Tuesday, September 29, 2026
More
    HomeOpinionWorldClass Centralized Kitchen in suryapet district : బిగ్ బ్రేకింగ్, 100 రోజుల్లో 60వేల...

    WorldClass Centralized Kitchen in suryapet district : బిగ్ బ్రేకింగ్, 100 రోజుల్లో 60వేల మంది విద్యార్థులకు పౌష్టికాహారం

    📰 Generate e-Paper Clip

    — సయ్యద్‌ ముజావర్‌పేటలో ప్ర పంచస్థాయి కేంద్రీకృత వంటశాల రూ.9.60 కోట్లతో నిర్మాణం
    –1,029 విద్యాసంస్థలకు తాజా ఆహారం
    –నల్లగొండలో 7,972 మంది వి ద్యార్థులకు ప్రయోజనం

    WorldClass Centralized Kitchen in suryapet district : ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు, జూ నియర్‌ కళాశాలల్లో చదువుతు న్న వేలాది మంది విద్యా ర్థులకు మరింత నాణ్యమైన, పౌష్టికాహా రం అందించేందుకు భారీ స్థాయి కేంద్రీకృత వంటశాల రూపుదిద్దు కుంటోంది. సూ ర్యాపేట జిల్లామునగాల మండలం సయ్యద్‌ ముజావర్‌పేటలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈవం టశాలను వచ్చే 100 రోజుల్లో అందుబాటులోకి తీసుకురా వడమే లక్ష్యంగా పనులు వేగంగా సాగుతున్నాయి.

    హరే కృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిట బుల్‌ ఫౌండేషన్‌ సహకారం తో చే పట్టిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సింగరేణి కాలరీస్‌ కం పెనీ లిమి టెడ్‌ తన సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి రూ.9.60 కోట్ల ఆర్థిక సహా యం అందించింది. వంటశాల అందుబాటులోకి వస్తే మొత్తం 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లోని సు మారు 60 వేల మంది విద్యార్థులకు ప్రతి రోజూ తాజాగా తయా రు చేసిన పౌష్టికాహారం సరఫరా చేయ నున్నారు

    ఆధునిక సాంకేతికతతో వంట.. ప్యాకింగ్‌, పంపిణీ

    భారీ స్థాయిలో ఒకేచోట ఆహా రా న్ని తయారు చేయడంతోపా టు నాణ్యతా పరీక్షలు, ప్యాకింగ్‌, ర వాణా, పంపిణీ వ్యవస్థల ను ఆ ధునిక సాంకేతికతతో అనుసం ధానం చేయనున్నారు. పరిశు భ్ర త, ఆహార భద్రత, పోషక విలు వలు, నిర్ణీత సమ యానికి ఆహా రం చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చే స్తున్నారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ ల మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పర్య వేక్షిస్తున్నారు. సింగరేణి, హరే కృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌, సూర్యాపేట–నల్లగొండ జిల్లా యంత్రాంగాలు, సంబం ధిత శాఖల మధ్య సమన్వయంతో పనులను ముందుకు తీసు కెళ్తున్నారు.

    100 రోజుల్లో పూర్తి చేసేలా కార్యాచరణ

    సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ మాట్లాడు తూ వంటశాలను 100 రోజుల్లో అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భవన నిర్మాణం, మౌలిక సదు పాయాలు, వంట, ప్యాకింగ్‌, ర వాణా, పంపిణీ వ్యవస్థలను స మాంతరంగా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్ర తి విద్యాసంస్థకు నిర్ణీత సమయానికి తాజాగా తయారు చేసి న ఆహారంచేరేలా ప్రత్యేక రూట్‌ మ్యాప్‌ రూపొంది స్తున్నట్లు వివరించారు.

    నల్లగొండలో 7,972 మంది విద్యార్థులకు ప్రయోజనం

    ఈ కేంద్రీకృత వంటశాల సేవలు సూర్యాపేట జిల్లాకే పరిమితం కాకుండా నల్లగొండ జిల్లాకూ విస్తరించనున్నాయి. నకిరేకల్‌, శాలిగౌరారం, కేతేపల్లి, వేముల పల్లి మండలాల్లోని 131 ప్రభు త్వ విద్యాసంస్థలకు ఇక్కడి నుం చే ఆహారం సరఫరా చేయ నున్నారు. దీంతో ఆయా విద్యాసం స్థల్లో చదువుతున్న 7,972 మం ది విద్యార్థులు ప్రయోజనం పొం దనున్నారు. ఈ సంద ర్భంగా నల్లగొండ జిల్లా కలెక్టర్‌ బి.చంద్ర శేఖర్‌ మాట్లాడుతూ కేంద్రీకృత వంటశాల ద్వారా అన్ని విద్యా సంస్థల్లో ఒకే స్థాయి పరిశుభ్రత, నాణ్యత, పోషక విలువలు, ఆ హార భద్రత ప్రమా ణాలను పా టించే అవకాశం ఉంటుందని తె లిపారు. ఆహారం ఎలాంటి అం తరాయం లేకుండా ప్రతి పాఠ శాలకు చేరేలా పటిష్టమైన రవా ణా ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.

