Thursday, October 8, 2026
More
    HomeOpinionEx supreme court judges key words : మాజీ న్యాయమూర్తుల సంచలన బహిరంగలేఖ, ఎన్నికల...

    Ex supreme court judges key words : మాజీ న్యాయమూర్తుల సంచలన బహిరంగలేఖ, ఎన్నికల వ్యవస్థను దిగజార్చొద్దు, ఎన్నికల ప్రక్రియను మార్చేయత్నం ప్రమాదకరం

    📰 Generate e-Paper Clip

     

    Ex supreme court judges key words : ప్రజా దీవెన, న్యూ డిల్లీ: ఎన్నికల సంఘం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను లక్ష్యంగా చే సుకుని విపక్షాలు చేస్తున్న విమ ర్శలు, ఎస్ఐఆర్‌ ప్రక్రియపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో 42మంది మాజీ న్యాయమూర్తులు కీలకంగా స్పందించారు. రా జ్యాంగ బద్ధ సంస్థలపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, ఎ న్నికల ప్రక్రియను అనుమానా స్పదంగా చిత్రీకరించడం ప్రజా స్వామ్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని వారు హెచ్చరించారు.ఈ మేరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూ ర్తు లు జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ పం కజ్ మిట్టల్‌తో పాటు వి విధ హైకో ర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు, ఇతర మాజీ న్యాయమూర్తులు కలిసి ఒక ఉమ్మడి బహిరంగ లేఖను విడు దల చేశారు.

         ఎస్ఐఆర్‌పై స్పష్టత

    ఎస్ఐఆర్‌ (స్పెషల్ ఇంటెన్సివ్ రి విజన్) అనేది చట్టబద్ధమైన ప్ర క్రియ అని, ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించడ మే దాని ప్రధాన ఉద్దేశమని మాజీ న్యాయమూర్తులు పేర్కొ న్నారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, విశ్వసనీయతను కా పాడటానికి ఓటర్ల జాబితాల ప్రామాణికత అత్యంత కీలకమని స్పష్టం చేశారు.ప్రజాస్వామ్యానికి ప్రజల విశ్వా సమే అసలైన బలమని, ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు రేకెత్తించే ప్రయ త్నాలు కొనసాగితే ప్రజల్లో వ్యవస్థలపై నమ్మకం సడలే ప్రమా దం ఉందని హెచ్చరించారు.

    విమర్శ హక్కే.. కానీ వ్యవస్థలను బలహీనపర్చొద్దు

    రాజ్యాంగబద్ధ సంస్థలను విమర్శించడం ప్రజాస్వామ్యంలో ప్ర తి ఒక్కరికీ ఉన్న హక్కేనని మాజీ న్యాయమూర్తులు గుర్తుచే శారు. అయితే విమర్శల పేరుతో వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా వ్యవహరించడం మాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా స్వామ్య దేశమైన భారత్‌లో రాజ్యాంగబద్ధ అధికారులను పదే పదే దొంగలు, అ వినీతిపరులు అంటూ ఆరోపించడం వల్ల ప్రజల్లో ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

         అశాంతికి దారితీసే ప్రమాదం

    ఎన్నికల ప్రక్రియనే అనుమానా స్పదంగా మార్చే ప్రయత్నాలు ప్ర జాస్వామ్యానికి మేలు చేయవని, అవి సమాజంలో అశాం తి పెరగడానికి, అరాచక శక్తులు బలపడేందుకు దారితీసే ప్ర మాదం ఉందని మాజీ న్యాయమూర్తులు హెచ్చరించారు. అ త్యున్నత న్యాయస్థానంతో పాటు ఇతర రాజ్యాంగ,చట్టబద్ధ సంస్థలపైనా దా డులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మౌ నం వహించడం సరికాదని పేర్కొంటూ..ప్రజాస్వామ్య సంస్థల గౌరవం, విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రిపైనా ఉందని లేఖలో స్పష్టం చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.