Thursday, November 5, 2026
More
    Homeనల్గొండEl Niño problems effects Precautions : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్...

    El Niño problems effects Precautions : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక అప్పీల్, ఎల్ నినో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే బాధ్యత అందరిది

    📰 Generate e-Paper Clip

     

    El Niño problems effects Precautions :  ప్రజా దీవెన, నకిరేకల్: ఎల్ నినో వంటి సంక్లిష్ట పరి స్థితులలో ప్రజలకు ఇ బ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉం దని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నా రు. బుధవారం నల్గొండజిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ఎల్ నినోపై శ్రీనివాస గార్డెన్ లో నిర్వహించిన నకిరేకల్ నియో జకవర్గస్థాయి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథి గా హాజరయ్యారు.ఎల్ నినో వల్ల తాగునీరు, వ్యవసాయం, విద్యుత్తు, పశుసంపద, భూగర్భ జలాలు, ఆహారం, కూలీలకు ఉపాధి వంటి విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధి కారులు చర్యలు తీసుకోవాలని ,అధి కారులంరూ వారి శా ఖలపై పూర్తిపట్టు కలిగి ఉండి ప్రజలకు మేలు చేసేలా చూడాలన్నారు. డిమాండ్ ఉన్న పంటలు పం డించడం ద్వారా రైతులకు ఆదాయం వచ్చే పంటలు వేసు కు నేలా చూడాలని, విద్యుత్తు, నీటిని పొదుపుగా వాడుకునేలా అవగాహన కల్పించాలని కోరారు.

    మరసు తుఫాను నేపథ్యంలో ప్రస్తుతం కళ్ళాలలో ఉన్న ధా న్యం తడిచిపోకుండా వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా కలె క్టర్ ను  ఆదేశించారు. వచ్చే సీజన్లలో రైతులు సన్నధా న్యా న్ని పండించే లా చైతన్యం చేయాలని, అలాగే రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసి సన్నధాన్యం సర ఫరా చేసే విధంగా ప్రోత్సహిం చాలని, రైస్ మిల్లర్ల సమస్యను తాను కూడా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. విబిజి రామ్ జి కింద గ్రా మాలలో రహదారులు, మట్టి రోడ్ల పనులు, రహదారులకు ఇ రువైపులా కంపచెట్లను తొలగించే కా ర్యక్రమాలను చేపట్టాల ని, తాగునీటి విషయంలో గ్రామాలలో అధికారులు, ప్రజాప్రతి నిధులు బాధ్య త తీసుకునేలా చ ర్యలు తీసుకోవాలని, ఆ యిల్ పామ్ పై అవగాహన కల్పించాలని, పసుగ్రా స కొ రత లేకుండా కా ర్యచరణ ప్రణాళిక రూపొం దిం చాలని, ప్రస్తుతం ఉన్న పశుగ్రాసాన్ని జాగ్రత్తగా వా డడంతో పాటు, భవిష్యత్తులో ఇబ్బందులు రా కుం డా చూడాలని, గ్రామపంచాయతీ కార్యద ర్శులు గ్రా మాలలోనే ఉండి నీటి వృధాను అరికట్టడమే కా కుం డా, నీరు పొదుపుగా వాడుకునేలా ప్రజలకు అ వగాహన క ల్పించాలని కోరారు.

    భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మా ట్లాడుతూ ఎల్ నినోపై రాష్ట్ర ము ఖ్యమంత్రి ప్రజా ప్రతినిధులందరి తో సమీక్షించడం జరిగిందని, ఎ ల్ నినో వల్ల బోర్లు ఎండిపోయే ప రిస్థితులు వచ్చాయని, డిసెంబ ర్, జనవరి నుండి సమస్య ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంద ని, రైతులు యాసంగిలో వరి వే సుకోవద్దని, వివిజి రాంజీ కింద రై తులు, రైతుకూలీలకు ఉపయోగ పడే పనులు చేపట్టాలని, భూగ ర్భ జలాలను కాపాడుకోవాలని, ఎల్ నినోను ప్రజలు సీరియస్ గా తీసుకోవాలని కోరారు.

    ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనస భ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావ పరిస్థి తుల ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్య క్రమాలు చేపడుతున్నదని, ముఖ్యంగా తాగునీరు, పశుగ్రాసం, విద్యు త్తు, తదితర సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నదని, ప్రజాప్రతినిధులు, అ ధికారులు సమన్వయంతో పనిచేస్తే తాగు నీరు, విద్యుత్తు, ఇతర సమస్య లన్నిటికి పరిష్కారం దొ రుకుతుందని, ఎక్కడ నీటిని, విద్యుత్తును, భూగ ర్భ జలాలను వృధా చే యవద్దని కోరారు. గత ప్ర భుత్వం సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇ ప్పుడు ఇలాంటి క రువు పరిస్థితులు వచ్చేవి కాద ని అన్నారు. పిల్లాయిపల్లి, ధర్మారె డ్డి కాలువల మే జర్ పనులు పూర్తి చేసుకోవడం జరుగుతున్నదని , వీటి ద్వారా చెరువులు నిం పుకుంటామన్నారు. 1951 నుం డి 2026 వరకు దేశంలో 16 సార్లు క రువు పరిస్థితులు వస్తే, పదిసార్లు తెలంగాణ ప్ర భావిత మైందని, ప్రస్తుత పరిస్థితులు ఎదుర్కొనేం దుకు రాష్ట్ర ప్రభు త్వం సిద్ధంగా ఉందని, పశుగ్రా సం అందించేందుకు, భూగర్భ జ లాలు తగ్గితే అవ సరమైతే అద్దెబోర్లతో ప్రజలకు నీరు ఇచ్చే లా, అ లాగే కూలీలకు, వ్యవసా య కూలీలకు, విపిజి రాంజీ కింద పనులు కల్పించేలా ప్రత్యేకించి గ్రామీ ణ మట్టి రోడ్లు ,పొలాలకు వెళ్లే రహదారులను వే సుకునేలా ప్రజలకు భరోసా కల్పించే విధంగా ప్ర భుత్వం చేస్తున్న ద ని ,అధికారులు ప్రజలకు అం దుబాటులో ఉండి ఎల్ నినో పై అవగాహన కల్పిం చాల్సిన అవసరం ఉందని అన్నారు.

    జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ మా ట్లాడుతూ ఎల్ నినో కారణంగా ఏర్పడ్డ పరిస్థితులను ప్రజలకు తె లియజేస్తూనే నీటిని పొదుపుగా వినియోగించు కునేలా చూడా ల ని, ముందుగా గ్రామాలలో నీటి వనరుల విశ్లేషణ చేయాలని, నీరు వృధా కాకుండా చూడాలని, కురిసిన ప్రతి వర్షం బొట్టు భూమిలోకి ఇంకెలా విబిజి రాంజీ కింద ఇంకుడు గుంతలు, ఊ ట కుంట లు, వాన నీటి సంరక్షణ కట్టడాలు చేప ట్టాలని, రైతులు వరికి బ దులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని,పశు గ్రాసం పెంపునకు కార్యా చరణ ప్రణాళిక రూపొం దించాలని, అందరూ కలి సికట్టుగా ఎల్ నినో ను ఎదుర్కొందామ ని పిలుపు నిచ్చారు.ఎల్ నినో పై జిల్లా కలెక్టర్ కార్యాలయం లో టోల్ ఫ్రీ నంబర్ 180042514 42 తో కంట్రోల్ రూమ్ ఏర్పా టు చేయడం జరిగింది జిల్లా కలె క్టర్ వెల్లడించారు.

    స్థానిక సంస్థల ఇంచార్జ్ అదన పు కలెక్టర్ ప్రేమ్ క ర ణ్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారు లు, భూగర్భ జల, విద్యుత్, ఆ ర్ డ బ్ల్యూఎస్, తదితర శాఖల అధి కారులు ఎల్ నినో పరిస్థితిలలో వారి శాఖల ద్వారా చే పట్టే కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.మున్సి పల్ చై ర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, ఇతర జిల్లా డివి జ న్,మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా జలసిరి బ తుకమ్మపై రూ పొందించిన వీడియో సిడిని ముఖ్య అ తిథు లు ఆవిష్కరించారు. జిల్లా పౌర సంబoధాల అధికారి ఆధ్వ ర్యంలో ఎల్ నినో పై తెలంగాణ సాం స్కృ తిక సారథి కళా కా రులు తమ పాటల ద్వారా అవగాహన సద స్సుకు హాజరైన వారికి అవగాహన కల్పించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.