–పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీతో ప్రయాణికుల అవస్థలు
–హైదరాబాద్,విజయవాడ హైవేపై నెమ్మదిగా కదులుతు న్న వాహనాలు
పండుగవేళ పల్లెబాట,హైవేపై వాహనాలక్యూ
దసరా పండుగకు లాంగ్ వీకెండ్ తోడవడంతో నగరంలో నివసి స్తున్న ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజలు పెద్ద సం ఖ్యలో సొంతూళ్లకు బయల్దేరారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లతో పా టు ప్రైవేట్ వాహనాల్లోనూ ప్రయా ణాలు పెరగడంతో హైదరా బాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే మార్గంలో రద్దీ నెలకొంది. ము ఖ్యంగా చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా పరిసరాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ రద్దీ
మరోవైపు హైదరాబాద్లోని జేబీ ఎస్, ఎంజీబీఎస్, ఎల్బీనగర్ బ స్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరి సి పోయాయి. లింగంపల్లి, సికింద్రా బాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. పండుగ ప్రయాణికుల అవసరా లను దృష్టిలో ఉంచుకుని తెలం గాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబా టులోకి తీసుకొచ్చింది. నేటి నుంచి రానున్న రోజుల్లో ప్ర యా ణాల రద్దీ మరింత పెరిగే అ వకాశం ఉండటంతో ప్రత్యేక ఏ ర్పాట్లు చేపట్టింది.
ప్రయాణికులకు తప్పని నిరీక్షణ
టోల్ ప్లాజా వద్ద వాహనాల సం ఖ్య పెరగడంతో ప్రయాణికులు కొంతసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దసరా సెలవు ల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లేవా రు ప్ర యాణానికి అదనపు సమయం కేటాయించాలని సూచి స్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అప్రమత్తంగా వా హనాలు నడపాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రయా ణికులు గుర్తుంచుకోవాలి.
National highways Traffic Jam During Dussehra



