Monday, September 28, 2026
More
    HomeOpinionBrs Ex MLA Chiramarthi Lingaiah : రెండేళ్లైన తీరుమారని రేవంత్ వ్య వహరిశైలి

    Brs Ex MLA Chiramarthi Lingaiah : రెండేళ్లైన తీరుమారని రేవంత్ వ్య వహరిశైలి

    📰 Generate e-Paper Clip

    — నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

    Brs Ex MLA Chiramarthi Lingaiah : ప్రజా దీవెన, నల్ల గొండ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి వ్యవహార శైలి, భాష మారలేదని, రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి అయిన నాటినుం డి సా మాన్య ప్రజలే కాదు ఆ పార్టీ నా యకులు కూడా ఇ బ్బందులు పడు తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరు మర్తి లింగయ్య తీవ్ర స్థా యిలో మండిపడ్డారు. నల్లగొండ బి ఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాల యంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు.

    మొదటి నుండి కాంగ్రెస్ జెండా మో సిన కార్యకర్తలు రేవంత్ రెడ్డి తీరు తో విసుగు చెందిపోయారని, పగ టి పూట సొంత పార్టీ నేతలనే టా ర్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్న రేవంత్ రెడ్డి రాత్రి మోడీ చంద్రబాబులతో చీకటి ఒప్పందాలు చేస్తు న్నాడని ఆరోపించారు.సీఎం రేవంత్ రెడ్డి అక్రమాలను కాం గ్రెస్ పార్టీ ఆగడాలను, తప్పిదా లను ఎప్పటికప్పుడు ఎక్కడి క్కడా బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంద ని, ప్రజాక్షేత్రంలో అ రాచక కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రా వు చుక్కలు చూపిస్తున్నారని గుర్తుచేశారు.

    బొగ్గు కుంభకోణం, కాంగ్రెస్ పార్టీ స్కాంలను ఎండగట్టినందు కే హరీ ష్ రావుపై అక్రమ కేసు బనాయిం చిందని,కక్ష్య సా ధింపు చర్యలో భాగంగానే హరీశ్ రావుకి రాత్రికి రాత్రే నోటీ సులు ఇచ్చారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చినా సిగ్గులేని రేవంత్ రెడ్డి సర్కార్ మళ్లీ విచారణ అంటూ హరీష్ రావుని ఇబ్బందులు పెడుతుందన్నారు.

    డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదో వ పట్టిస్తోందని, ఎలక్షన్స్ వస్తేనే కెసిఆర్ పై కాళేశ్వరం కేసు, కెటిఆర్ పై ఫార్ములా ఈ రేసు కేసు, హరీష్ రావు పై ఫోన్ ట్యాపింగ్ కేసులు అంటూ వేధింపులు చేస్తోందని, హరీష్ రా వు మాట్లాడిన విషయంలో ఏ ఒక్క మంత్రి కూడా ఇప్పటి వ రకు స్పందించలేదన్నారు.ఇన్నిసార్లు నల్లగొండ జిల్లాకు వ చ్చిన ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వ ని అసమర్థ సీఎం రే వంత్ రెడ్డి అని, అధికారం, ధనం, పోలీసు యంత్రాంగం తో నే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నడుపుతుందని, సీని యర్ కాంగ్రెస్ మంత్రులందరి ఫోన్ లు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నాడని, అధికారులు పై స్థాయి నుండి కిందిస్థాయి వరకు అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలానే వ్య వహరిస్తున్నారని తెలిపారు.

    పేద బడుగు బలహీన వర్గాల ప్రజ లను రేవంత్ రెడ్డి ప్రభు త్వం పీడి స్తోందని, కోదాడలో దళితబిడ్డ కర్ల రాజేష్ మృ తి కి పోలీసులే కారకు లయ్యారని, ప్రశ్నించే గొంతుకులను రే వంత్ రెడ్డి ప్రభుత్వం అణగదొక్కుతుందన్నారు.కోదాడలో రాజేష్ మృతికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత వ హి స్తూ వెంటనే రాజీనామా చేయా లని డిమాండ్ చేశారు. నకి రేకల్ లో స్థానిక ఎమ్మెల్యే అక్రమ ఇసుక, మట్టి రవాణా య దేచ్ఛగా చేస్తున్నాడని, ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీనీ పాతాళంలో కలిపి మళ్ళీ తెలంగాణలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీనీ తీసుకురావడం ఖాయమన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.