–ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా పథకంతో ప్రతి కుటుంబానికి రక్షణ
–అర్హులందరూ నమోదు చేసుకోవాలి
–ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిలుపు
Indiramma Family Life Insurance Scheme :ప్రజా దీవెన, మిర్యాలగూడ: పేద, మధ్యతరగతి కు టుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టా త్మకంగా ప్రవేశపెట్టిన ఇందిర మ్మ కు టుంబ జీవిత బీమా పథ కాన్ని అర్హులందరూ సద్విని యోగం చేసుకోవాలని మిర్యాల గూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారె డ్డి పిలుపునిచ్చారు. కుటుంబం లో సంపాదించే వ్యక్తి అనుకో కుండా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుం డా ప్రభుత్వం రూ.5 లక్షల జీవిత బీమా అందిస్తుందని తెలి పారు.శనివారం మిర్యాలగూ డ మున్సిపాలిటీ పరిధిలోని బంగారుగడ్డ వార్డులో నిర్వహించి న ఇందిరమ్మ కుటుంబ జీవి త బీమా పథ కంపై అవగాహన సదస్సు, నమోదు కార్యక్రమా నికి ఆ యన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సన్నబి య్యం పంపిణీ, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇ ళ్లు, వడ్డీలేని రుణాలు, మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తోందన్నారు. మిర్యాలగూడ ని యోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూర య్యాయని, వాటిలో 1,500 ఇళ్లకు డిసెంబర్ 9న భూ మిపూజ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి న విషయాన్ని గుర్తుచేశారు.ఈ నెల 19న ముఖ్య మంత్రి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రా రంభించారని, రాష్ట్రంలోని ప్రతి అర్హ కుటుంబానికి ఆ ర్థిక రక్షణ కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఇప్పటికే ఇతర జీవిత బీమా పథకాలు ఉన్నప్పటికీ ఇందిరమ్మ బీమా కూడా వర్తిస్తుందని స్ప ష్టం చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గం లోని ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, గ్రామపంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో నమోదు చేసుకోవాలని సూచించారు.
రెండు నిమిషాల్లోనే బీమా నమోదు
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి నమోదు చేసు కోవచ్చని తెలిపా రు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించిన సందర్భంలో ప్రభుత్వం రూ.5 లక్షల జీవిత బీమా అందిస్తుందని వివరించా రు.నమోదు సమయం లో కుటుంబ సభ్యుల సమ్మతితో బీ మా పొందే వ్యక్తి వి వరాలు, నామినీ వివరాలు, మొబైల్ నంబ ర్ సమర్పిం చాలని సూచించారు. గ్రామపంచాయతీలు, ము న్సిపల్ వార్డుల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో రేషన్ కార్డు ఆధా రంగా ముందుగానే వివరాలు పొందుపరిచిన దరఖాస్తు ఫారా లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అవ సరమైన వివరాలు సమర్పిస్తే కేవలం రెండు నిమిషాల్లో నే నమోదు ప్రక్రియ పూర్తవుతుందని, అనంతరం దరఖాస్తుదారులకు రసీదు అందజేస్తామని చెప్పారు.
రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా తర్వాత దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇ ప్పటికే ఇతర జీవిత బీమా పథకాల్లో సభ్యులుగా ఉ న్నవారికి కూడా ఇందిరమ్మ బీమా వర్తిస్తుందని తెలి పారు. ఈ పథకంలో నమోదు చేసుకున్నంత మాత్రాన ఎవరికీ పెన్షన్లు రద్దు కావని స్పష్టం చేశారు.ప్రస్తుతం ఎ క్కడ నివాసం ఉంటున్నారో అక్కడే నమోదు చేసుకోవ చ్చని, రేషన్ కార్డు, ఆధార్ కార్డుల్లో చిరు నామాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ దరఖాస్తుదారుల అభ్యర్థన మేరకు వారు కోరుకున్న చోట చిరునామా నమోదు చేసే అవ కాశం ఉంటుందని వివరించారు.ఈ కార్యక్ర మంలో మిర్యాల గూడ మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ, ఆర్డీవో రమణారెడ్డి, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీజారెడ్డి, తహసీ ల్దార్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Indiramma Family Life Insurance Scheme


