–తెలంగాణ వాటా నీటిని కాపాడలేని ప్రభుత్వం ఎందుకు
–ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్కలపై మాజీ మంత్రి తీవ్ర ప్రశ్నలు
Ex minister Guntakandla Jagadish Reddy : ప్రజా దీవె న, నల్లగొండ కృ ష్ణా జలాల వినియోగం, నాగార్జునసాగర్ నీటి తరలింపు, ఆం ధ్రప్రదేశ్ చేపట్టినట్లు ఆరోపిస్తున్న సొరంగం ని ర్మాణం, రైతుల సాగునీటి క ష్టాలపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుం ట కండ్ల జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో నిల దీ శారు. తెలంగాణ ప్రయోజనాలను పక్కనపె ట్టి ఆం ధ్ర ప్రదే శ్కు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహ రి స్తోందని విమర్శించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీ ఆ ర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావే శంలో ఆయ న పలు కీలక ప్రశ్నలు సంధించారు. నాగార్జున సాగర్ జలాశ యం గర్భంలో ఆంధ్రప్రదేశ్ అ క్రమంగా సొరంగం నిర్మిస్తోందని జగదీశ్ రెడ్డి ఆరోపిం చారు. ఈ వ్యవహారం ఎని మిది నెలలుగా కొనసా గు తున్నా రాష్ట్ర మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సొరంగం నిర్మాణానికి తెలం గాణ ప్రభు త్వం అనుమతులు ఇచ్చిందా? కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) అనుమతి ఉందా? కేంద్ర ప్ర భుత్వం ఈ అంశంపై ఏం చెబుతోందో ప్రజలకు వివరిం చాలని డిమాం డ్ చేశారు.
గతంలో శ్రీశైలం జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపో యింద ని, ఇప్పుడు నాగార్జునసాగర్ నీళ్లపైనా కన్నేసిందని విమర్శిం చారు. సాగర్లో మిగిలి ఉన్న నీటిని కా పాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని, తె లంగాణ వాటా నీటిని కాపాడా ల్సిన బాధ్యత ముఖ్య మంత్రిపై ఉందన్నారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్న కృష్ణా జలాల వినియోగ లెక్కలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఆం ధ్రప్రదేశ్ 290 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించు కుం టే తెలంగాణకు 40 టీఎంసీలు కూడా దక్కలేదని పేర్కొన్నా రు. మరోవైపు తెలంగాణ 128 టీఎంసీలు వి నియోగించుకుం దని చెబుతున్నారని, ఏ ప్రాజెక్టు నుంచి ఎంత నీటిని తీసుకు న్నారో పూర్తి వివరాలు వెల్లడించా లని డిమాండ్ చేశారు .ఉత్త మ్ కుమార్ రెడ్డి కేంద్రానికి రాసిన లేఖలు, ప్రభు త్వం జారీ చేసిన జీవోలు, వాటి నంబర్లతో సహా ప్రజల ముందుంచాలని సవాల్ విసిరా రు. కృష్ణా జలాల విష యంలో ప్రభుత్వం తీసు కున్న చర్యలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
కాలువల్లో నీళ్లు లేవు.. రైతుల పరిస్థితి దయనీయం
నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఎండిపోయిందని, కుడి కా లువ కింద ఆంధ్రప్రదేశ్ రైతులు పంటలు సాగు చేసుకుంటుంటే తెలంగాణ రైతులు మాత్రం నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొం డ, మహబూబ్నగర్ జిల్లాలకు కృష్ణా జలాల విషయం లో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నా రు.డీ-25, డీ-37, డీ-38, డీ-40 కాలువల పరిధిలోని ఆయక ట్టుకు నీళ్లు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు చెబుతున్న ప్రభుత్వం, కనీసం సా గునీరు అందించకుండా పంటలు ఎలా పండించాలని ఆశిస్తోం దని నిలదీశారు. కూరగాయల సాగుకు కూడా నీరు అవసర మని గుర్తుచేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చివరి ఎకరం వరకు సాగు నీరు అందించామని, ప్రస్తుతం కాలువల్లో నీళ్లు లేక రైతులు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారని అన్నారు. ఎని మిదేళ్ల పాటు చివరి ఆయకట్టుకు నీరందించామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయసము ద్రం అలుగు ఒక్కసారి కూడా దుంకలే దని విమర్శించారు.సాగునీటి సమస్యలతో పాటు ధాన్యం కొనుగోళ్ల లో నూ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో నెలల తర బడి రైతులు పడిగాపులు కాస్తున్నారని, చివరకు ప్రైవేటు వ్యా పారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్ప డుతోందన్నారు. మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దళారుల చేతుల్లోకి నెడుతు న్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టి, రాష్ట్రం లో మళ్లీ వలసల పరిస్థితిని తీసు కొస్తున్నారని మండి పడ్డారు.
మంత్రులే సమాధానం చెప్పాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ అంశాలపై ప్ర జలకు సమాధానం చెప్పాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రుల ఆత్మలు చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టా రా? రాష్ట్ర ప్రయోజనా ల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ము ఖ్యమయ్యా యా? అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నాగా ర్జున సాగర్లో మిగిలిన నీటిని కాపాడటంతో పాటు, ఏపీ సొ రంగం నిర్మాణాన్ని నిలిపివేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చ ర్యలను వెంటనే వెల్లడించాలని కోరారు. కృష్ణా జలాల విష యంలో తెలంగాణ హక్కులను కాపాడకపోతే నల్గొండ సహా రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. తెలం గాణ నీటి వాటా, రైతుల సాగునీ టి హక్కుల పరిరక్షణ విష యంలో ప్రభుత్వం ఇకనైనా మేల్కొని తక్షణ చర్యలు చేపట్టా లని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
Ex Minister Jagadish Reddy

