Damodar Reddy Statue Unveiling : అక్టోబర్ 1న దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణ
--తుంగతుర్తిలో ముమ్మరంగా ఏర్పాట్లు --వేలాదిగా తరలిరానున్న అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు

Damodar Reddy Statue Unveiling : ప్రజా దీవెన, తుంగతుర్తి: దివం గత నేత, మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రె స్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి విగ్రహావిష్క ర ణ కు తుంగతుర్తి నియోజకవర్గంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతు న్నాయి. అక్టోబర్ 1న ఆర్వపల్లి మండల కేంద్రంతో పాటు తిరుమ లగిరి మండలం వెలిశాల వద్ద దా మోదర్ రెడ్డి విగ్రహాలను ఆవి ష్క రించేందుకు కాంగ్రెస్ శ్రేణులు స న్నాహాలు చేస్తున్నాయి.ఈ నేప థ్యంలో బుధవారం ఏఐసీసీ స భ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విగ్రహ స్థాపన కోసం జరుగుతు న్న నిర్మాణ పనులను పరిశీలిం చారు. పనుల పురోగతిపై కాం గ్రె స్ నాయకులను అడిగి తెలుసు కున్న ఆయన, అవసరమైన సూ చనలు, సలహాలు అందించారు.
ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గాని కి అందించిన సేవలు, అభివృద్ధి కా ర్యక్రమాలను నాయకు లు, కా ర్య కర్తలతో ఆయన పంచుకున్నారు.ఈ కార్యక్ర మం లో సూర్యాపేట జి ల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపాటి నరస య్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వేలాదిగా తరలిరానున్న అభిమానులు
దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తుంగతుర్తి, సూ ర్యాపేట నియోజకవర్గాల నుంచి వేలాది మంది అభి మానులు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలిరాను న్నారని సూర్యా పేట జిల్లా కాంగ్రె స్ మాజీ ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకు లు ధరూరి యోగా నందాచార్యులు తెలిపారు. విగ్రహావిష్క రణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆయన విడు దల చేశారు. ఉమ్మడి తెలు గు రాష్ట్రాల్లో దామోదర్ రెడ్డి త నదైన ముద్ర వేసుకున్నారని, నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పా ర్టీతో అనుబంధం కొనసాగిస్తున్న కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరుకాను న్నారని తెలిపారు.
అభివృద్ధికి పునాదులు వేసిన నేత
తుంగతుర్తి నియోజకవర్గం నుం చి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి దామోదర్ రెడ్డి అన్ని రం గాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారని యోగానం దాచార్యు లు పేర్కొన్నారు. ని యోజకవర్గ అభివృద్ధికి ఆయన వేసిన పునాదుల కారణంగానే ప్రజల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఏర్పడిందన్నారు.దామోదర్ రెడ్డి మరణించి ఏడాది కావ స్తున్న ప్ప టికీ ప్రజల హృదయాల్లో ఆయన జ్ఞాపకాలు సజీ వంగానే ఉన్నా యని అన్నారు. అక్టోబర్ 1న జ రిగే విగ్ర హావిష్కరణ కార్యక్రమం ఆయన సేవలను స్మరించుకునే సం దర్భంగా నిలవనుందని తెలి పారు.
దామోదర్ రెడ్డి కుమారుడు, ఏఐ సీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్త మ్ రెడ్డి భవిష్యత్తులో అభిమా నులు, కాంగ్రెస్ కార్యకర్తలకు అం డగా నిలుస్తారని యోగానందా చార్యులు పేర్కొన్నారు. ఇప్పటికే రెండు నియోజకవర్గాల కార్యకర్త ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. విగ్రహా విష్కరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయ న పిలుపునిచ్చారు.





