Tuesday, September 29, 2026
More
    HomeIndiaSix Months Unused Ration Card : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆరు నెలలు...

    Six Months Unused Ration Card : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డు అంతేసంగతులు

    📰 Generate e-Paper Clip

     

    Six Months Unused Ration Card : ప్రజా దీవెన, న్యూఢి ల్లీ: రేషన్ కార్డుల ప్రక్షాళనలో భాగంగా కేం ద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధ మవుతున్నట్లు సమాచారం. వ రుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని కార్డులను గుర్తించి, అ క్టోబర్ 1 నుంచి తా త్కాలికంగా డిసేబుల్ చేసే ప్రక్రియను ప్రా రంభించనున్నట్లు ఓ ప్ర ముఖ జాతీయ మీడియా కథనం పే ర్కొంది. ఈ ప్రక్రియలో దేశవ్యా ప్తంగా సుమారు 1.58 కోట్ల రేష న్ కార్డులు హోల్డ్‌లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.

        బోగస్ కార్డులపై ప్రత్యేక దృష్టి

    నకిలీ, డూప్లికేట్ రేషన్ కార్డులు, మరణించిన వ్యక్తుల పేర్లతో కొన సాగుతున్న కార్డులు, అర్హత లేని లబ్ధిదారులను గుర్తించి తొలగిం చేందుకు కేంద్రం ఇప్పటికే డిజి ట లైజేషన్, ఆధార్ అ నుసంధానం, బయోమెట్రిక్ సీడింగ్, ఈ-కేవైసీ వంటి విధానాల ను అమలు చేస్తోంది. కేంద్ర ఆహార శాఖ వెల్ల డించిన వివరాల ప్రకారం, నవం బర్ 2024 నాటికి దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియల ద్వారా సుమారు 5.8 కోట్ల బోగస్ రేషన్ కార్డులను తొలగించి నట్లు తెలిపింది.

    వెంటనే రద్దు కాదు.. మూడు నెలల అవకాశం

    ఆరు నెలలుగా రేషన్ తీసుకోని కార్డులను ముందుగా తా త్కా లికంగా డిసేబుల్ చేయనున్నట్లు స మాచారం. అయితే లబ్ధిదారుల పేర్లను వెంటనే శాశ్వతంగా తొల గించబోరని సంబంధిత వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కార్డు డిసేబుల్ అయిన తర్వాత తాము నిజమైన అర్హు లమేనని నిరూపించుకునేందుకు మూడు నెలల సమయం ఇవ్వ నున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవధి లో క్షేత్రస్థాయి పరిశీల నతో పాటు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తే అర్హత ఉన్న కార్డు లను తిరిగి యాక్టివేట్ చేసే అవకాశం ఉంటుందని సమాచా రం.

          రాష్ట్రాల వారీగా లెక్కలు

    ఆరు నెలలుగా రేషన్ తీసుకోని కార్డులను ఇప్పటికే వర్గీకరించే ప్ర క్రియ కొనసాగుతున్నట్లు తెలు స్తోంది. రాష్ట్రాల వారీగా వివ రాలను సేకరించి, అర్హత లేని కార్డు లను గుర్తించే దిశగా అధి కారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచా రం. అధికారికంగా రా ష్ట్రాల వారీ గా తుది సంఖ్యలు వెల్లడైన త ర్వాత ఈ ప్రక్రియపై మరింత స్ప ష్టత వచ్చే అవకాశం ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.