MEPM A Additional Director ACB Case : ప్రజా దీవెన, హైదరాబాద్: అవినీ తి ఆరోపణల నేపథ్యంలో మెప్మా (MEP MA) అదనపు డైరెక్టర్ యాదగిరిరావు నల్లగుంట్లపై తెలంగా ణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అక్రమ ఆస్తుల కేసు న మో దు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వ చ్చిన ఆరోపణలపై రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు రంగం లోకి దిగి, భారీ స్థాయిలో సోదా లు నిర్వహించారు.నవంబర్ 3న అధికారి నివాసం, కార్యాలయం, బ్యాంకు లాకర్లతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులు, బి నామీలకు సంబం ధించిన మొ త్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టా రు. ఈ సోదా ల్లో భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలు, బంగారు ఆ భరణాలు, వాహనాలు, బ్యాంకు నిల్వలు గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది.
ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు గుర్తించారంటే..
ఏసీబీ ప్రాథమిక అంచనాల ప్రకా రం గుర్తించిన ఆస్తుల వివరా లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్, సూర్యాపేట, నల్లగొండ జిల్లా ల్లో రూ.58.63 లక్షల విలువైన 12 స్థలాలు ఉండగా ఉప్పల్ లో రూ .31.36 లక్షల విలువైన రెండు ఫ్లాట్లు ఉన్నాయి. అదే విధంగా ఉప్పల్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మూడు అంతస్తులు, పెంట్‌హౌస్ కలిగిన భవనం.. అంచనా విలు వ రూ.2 కోట్లుగా వేశారు. సూ ర్యాపేటలో ఆర్‌సీసీ రూఫ్‌తో ఉ న్న నివాస గృ హం.. రూ.4.75 లక్షలు కాగాఉప్పల్‌లో రూ.1.06 లక్షల విలు వైన షాప్ ఉంది.
ఇకబంగారు ఆభరణాలు విషయా నికొస్తే 1,792.2 గ్రాముల బంగా రం, రూ.33.82 లక్షలుగా, వెండి ఆభరణాలు సుమారు 3 కిలో లు.. రూ.1.80 లక్షలుగా అధికా రుల సోదాల్లో వెలుగు చూశా యి.అదే సమయంలో టయోటా ఫార్చ్యూనర్‌తో పా టు మరో కారు, మూడు ద్విచక్ర వాహనాలు.. మొత్తం రూ. 75.80 లక్ష లు.గృహోపకరణాలురూ.29.08 లక్షలు,ఎల క్ట్రా నిక్ పరిక రాలు రూ.7.01 లక్షలు, బ్యాంకు నిల్వలు వివిధ ఖా తాల్లో రూ.32.30 లక్షలుగా తేల్చారు.
మార్కెట్ విలువ మరింత ఎక్కు వగా ఉండే అవకాశం!
గుర్తించిన స్థిరాస్తుల మార్కెట్ వి లువ, రిజిస్ట్రేషన్ సమయం లో నమోదైన విలువ కంటే గణనీయంగా ఎక్కువగా ఉండే అవ కాశం ఉందని ఏసీబీ అధికారు లు పేర్కొన్నారు. ఇతర ఆస్తులకు సంబంధించిన వివరాలను కూ డా అధికారులు పరిశీలిస్తున్నా రు.ప్రాథమికంగా గుర్తించిన మొ త్తం ఆస్తుల విలువను రూ.4,75, 61,171గా ఏసీబీ అంచనా వేసిం ది. ఈ వ్యవహారంపై అవినీతి ని రోధక చట్టం-1988లోని సవర ణల ప్రకారం సెక్షన్ 13(1)(b), 13(2) కింద కేసు నమోదు చేశా రు.
దర్యాప్తు ముమ్మరం.. కోర్టుకు అధికారి
కేసు దర్యాప్తులో భాగంగా సేక రించిన ఆధారాల ఆధారంగా త దుపరి చర్యలు చేపడుతున్నా రు. సంబంధిత అధికారిని హైద రాబాద్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయ స్థానం ముందు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హాజరుప ర చనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కేసు లో మరిన్ని ఆస్తు లు వెలుగులోకి వస్తాయా? అక్రమ ఆస్తుల విలువ ఎంతవరకు పెరుగుతుంది? అ న్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
లంచం అడిగితే 1064కు ఫోన్ చేయండి
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారు లు సూచించారు.వాట్సాప్: 9440 446106, ఫేస్‌బుక్: Tela ngan a ACB,ఎక్స్ (ట్విట్టర్): @Tela ngana ACB అకౌంట్ లలో ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.


