Monday, September 28, 2026
More
    HomeIndiaCM Revanth Reddy Kaleshwaram commission supreme court : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ప్రభుత్వం...

    CM Revanth Reddy Kaleshwaram commission supreme court : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం, సుప్రీం మెట్లెక్కనున్న తెలంగాణ ప్రభుత్వం

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy Kaleshwaram commission supreme court : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలం గాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కాళేశ్వరం ప్రాజె క్టు వ్యవహారం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. హై కోర్టు ఇచ్చిన తీర్పుతో నీడలా వెంటాడు తున్న స స్పెన్స్‌కు తెరదించుతూ, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిం చా లని నిర్ణయించుకుంది. ఇది కేవలం ఒక న్యాయపరమైన ని ర్ణయమే కాదు, రాష్ట్ర పాలనా వర్గాల్లోనూ, రాజకీయ రంగం లోనూ పెద్ద అలజడికి నాంది పలికిందని చెప్పవచ్చు.

    కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినట్లు ఆరోపించబడుతున్న అవ కతవకలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించన విషయం తెలిసిందే. అ యితే ఈ కమిషన్ విచారణ తీరుపై, అది సమర్పించిన నివే దిక ఆధారంగా తీసుకునే చర్యలపై హైకోర్టు సంచలన తీర్పు ను వెలువరించినది సుస్పష్టం.

     

    కమిషన్ విచారణలో నిబంధనల ను పాటించలేదని హైకో ర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది కూడా. మాజీ సీఎం కే సీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఐఏఎస్ అధికారులు స్మి తా సబర్వాల్ మరియు ఎస్‌కే జోషులపై ఎటువంటి ముంద స్తు చర్యలు తీసుకోరాదని కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభు త్వం అత్యవసర భేటీ లో ఈ మేరకు నిర్ణ యం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

    ప్రభుత్వం నిర్దిష్ట పట్టుదలతో ముందుకు తెలంగాణ హైకోర్టు తీర్పుతో వెన క్కి తగ్గని ప్రభుత్వం, తన వ్యూహా న్ని మార్చిం ది. న్యాయ విభాగంతో ఇప్పటికే సుదీర్ఘ చర్చలు జరిపిన అ ధికార వర్గాలు, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ స్పెషల్ లీ వ్ పిటి షన్ (SLP) దాఖలు చేసేందుకు సర్వం సిద్ధం చేశా యి.ప్రాజెక్టుకు సం బంధించిన సమగ్ర సమాచారాన్ని, జరి గి న అవకతవకలకు సంబంధించిన బలమైన సాక్ష్యాలను సు ప్రీంకోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.

         రాజకీయాల్లో పెను ప్రకంపనలు

    ఈ న్యాయ పోరాటం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయా లను మరింత వేడెక్కించనుందని రాజకీయ పరిశీలకు భావి స్తున్నారు. అయితే కమిషన్ నివేదికను పక్కన పెట్టి, సుప్రీం కోర్టులో తన వాదనను ఎలా నిలబెట్టుకుంటుందనేది ఆస క్తికరం గా మారింది. ఇదిలా ఉండగా హై కోర్టు తాత్కాలిక ఊరట ఇవ్వడంతో, సుప్రీంకోర్టులో ఏమి జరుగు తుందోనని ఆ పార్టీ వర్గాలు ఉత్కం ఠగా ఎదురుచూస్తున్నాయి.

    ఈ కేసు ఇప్పుడు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకే పరిమితం కా కుండా, తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీల క మైలురాయిగా మారబోతోంది. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీ సుకుంటుందనేది ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశం గా మారింది.

    ముగిసిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం

     

    తెలంగా ణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్ష తన గురువారం సా యంత్రం జరిగిన తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో ప్రాధాన్యతను సంతరించుకున్న ఆర్టీసీ సమ్మె, కా ళేశ్వరంపై హైకోర్టు తీర్పు రెండు అంశాలను ప్రధానంగా చర్చించా రు. తెలంగాణ రవాణా వ్యవస్థకు వెన్నెముక వం టి ఆర్టీసీ కార్మికుల సమ్మె,రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హా ట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ప్రభు త్వం కేవలం సమస్యను తాత్కాలికంగా ఆపడమే కాకుం డా, ఆర్టీసీని గాడిలో పెట్టేలా దీర్ఘకాలిక ప్రణాళికలతో ముం దుకెళ్తోంది.

    ఆత్మహత్యలకు తావులేదని, కార్మి కుల ఆవేదనను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆత్మ హత్యలు సమ స్యలకు పరిష్కారం కావని స్పష్టం చేశారు. “కార్మికుల కష్టా ల్లో ప్రభుత్వం పాలుపంచుకుం టుంది, మనం కలిసి ఈ వ్య వస్థను బలోపేతం చేసుకుందాం” అని ఆయన చేసిన వ్యా ఖ్యలు కార్మిక వర్గాల్లో ధైర్యాన్ని నింపుతున్నాయి.మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య క్తం చేస్తూ కార్మికులు తమ అ మూల్యమైన ప్రాణాలను ప ణంగా పెట్టవద్దని, ప్రభుత్వం పట్ల నమ్మకంతో ఉండాలని పి లుపునిచ్చారు.

    ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కా రమే లక్ష్యంగా ప్రభుత్వం దూకుడు పెంచింది. రేపు టిజిఎస్ ఆర్ టిసి ప్రతినిధులను చర్చలకు ఆహ్వానిం చింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క నేతృత్వంలోని మంత్రుల బృందం, కార్మిక సంఘాల తో ముఖాముఖి భేటీ కానుంది. ఈ భేటీలో చర్చించబోయే కీలక అంశాలు ఇలా ఉన్నాయి. కేవలం సమ్మె విరమణే కా కుండా, ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ఆధునిక ప్ర ణాళికలు చర్చల్లో ప్రధానాంశాలుగా ఉండనున్నాయి.

    ఉద్యోగభద్రతతో పాటు, కార్మికుల సంక్షేమానికి భరోసా ఇచ్చే నిబంధ నలు చర్చల్లో మూడించనున్నారు.ప్రభుత్వం పట్ల కార్మికులకు ఉన్న అపనమ్మకాన్ని తొలగించి, ఉమ్మడి లక్ష్యం దిశగా వారిని నడిపించడం జరుగుతుందన్నారు.రాష్ట్ర సా ధనలో ఆర్టీసీ కార్మికుల పోరాటం చిరస్మరణీయమని, అదే స్ఫూర్తితో, ప్రస్తుత సంక్షోభం నుండి ప్రభుత్వం-కార్మికులు క లిసి ఒక బలమైన, సుస్థిరమైన రవాణా వ్యవస్థను నిర్మి స్తా రా అనేది రేపటి చర్చ ల తర్వాత స్పష్టం కానుంది. ఆర్టీసీ భవిష్యత్తు కోసం ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగులు శుభ సూచకంగా మారుతాయని ఆశిద్దామని మంత్రులు ఆశాభా వం వ్యక్తం చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.