–మహిళలు,యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే న్యాక్ (NAC) లక్ష్యం
Burri Chaitanya Srinivas : ప్రజా దీవెన,నల్లగొండ టౌన్: యు వత నైపుణ్యాలను పెంపొందిం చుకొని స్వయం ఉపాధి పొందా లని నల్గొండ మున్సిపల్ కార్పొ రేషన్ మేయర్ శ్రీమతి బుర్రి చైత న్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బుధవారం నల్లగొండలోని నేష న ల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (N AC) కేంద్రంలో హైదరాబాద్ న్యా క్ డీజీ ఎం.శ్రీనివాస్ రెడ్డితో కలిసి శిక్షణ ప్రయోగశాలలను ప్రారం భించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మేయర్ మాట్లా డుతూ స్కిల్ డెవలప్మెంట్ తోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు.

నేటి ప్రపంచంలో విద్యతోపాటు నైపుణ్య అభివృద్ధి కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు.
యువత న్యాక్ కేంద్రంలో అందిం చే వివిధ ఉపాధి ఆధారిత కోర్సు లను సద్వినియోగం చేసుకోవా లని సూచించారు.కేవలం ఉద్యో గాల కోసం ఎదురు చూడకుండా నైపుణ్యాలను పెంపొందించుకొని స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపుని చ్చారు.
స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యు వతకు ఉపాధి అవకాశాలు మె రుగు పడటంతో పాటు ఆర్థిక స్వాలంబన సాధ్యమవుతుందని తెలిపారు. మహిళలు కూడా వి విధ వృత్తి విద్యా కోర్సులను శిక్ష ణ పొందుతూ ఆర్థికంగా ఎదగా లని ఆకాంక్షించారు. నైపుణ్య శిక్ష ణ పొందిన మహిళలు, యువత తమ ప్రతిభతో మంచి భవిష్య త్తును నిర్మించుకునే అవకాశం ఉందన్నారు. శిక్షణ ప్రయోగశాల ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ ప రిజ్ఞానం పెంపొందుతుందని, వృ త్తి నైపుణ్యాలు మెరుగుపడతా యని పేర్కొన్నారు.
మహిళలు,యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం గా న్యాక్ పనిచేస్తుందన్నారు
రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా నల్లగొండలో రూ.20 కోట్లతో మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహ కారంతో NAC ని ఏర్పాటు చే యడం జరిగిందన్నారు. మహి ళలు, యువత దీనిని సద్విని యోగం చేసుకొని వృత్తి నైపు ణ్యాన్ని, ఉపాధి అవకాశాలను పొందాలని సూచించారు.
హైదరాబాద్ న్యాక్ డైరెక్టర్ జన రల్ ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడు తూ ఇప్పటివరకు నాక్ ద్వారా 5 .52 లక్షల మందికి పైగా నైపుణ్య శిక్షణ అందించడం జరిగింద న్నా రు. నిర్మాణ రంగానికి సంబం ధిం చి వివిధ ట్రేడ్ కోర్సులతో పాటు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఫిని షింగ్ స్కూల్, MEP మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా కోర్సు లను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.
నల్లగొండలో న్యాక్ సొంత కార్ప స్ ఫండ్ నుంచి రూ. 20 కోట్ల వ్య యంతో నాలుగు అంతస్తుల భవ నాన్ని నిర్మించిందని పేర్కొన్నారు.
ఈ కేంద్రంలో ఆరు ఆధునిక తర గతి గదులు, ఆరు అధునాతన శిక్షణ ప్రయోగశాలను, ఒకేసారి 250 మందికి శిక్షణ అందించే సా మర్థ్యం ఉందన్నారు. నల్లగొండ లో ఈ నైపుణ్య అభివృద్ధి కేంద్రా న్ని ఏర్పాటు చేయడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతో చొ రవ చూపారని, ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపా రు.
జిల్లాలో నిరుద్యోగ యువతకు, మహిళలకు ఉద్యోగ ఉపాధి అ వకాశాలు కల్పించడానికి మంత్రి ఎంతో కృషి చేస్తున్నారని అ న్నా రు. జనవరి 2026 నుంచి ఇప్ప టివరకు నల్గొండ కేంద్రం ద్వారా 1,118 మందికి శిక్షణ అందించ డం జరిగిందన్నారు. ఈ కేంద్రం కేవలం శిక్షణ సంస్థ మాత్రమే కా దని నిరుద్యోగ యువతకు ఉపా ధి ,స్వయం ఉపాధి మరియు ఆ ర్థిక స్వాలంబన కల్పించే ఒక గొ ప్ప వేదికని తెలిపారు. రాష్ట్రంలో నే ఈ కేంద్రాన్ని ఒక ఆదర్శవంత మైన నైపుణ్య అభివృద్ధి కేంద్రం గా తీర్చిదిద్దేందుకు న్యాక్ కట్టు బడి ఉందన్నారు.జిల్లాలోని ని రుద్యోగ యువత, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కో రారు.
అనంతరం వివిధ కోర్సులలో శిక్ష ణ పూర్తి చేసుకున్న మహిళలు, యువతకు మేయర్ బుర్రి చైత న్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి సర్టిఫి కెట్లను పంపిణీ చేశారు. ఈ కా ర్యక్రమంలో NAC డైరెక్టర్ ఎం. రాజిరెడ్డి, NAC అసిస్టెంట్ డైరెక్ట ర్ నల్లగొండ చింతమల్ల రమేష్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎం.ఏ.హఫీజ్ ఖాన్, మా జీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి,డిప్యూటీ మేయర్ మ హమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, కా ర్పొరేటర్ మహమ్మద్ ఇబ్రహీం, వివిధ కంపెనీల ప్రతినిధులు బూ రుగు సుభాష్, ప్రశాంత్ శెట్టి, డా క్టర్ వైష్ణవ అలీ, ఇమ్మానుయేల్, వినయ్ వంజర, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యా ద వ్, న్యాక్ సిబ్బంది చింతమల ర మేష్, మేడి సురేష్, ఏసమల్ల అ శోక్ కుమార్ తదితరులు పాల్గొ న్నారు.


