Tuesday, October 20, 2026
More
    HomeతెలంగాణHydarabad tragedy suicide : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ చైతన్యపురిలో విషాదం, ఆన్‌లైన్ బెట్టింగ్‌కు...

    Hydarabad tragedy suicide : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ చైతన్యపురిలో విషాదం, ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

    📰 Generate e-Paper Clip

     

    –మూడు నెలల క్రితమే వివాహం
    –అప్పుల భయంతో ప్రాణాలు తీసుకున్న ప్రవీణ్

    Hydarabad tragedy suicide :  ప్రజా దీవెన, హైదరాబాద్: ఆన్‌ లైన్ బెట్టింగ్ వ్యసనం ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జీవి తాన్ని విషాదాంతం చేసింది. హైదరాబాద్‌ లోని చైతన్యపురిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రవీణ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మూడు నెలల క్రితమే వి వా హ బంధంలోకి అడుగు పెట్టిన ప్రవీణ్.. అంతలోనే తనువు చా లించడం కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది.

    ఆన్‌లైన్‌లో బెట్టింగ్ ఆడుతూ అప్పులపాలైన ప్రవీణ్.. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడితో భయాం దోళనకు గురైనట్లు స మాచారం. ఈ క్రమంలోనే ఆ త్మహత్యకు పాల్పడినట్లు, ఘట నా స్థలంలో లభించిన సూసైడ్ లెటర్‌లో ఇందుకు సంబంధిం చిన వివరాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది.చేతికందిన వయ సు లో యువకుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛా యలు అలము కున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి అప్పుల ఊబిలో చిక్కుకోవడం ఎంతటి ప్రమాదకర పరిణా మాలకు దారి తీస్తుందో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. ఘ టనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    Hydarabad tragedy suicide

     

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.