    పోషకాహారంతో చదువుపై మరింత దృష్టి

    విద్యార్థుల్లో పోషకాహార లోపా న్ని నివారించడమే ఈ కార్యక్ర మం ప్రధాన లక్ష్యం. ప్రొటీన్లు, వి టమిన్లు, ఖనిజ లవణాలతో కూ డిన సమతుల ఆహారాన్ని అం దించనున్నారు. ఉదయం పౌష్టి కాహారం తీసుకోవడం ద్వారా వి ద్యార్థుల శారీరక ఆరో గ్యంతో పా టు తరగతి గదిలో ఏకాగ్రత, అభ్యసన సామర్థ్యం మెరుగుప డేందుకు దోహదపడుతుందని అధికారులు భావి స్తున్నారు.అలాగే విద్యార్థుల హాజరు, సమ యపాలన మెరుగుపడటంతో పాటు బడి మానేసే వారి సంఖ్య తగ్గేందు కు కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడి న కుటుంబాలకు చెందిన విద్యా ర్థులకు ఇది అదనపు ప్రయోజ నం కలిగించనుంది.

    చిరుధాన్యాల వంటకాలకు ప్రాధాన్యం

    మెనూలో చిరుధాన్యాలతో త యారు చేసే సంప్రదాయ పౌష్టిక వంటకాలను చేర్చాలని ప్రతి పా దించారు. ఇందుకోసం హరే కృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌం డేషన్‌, భారతీయ వ్యవ సాయ ప రిశోధన మండలి–భారత చిరు ధాన్యాల పరిశోధన సంస్థ సహ కారంతో శాస్త్రీయంగా వంటకాల రూపకల్పన, పో షక విలువల ప్ర ణాళిక సిద్ధం చేయనున్నారు.హరే కృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిట బుల్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు, అక్ష యపాత్ర ఫౌండేషన్‌ ప్రాంతీయ అధ్యక్షుడు శ్రీ సత్య దౌర చంద్ర దాస మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించి, వారు చ దువులో మెరుగైన ఫలితా లు సా ధించేలా సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపా రు.

    విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడి

    మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమా ర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యా ర్థుల ఆరోగ్యం, చదువు, భవిష్యత్తుకు ఉపయోగపడే ఈ ప్రాజె క్టుకు రూ.9.60 కోట్ల సహాయం అందిం చిన సింగరేణి సంస్థకు కృతజ్ఞత లు తెలిపారు. ప్రభుత్వరంగ సం స్థలు తమ సీఎస్‌ఆర్‌ నిధులతో ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే మౌలిక సదుపాయాలను ఎలా సృష్టించవచ్చో ఈ కేంద్రీ కృత వంటశాల చాటిచెబుతుందని పేర్కొన్నారు.వంటశాల అందు బాటులోకి వచ్చిన తర్వాత ప్రతి పనిదినం వేలాది మంది వి ద్యా ర్థులకు తాజాగా తయారు చేసిన పౌష్టికాహారం అందు తుందని మంత్రి తెలిపారు. సయ్యద్‌ ము జావర్‌పేట కేంద్రీకృ త వంట శాల ను రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపే లా అన్ని చర్య లు తీసు కుంటా మని వెల్లడించారు.

    ప్రపంచస్థాయి వంటశాలతో హుజూర్‌న గర్, కోదాడలో హర్షం

    మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ప్రపంచస్థాయి కేంద్రీకృత వంటశాల నిర్మాణం కొనసాగుతుండటంతో స్థానికంగా హర్షా తిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక వంటశాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించేందు కు మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నా యి.

    హుజూర్‌నగర్‌తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి, ఎ మ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గానికి కూ డా ఈ వంటశాల ద్వారా ప్రయోజనం చేకూరనుండటంతో అ ధికార పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. విద్యార్థుల సంక్షేమానికి దోహదపడే ఈ ప్రాజెక్టు భవిష్యత్‌లో మరింత విస్తృత ప్రయోజనాలు అందించనుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు.

     

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.