భా రం పడకుండా కేంద్రం తీ సుకున్న తాజా నిర్ణయం కోట్లాది యూపీఐ వినియోగదారులకు ఊరటనిచ్చే అంశంగా మా రింది.

Related Articles

Back to top button