Tuesday, October 13, 2026
More
    HomeజాతీయంMinister komatireddy Venkat Reddy : ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ డబుల్‌డెక్కర్‌ కారిడార్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

    Minister komatireddy Venkat Reddy : ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ డబుల్‌డెక్కర్‌ కారిడార్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

    📰 Generate e-Paper Clip

     

    –హైదరాబాద్‌ ట్రాఫిక్‌ కష్టాలకు ప రిష్కారం దిశగా కీలక ముందడు గు

    Minister komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్‌: హైద రాబాద్ మహానగ రంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించి, ప్రయాణాన్ని మ రింత వేగవంతం చేసే దిశగా కీల క పరిణామం చోటు చే సుకుంది. ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ డబు ల్‌డెక్క ర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రా జెక్టుకు కేంద్ర రోడ్డు రవా ణా, జా తీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గ డ్కరీ ఆమోదం తెలిపిన ట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో మౌ లిక వసతుల అభివృద్ధి, జాతీ య రహదారుల విస్తరణకు సం బంధించిన పలు కీలక అంశాలపై చర్చించేందుకు మంత్రి కోమటిరె డ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం కేం ద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సమా వేశమయ్యారు. ఈ భేటీలో ఎల్బీ నగర్‌–హయత్‌నగర్‌ డబుల్‌ డె క్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌తో పా టు రాష్ట్రంలో చేపట్టాల్సిన ఇతర కీలక రహదారి ప్రాజెక్టులపై చర్చించారు.

    అదే సమయంలో తె లంగాణలో రహదారుల అ భివృ ద్ధికి మరింత ఊతమిచ్చేలా రాష్ట్ర రోడ్లు, భ వనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామాలు చో టుచేసుకున్నా యి. కేంద్ర రోడ్డు ర వాణా, జాతీయ రహదారుల శా ఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో ప్రత్యేకంగా సమావేశమై న ఆయన రాష్ట్రంలో చేపట్టాల్సిన పలు కీలక రహ దారులు, వంతెనలు, ఎలి వేటెడ్‌ కారిడార్ల నిర్మా ణంపై చ ర్చించారు. తెలంగాణ రవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దడంతో పాటు ప్ర యాణ సమయాన్ని తగ్గించేలా పలు ప్ర తిపాదన లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

    ఎన్‌హెచ్‌ 765పై డీపీఆర్‌ సిద్ధం చేయాలని ఆదేశాలు

    ఎన్‌హెచ్‌ 765పై ప్రతిపాదిత ఎలి వేటెడ్‌ కారిడార్‌ కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీ ఆర్‌) సిద్ధం చేయాలని అధికారులను నితిన్‌ గడ్క రీ ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే హై దరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ట్రా ఫిక్‌ సమస్యల పరిష్కారానికి, ప్రయాణ సమయం తగ్గించేందుకు దోహదపడే అవకాశం ఉంది.

    కృష్ణా నదిపై ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జ్‌ ప్రతిపాదన కు ఆమోదం

    తెలంగాణలో రవాణా సదుపా యాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో కృష్ణా నదిపై ఐకానిక్‌ కే బుల్‌ బ్రిడ్జ్‌ నిర్మాణానికి శంకుస్థా పన చేయాలన్న ప్రతిపాదనకు కూడా కేంద్ర మంత్రి ఆమోదం తె లిపినట్లు సమాచారం. ఈ ప్రా జెక్టు రాష్ట్ర రహదారి అనుసంధా నాన్ని బలోపేతం చేయడంలో కీ లకంగా మారనుంది.

    ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌కు ఆహ్వానం

    హైదరాబాద్‌లో నవంబర్‌ 19 నుంచి 22 వరకు జ రగనున్న ఇం డియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్ర మం త్రి నితిన్‌ గడ్కరీని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆహ్వానించారు.మొత్తంగా, కేంద్ర మంత్రితో జరి గిన ఈ సమావేశం తెలంగాణ లో రహదారి మౌలిక వసతుల అభి వృద్ధికి ప్రాధా న్యతనిచ్చే దిశగా కీ లక అడుగుగా నిలిచింది. అ యితే డబుల్‌డెక్కర్‌ కారిడార్‌ నిర్మాణానికి సంబం ధించిన తదుపరి కార్యాచరణ, డీపీఆర్‌ రూపకల్ప న, ఇతర అనుమతుల పురోగతిపై స్పష్టత రావా ల్సి ఉంది.

    తెలంగాణకు భారీరహదారుల ప్రాజెక్టు లు

    హైదరాబాద్‌–శ్రీశైలం జాతీయ రహదారిపై ఎలివే టెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సంబంధించి కొత్త సమ గ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేయాలని కేం ద్ర మంత్రి అధికారులకు సూచించినట్లు వెల్లడించా రు. ఈ ప్రతిపాదన కార్యరూపందాల్చితే ఆ మార్గం లో రాకపోకలు మరింత సులభతరం కానున్నా యి.

    హైదరాబాద్‌–విజయవాడ–మచిలీపట్నం మార్గానికి ప్రాధాన్యం

    హైదరాబాద్‌–విజయవాడ–మచిలీపట్నం జాతీ య రహదారి విస్తరణ పనులను వేగవంతం చేస్తా మని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్‌–అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ప్రతిపాదనపైనా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

    ఐదు రోప్‌వేలు.. మూడు రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు

    తెలంగాణలో ఐదు రోప్‌వేల ఏర్పాటుకు ఆమోదం లభించడం మరో కీలక అంశంగా నిలిచింది. సేతు బంధన్‌ పథకం కింద మూడు రైల్వే ఓవర్‌ బ్రిడ్జిల ని ర్మాణానికి కూడా ఆమోదం లభించినట్లు వెల్లడిం చారు. వీటి ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుప డటంతో పాటు రైల్వే క్రాసింగ్‌ల వద్ద వాహనదారు లు ఎదుర్కొనే ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.

    34 అభివృద్ధి పనులకు నిధులకోసం విజ్ఞ ప్తి

    తెలంగాణలో చేపట్టాల్సిన 34 అభివృద్ధి పనులకు కేంద్ర రహదారి మౌలిక సదుపాయాల నిధి (CRIF) కింద నిధులు మంజూరు చేయాలని మంత్రి కోమ టిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలోని పలు రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్‌ చేయాలన్న ప్రతిపాదనలను కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

    ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌కు గడ్క రీకి ఆహ్వానం

    హైదరాబాద్‌లో నవంబర్‌ 19 నుంచి 22 వరకు జ రగనున్న ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ కార్య క్రమానికి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆహ్వానించారు.ఈ సమావేశంలో మంత్రి జూ పల్లి కృష్ణా రావుతో పాటు పలువురు ప్రజాప్ర తిని ధులు, అధికారులు పాల్గొ న్నారు.తెలంగాణలో రహదారి కనెక్టివిటీని బలోపేతం చేయడం, ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదా చే యడం, పర్యాటక రంగానికి ఊ తమివ్వ డం లక్ష్యంగా రాష్ట్ర ప్ర భుత్వం పలు కీలక ప్రాజెక్టు లపై దృష్టి సారిస్తోంది. కేంద్రంతో సమన్వయం ద్వా రా ఈ ప్రతిపాదన లు కార్యరూపం దాల్చితే తెలం గాణ మౌలిక సదుపాయాల అభి వృద్ధికి మరింత బలం చేకూర నుంది.

    Minister komatireddy Venkat Reddy

     

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.