Sunday, September 27, 2026
More
    HomeOpinionMGU degree results : బిగ్ బ్రేకింగ్, ఎంజియూ డిగ్రీ ఫలి తాలు విడుదల, సెమిస్టర్...

    MGU degree results : బిగ్ బ్రేకింగ్, ఎంజియూ డిగ్రీ ఫలి తాలు విడుదల, సెమిస్టర్ పెరిగే కొద్దీ పెరిగిన జోరు

    📰 Generate e-Paper Clip

     

    MGU degree results :ప్రజా దీవెన, నల్లగొండ టౌన్
    మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MGU) డిగ్రీ విద్యార్థుల సుదీర్ఘ ని రీక్షణకు తెరపడింది. యూనివర్సి టీ వైస్ ఛా న్స లర్ ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ చేతుల మీదుగా డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు అధికారి కంగా విడుదలయ్యాయి.ఈ ఫలితాల సరళిని గమనిస్తే ఒక ఆసక్తి కరమైన విషయం స్ప ష్టమవుతోంది. విద్యార్థులు సీనియర్లు అవుతున్న కొద్దీ వారి ఉత్తీర్ణత శాతం కూడా విపరీతంగా పెరుగుతూ వచ్చింది. మొదటి సెమిస్టర్‌లో కాస్త తడబడినా ఆరోసెమిస్టర్‌కి వచ్చే సరికి విద్యార్థులు దుమ్మురేపారు.

    ఏ సెమిస్టర్‌లో ఎంత శాతంతోఉత్తీర్ణత శాతం సాధించారో చూ ద్దాం..1వ సెమిస్టర్ 24.96 శాతం, 2వ సెమిస్టర్ లో 32. 49, 3వ సెమి స్టర్ 32.66 శాతం 4వ సెమిస్టర్ 43.26, 5వ సెమిస్టర్ 47.28 శా తం కాగా 6వ సెమిస్టర్ లో 53.48 శా తం అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించారు. ఫలితాల పూర్తి వి వ రాలను, మార్కులను తెలుసుకో వడానికి విద్యార్థులు యూనివర్సి టీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిం చవచ్చని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామి నే షన్స్ (COE) డాక్టర్ జి. ఉపేందర్ రెడ్డి తెలిపారు.

    ఈ ఫలితాల విడుదల కార్యక్రమం లో వర్సిటీ రిజిస్ట్రార్ ఆ చార్య కొప్పు ల అంజిరెడ్డి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరె క్టర్ ఆచార్య ఆకు ల రవిలతో పాటు అసిస్టెంట్ కంట్రోలర్లు డాక్టర్ లక్ష్మీప్రభ, డాక్టర్ ప్ర వళిక, డాక్టర్ సంధ్యారాణి, డా క్టర్ కళ్యాణి మరియు డాక్టర్ భిక్షమయ్య తదితరులు పాల్గొ న్నారు.

    మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయo టి-సాట్ ఒప్పందం

    నల్లగొండ: మహాత్మాగాంధీ విశ్వవి ద్యాలయం, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం మరియు తెలంగాణ స్కి ల్ అండ్ అకాడమిక్ ట్రైనింగ్ టి- సాట్ (T-SAT) ఆధ్వర్యంలో మరి న్ని ఆన్లైన్ తరగతులతో పాటు కొ త్తగా సర్టిఫికెట్ కోర్సుల ప్రారంభాని కి అవగాహన ఒప్పందం కుదిరింది. ఎంజియు ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ T-SAT CEO బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి హాజరైన ఈ కార్యక్రమంలో M GU ,T-SAT మధ్య ఒప్పంద పత్రాల ను పరస్పరం పంచుకు న్నారు.ఈ సందర్భంగా ఎంజియు ఉపకులపతి ప్రొ. ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం ద్వారా మహాత్మాగాంధీ విశ్వవి ద్యాలయం అందిస్తున్న విద్యా అ వకాశాలు మరింత ఉపయోగకరంగా, విస్తృతంగా మారను న్నట్లు ఆయన తెలిపారు.

