–జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా సంబరాలు
–సద్దల చెరువు నుంచి కొత్త బస్టాండ్ వరకు 2కే రన్
–జిల్లా అభివృద్ధిలో కేసీఆర్, జగదీష్ రెడ్డి ల కృషి మరువలేనిది
–మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య
Suryapet district formation Day Rally : ప్రజా దీవెన, సూర్యా పేట: సూర్యాపేట జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భం గా జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా కదం తొ క్కాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించి న 2కే రన్ గులాబీమయంగా మారింది. జిల్లా ఏర్పాటుతో సూ ర్యాపేట అభివృద్ధికి బాటలు వేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కృ తజ్ఞతలు తెలుపుతూ బీ ఆర్ఎస్ కార్యకర్తలు, పట్టణ ప్రజలు, యువత భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సద్ద ల చెరువు నుంచి కొత్త బస్టాండ్ వర కు సుమారు రెండు కిలో మీటర్ల మేర సాగిన ర్యాలీలో సూర్యాపేట, తుంగతుర్తి, హుజూ ర్నగర్, కోదాడ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రే ణులు సందడి చేశాయి. మాజీ ఎ మ్మెల్యేలు డాక్టర్ గాదరి కిషో ర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ గుజ్జదీపిక యుగేందర్ రావు, హుజూర్నగర్ నియోజక వర్గ ఇన్చార్జి ఒంటెద్దు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పదేళ్ల ప్రస్థానంలో అభివృద్ధికి కొత్తదిశ
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు పాలనను ప్రజలకు మ రింత చేరువ చేయడంతో పాటు అభి వృద్ధి కి కొత్త దిశానిర్దేశం చేసిందని మాజీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కేసీఆర్ ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం సూర్యాపేట జిల్లా అభివృద్ధికి కీలక మలుపుగా నిలిచిందని అన్నారు. జిల్లా ఏర్పాటైన త ర్వాత మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, వ్య వసాయం, ప ట్టణాభివృద్ధి రంగాల్లో గ ణనీయమై న మార్పులు చోటు చేసు కున్నాయని వివరించారు.
మాజీ మంత్రి, స్థానిక నాయకుడు గుంటకండ్ల జగ దీష్ రెడ్డి కృ షితో జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీ, ట్యాంక్బండ్, ఇంటిగ్రేటెడ్ మా ర్కెట్ వంటి అభివృద్ధి కార్యక్ర మాలు ముందు కు సాగాయని వారు గుర్తుచేశారు. ఎస్ఆర్ ఎస్పీ జ లాల వినియోగం, గురుకుల విద్యాసంస్థలు, నియో జ కవర్గాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు ప్రజలకు ప్రయో జనం చేకూర్చాయని పేర్కొన్నారు. జిల్లాలోని నియోజకవర్గా ల్లో సుమారు రూ.6 వేల కో ట్లతో అభివృద్ధి పనులు చేపట్టిన ట్లు నాయకులు తెలిపారు.
అట్టడుగు వర్గాలకు ప్రయోజనాలు
జిల్లాల పునర్వ్యవస్థీకరణతో అధికార వికేంద్రీకరణ జరిగి ప్రజ లకు పాలన మరింత చేరువైందని మాజీ ఎమ్మెల్యేలు అన్నా రు. జిల్లాస్థాయిలో కలెక్టర్, ఎస్పీ వంటి ఉన్నతాధికారులు అం దుబాటులో ఉం డటంతో సమస్యల పరిష్కారానికి మార్గం సు గమమైందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్య క్రమాల ద్వారా అట్టడుగు వర్గాలకు మరింత చేరువయ్యే అవ కాశం ఏర్పడిందని వివరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటు తెలంగాణ లో పరిపాలనా సంస్కరణ ల కు నాంది పలికిందని, రాష్ట్ర అభి వృద్ధి ప్రస్థానంలో ఇది కీలక ఘట్ట మని వారు అభివర్ణించారు. ఈ ప్రస్థానాన్ని నేటి యువ తకు వివరించి, గత పదేళ్లలో జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్య క్రమాలపై అవగాహన కల్పించారు
కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతల విమర్శలు
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభు త్వంపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పించారు. ముఖ్య మం త్రి రేవంత్ రెడ్డి ప్రభు త్వం అ భివృద్ధి అంశాల కంటే రాజకీయ విమర్శలకే ప్రాధాన్య త ఇస్తోందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాల ప్రాధాన్యతను గుర్తించాలని సూచించారు. రాబోయే పట్టభ ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పా లని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీ ఆర్ తెలంగాణ చరి త్రలో ఉన్నతమైన స్థానం సంపాదించుకున్న నాయకుడని, ఆ యన పాలనలో ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాలను విస్మ రించలేరని వ్యా ఖ్యానించారు.
సూర్యాపేట జిల్లా దశాబ్ది ఉత్స వాల సందర్భంగా నిర్వహించి న 2కే రన్ బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. జిల్లా అభివృద్ధిలో గత పదే ళ్ల ప్రస్థా నా న్ని గుర్తుచేసుకుంటూ నాయ కులు, కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేశా రు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్ర తిని ధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువత తదితరు లు పాల్గొన్నారు.
Suryapet district formation Day Rally



