
Thungathurthi Ex MLA Statue : ప్రజా దీవెన, తుంగ తుర్తి: దివంగత నేత, మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నా యకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణకు తుంగ తుర్తి నియోజకవర్గంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతు న్నాయి. అక్టోబర్ 1న ఆర్వపల్లి మండల కేంద్రంతో పాటు తిరుమ లగిరి మండలం వెలిశాల వద్ద దామోదర్ రెడ్డి విగ్ర హాలను ఆవిష్కరించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి.ఈ నేప థ్యంలో బుధవారం ఏఐసీసీ స భ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విగ్రహ స్థాపన కోసం జరుగుతు న్న నిర్మాణ పనులను పరిశీలిం చారు. పనుల పురోగతిపై కాం గ్రె స్ నాయకులను అడిగి తెలుసు కున్న ఆయన, అవసర మైన సూచనలు, సలహాలు అందించారు.
ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గా నికి అందించిన సేవలు, అభివృద్ధి కార్యక్రమాలను నాయకు లు, కార్యకర్తలతో ఆయన పంచుకున్నారు.ఈ కార్యక్రమం లో సూర్యాపేట జి ల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపాటి నరస య్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వేలాదిగా తరలిరానున్న అభిమానులు
దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తుంగతుర్తి, సూ ర్యాపేట నియోజకవర్గాల నుంచి వేలాది మంది అభి మానులు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలిరాను న్నారని సూర్యా పేట జిల్లా కాంగ్రె స్ మాజీ ఉపాధ్యక్షులు, సీనియర్ నాయ కులు ధరూరి యోగానందాచార్యులు తెలిపారు. విగ్రహావి ష్కరణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఉమ్మడి తెలు గు రాష్ట్రాల్లో దామోదర్ రెడ్డి త నదైన ముద్ర వేసుకున్నారని, నా లుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కొనసాగిస్తున్న కార్యకర్తలు, ఆ యన అభిమానులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరు కానున్నారని తెలిపారు.
అభివృద్ధికి పునాదులు వేసిన నేత
తుంగతుర్తి నియోజకవర్గం నుం చి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి దామోదర్ రెడ్డి అన్ని రం గాల్లో అభివృద్ధి కా ర్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారని యోగానందాచార్యులు పేర్కొన్నారు. ని యోజకవర్గ అభివృద్ధికి ఆయన వేసిన పు నాదుల కారణంగానే ప్రజల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఏర్ప డిందన్నారు.దామోదర్ రెడ్డి మరణించి ఏడాది కావస్తున్న ప్ప టికీ ప్రజల హృదయాల్లో ఆయన జ్ఞాపకాలు సజీవంగా నే ఉన్నా యని అన్నారు. అక్టోబర్ 1న జరిగే విగ్రహావిష్క రణ కార్యక్రమం ఆయన సేవలను స్మరించుకునే సందర్భం గా నిలవనుందని తెలిపారు.
దామోదర్ రెడ్డి కుమారుడు, ఏఐ సీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్త మ్ రెడ్డి భవిష్యత్తులో అభిమా నులు, కాంగ్రెస్ కార్యకర్తలకు అం డగా నిలుస్తారని యోగానందా చార్యులు పేర్కొన్నారు. ఇప్పటికే రెండు నియోజకవర్గాల కార్యకర్త ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. విగ్రహా విష్కరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయ న పిలుపునిచ్చారు.