    ప్రత్యేకంగా గ్రామీణ మరియు పరి మిత వనరుల ప్రాంతాల్లో జీవించే యువతకు, వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకో వాలి అనుకునే వారికి ఈ ఆన్‌లైన్ కోర్సులు కీలకంగా నిలు స్తాయన్నారు. నాణ్య మైన పాఠ్యాంశాలు, వ్యవహారిక శిక్ష ణా మాడ్యూల్స్ ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగేలా రూ పొందించాలని సూచించారు. భవిష్యత్తు లో కోర్సుల పరిధి మరింత పెంచి ఇతర విభాగాలు కూడా అందిం చాలని కోరారు.

    టి-సాట్ సీఈఓ బోదనపల్లి వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆన్‌లైన్ శిక్షణ ద్వారా నాణ్యమైన విద్యను అందుబాటు లో కి తేవడం ప్రధాన లక్ష్యంగా T-SAT పనిచేస్తుందని పేర్కొ న్నారు. ఆర్థిక పరిమితులు కారణంగా అవకాశాలనుండి దూర మైన వర్గాలకు ప్రయోజనం కలిగేలా ప్లాట్‌ఫారమ్ రూపకల్పన చేసి నటి-సాట్ , విశ్వవిద్యాలయాలతో అను సంధానం ద్వారా మరింత విస్తరించనున్నట్లు ఆయన తెలి పారు.

    మార్కెట్ అవసరాలకు అనుగు ణంగా ప్రత్యేక సర్టిఫికెట్ ప్రో గ్రాములు రూపొందించి, ఉపాధి నైపు ణ్యాల పెంపుకు, వి ద్యార్థుల సామ ర్థ్యాన్ని మెరుగుపరచటానికి టీ- సాట్ ప్ర యత్నాలకు విశ్వవిద్యాల యాల అనుసంధానం తోడ్పడు తుందన్నారు. బిజినెస్ మేనేజ్‌ మెంట్ విభాగం గతంలో టూ రిజం మేనేజ్మెంట్ పై డిజిటల్ తరగతుల నిర్వహణ అనుభ వాన్ని బట్టి టూ రిజం మేనేజ్‌మెంట్ మరియు లాజిస్టిక్ మే నేజ్‌మెంట్ వంటి ప్రత్యేక సర్టిఫికెట్ కోర్సులు కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నారు. బిజినెస్ మేనే జ్‌మెంట్ విభాగం రూ పొందించిన శిక్షణా మాడ్యూల్స్‌లో లైవ్ లెక్చ ర్లు, రికార్డ్‌డ్ పాఠ్యాంశాలు, అసై న్మెంట్లు, వర్క్‌షాప్‌లకు విద్యార్థుల నుం డి మంచి స్పందన వచ్చిందన్నారు.

    భవిష్యత్తులో ఈ భాగస్వామ్యం వర్సిటీలోని ఇతర విభాగా ల కోర్సులకు కూడా విస్తరించాలన్నారు. గతంలో మేనేజ్మెం ట్ విభాగం అందిం చిన టూరిజం ఆన్లైన్ తరగతులను మ రింత విస్తరిస్తూ, ఈ ఒప్పందం ద్వారా ఎంజియు మరిన్ని ఆన్లైన్ తరగతులకు అదనంగా సర్టిఫికెట్ కోర్సులను సైతం అందించనున్న ట్లు రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి తెలిపారు. ఈ కార్య క్ర మంలో T-SAT ఎగ్జిక్యూటివ్ డైరెక్ట ర్ సాధిక్, జనరల్ మేనేజర్ లింగా రెడ్డి, మహాత్మగాంధీ యూ నివర్సిటీ మేనేజ్మెంట్ డీన్ ఆచార్య అలవాల రవి, ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, డా. సభి నా హరాల్డ్, డా. మిరియాల రమేష్, డా. వెంకట రమణారె డ్డి, డా. లక్ష్మీప్రభ, ఆచార్య శ్రీ లక్ష్మి, డా. శ్వేత, డా. అనురాధ, డా. జక్క సురేష్ రెడ్డి, డా. కట్ట కిరణ్ మై, డా. జ్యోతి , రమేష్ నాయక్ తదితర అధ్యాపకులు పాల్గొన్నా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.