Wednesday, October 7, 2026
More
    HomeOpinionEx minister Motkupalli Narasimhulu : కులవివక్షకు వ్యతిరేకంగా మాదిగలు ఐక్యంగా ఉద్యమించాలి

    Ex minister Motkupalli Narasimhulu : కులవివక్షకు వ్యతిరేకంగా మాదిగలు ఐక్యంగా ఉద్యమించాలి

    📰 Generate e-Paper Clip

     

    Ex minister Motkupalli Narasimhulu : ప్రజా దీవెన, న ల్లగొండ: కులవివ క్షకు వ్యతిరేకంగా మాదిగ సమాజం ఐక్యంగా ఉద్యమించాలని, సామాజిక హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపా డుకోవడంతో పాటు రాజకీయ అధికార సాధన దిశగా ముం దుకు సాగాలని మాదిగ మహాశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు మో త్కుపల్లి నర్సింహులు పిలు పునిచ్చారు. మాదిగలు ఎదు ర్కొంటున్న సమస్యల పరిష్కారా నికి ప్రజా ప్రతినిధులు, ము ఖ్యంగా మంత్రులు తగిన స్థాయిలో స్పందించకపోవడం బాధా కరమని ఆయన అన్నారు.

    చింతపల్లి మండలం పి.కె. మల్లేపల్లి గ్రామం లో ఐకేపీ వీవో ఏగా పనిచేస్తున్న గనిపెళ్లి మాధవిని గ్రామసభలో ప్రజల స మక్షంలో కులం పేరు తో దూషించి దాడి చేసిన ఘటనపై ఆ యన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనకు బాధ్యుడిగా ఆరో పణలు ఎదుర్కొంటున్న కుప్పల అమర్నాథ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ చట్టంతో పాటు హత్యాయ త్నం కేసు నమోదు చేసి కఠిన చ ర్యలు తీసుకోవాలని నర్సింహులు డిమాండ్ చేశారు. సమా జంలో ఇప్పటికీ కులవివక్ష కొనసాగుతుండటం ఆందోళనక ర మని పేర్కొన్నారు.

      బాధితులకు తక్షణన్యాయం చేయాలి

    మాదిగలు, దళితులకు అండగా ఉంటామని చెప్పే నాయకు లు బాధితులకు అన్యాయం జరిగి నప్పుడు వారి పక్షాన నిల బడక పోవడం విచారకరమని నర్సిం హులు అన్నారు. పి.కె. మల్లేపల్లి యువతి ఎదుర్కొన్న పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేశాయని తెలిపారు.ఘటన అనంతరం మంత్రులు, స్థా నిక ప్రజాప్రతిని ధులు స్పందించినప్పటికీ జరిగిన నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయలేమ ని ఆయన ఆవేదన వ్యక్తం చేశా రు. మాదిగ మహిళలు, యువత కు న్యాయం జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచే యాలని కోరారు.బాధితురా లికి ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక, చట్టపరమైన ప్రయో జనా లను వెంటనే కల్పించాలని, ఉ ద్యోగానికి సంబంధించిన అంశం లోనూ న్యాయం చేయాలని డి మాండ్ చేశారు. బాధిత కుటుం బానికి అండగా ఉంటానని, అవ సరమైన సహాయం అందిస్తానని నర్సింహులు హామీ ఇచ్చారు.

      రాజకీయంగా సంఘటితం కావాలి

    మాదిగ యువత, అన్నదమ్ములు ఐక్యంగా ముందుకు వచ్చి తమ హక్కుల కోసం పోరాడాలని న ర్సింహులు పిలుపుని చ్చారు. సా మాజిక హక్కులు, ఆత్మగౌరవ ప రిరక్షణతో పాటు రాజకీయ అ ధి కార సాధనపై దృష్టి సారించాలని సూచించా రు.రాజకీయ అధికారం సాధించాలంటే మాదిగ సమాజంలో ఐక్యత అత్యంత కీ ల కమని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా మాదిగలకు ఉన్న జ నబలం రాజకీయంగా కీలకమైన దని పేర్కొంటూ, ఎన్నికల్లో సామాజిక ఐక్యత, రాజకీయ చైతన్యం ప్రతిబింబించేలా సంఘటి తంగా ముందుకు సాగాలని పి లు పునిచ్చారు.భవిష్యత్తులో మాదిగలు, బలహీన వర్గాలకు రా జకీయ ప్రాధాన్యం పెరగాలని, తమ హక్కుల సాధన కోసం ఐ క్యంగా పోరాడాలని నర్సింహులు కోరారు.

       కలెక్టర్‌కు మెమోరాండం

    మాదిగ వర్గం ఎదుర్కొంటున్న స మస్యలపై తక్షణ చర్యలు తీ సుకోవాలని కోరుతూ మోత్కు పల్లి నర్సింహులు నేతృత్వంలో కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించారు. అనంతరం విలేకరు లతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ కార్య క్ర మంలో సంగెం ప్రసాద్, రుద్రవరం లింగస్వామి, మార్చర్ల సైదు లు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.