–భూసేకరణ, పునరావాస సమ స్యలను త్వరగా పరిష్కరించాలి
–అనుమతులు, కాలువల పను లకు గడువులతో కార్యాచరణ
Gouravelli Project Completion : ప్రజా దీవెన, హైదరాబా ద్: గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తికి అడ్డుగా ఉన్న పర్యావరణ అనుమ తులు, భూసేకరణ, పరిహారం, పునరావాస సమస్యలను నిర్ణీ త గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికా రులను ఆదేశించారు.
ఇప్పటికే భారీగా నిధులు వెచ్చించిన ఈ ప్రాజెక్టు ద్వారా 1.06 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు వేగ వంతం చేయాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాం గ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన గౌరవెల్లిని పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావడంపై తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. సచివాలయంలో శని వారం గౌరవెల్లి ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహిం చారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు నీటిపారుదల, రెవెన్యూ శాఖల ఉన్న తాధి కారులు పాల్గొన్నారు.
నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు, న్యాయపరమైన వ్యవహారాలు చూసే అధికారులు సమన్వయంతో పనిచేయా లని ఉత్తమ్ సూచించారు. పనులవారీగా స్పష్టమైన గడువులు నిర్ణయించి, అర్హులైన వారికి చెల్లించాల్సిన పరిహా రాన్ని త్వరగా చెల్లించాలని ఆదేశించారు. ఆర్థిక, పరిపాలన, న్యాయపరమైన అడ్డంకులు ఏవైనా ఉంటే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి జలాశ యం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి చేపట్టిన ఇందిరమ్మ వరద కాలువ పథకంలో భాగం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పాల నలో 2008 మేలో దీని నిర్మాణానికి తొలి ఒప్పందం కుదిరింది. అనంతరం జలాశయ సామర్థ్యాన్ని 1.410 టీఎంసీల నుంచి 8.230 టీఎంసీలకు పెంచారు. విస్తరించిన పనులకు సంబం ధించి 2017 డిసెంబరులో అనుబంధ ఒప్పందం చేసుకున్నా రు. అయితే అవసరమైన అనుమతులు, క్లియరెన్సులు లేకపో వడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు.
జలాశయ నిర్మాణ పనులు దాదాపు 98 శాతం పూర్తయ్యా యి. అయితే రైతులకు ఆశించిన మేర సాగునీరు అందాలంటే పర్యావరణ అనుమతితో పాటు మిగిలిన భూసేకరణ, పునరా వాస బాధ్యతలు, కాలువల పనులను పూర్తి చేయాల్సి ఉంది. జలాశయం నిర్మాణం పూర్తయినంత మాత్రాన సరిపోదని, అ క్కడి నుంచి రైతుల పొలాలకు నీటిని తీసుకెళ్లే ప్రధాన కాలువ లు, పంపిణీ కాలువలు కూడా సిద్ధంగా ఉండాలని మంత్రి స్ప ష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగిన బడ్జెట్ కేటా యింపులు ఉన్నందున వాటిని సకాలంలో వినియోగించి పను ల్లో పురోగతి చూపాలని ఆదేశించారు.
ప్రాజెక్టుపై ఇప్పటివరకు రూ.1,343.59 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో ధరల పెరుగుదలతో సహా నిర్మాణ పనులకు రూ.88 6.76 కోట్లు, భూసేకరణ, పునరావాసానికి రూ.456.83 కోట్లు వెచ్చించారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి మరో రూ.114.3 89 కోట్లు అవసరమని సమీక్షలో వెల్లడించారు. పెండింగ్ భూ సేకరణను వేగంగా పూర్తి చేయాలని రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు.
జలాశయానికి సంబంధించిన రూ.1,457.979 కోట్ల సవరిం చిన అంచనాను తదుపరి మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపె ట్టేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించాలని ఉత్తమ్ సూచించారు. పెరిగిన భూపరిహారం, పునరావాస వ్యయాలు, జీఎస్టీతో పాటు ఇతర చట్టబద్ధ చార్జీల్లో మార్పులు, ధరల పెరుగుదలను ఈ అంచనాలో పరిగణనలోకి తీసుకున్నారు.
సమీక్షలో పర్యావరణ అనుమతుల అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో ముందస్తు పర్యావరణ అనుమతి లేకుండానే జలాశయ విస్తరణ చేపట్టడంతో ఈ అంశం జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు (ఎన్జీటీ) చేరింది. తాజాగా పర్యావరణ అనుమతి పొందే వరకు తదుపరి నిర్మాణ పనులు చేపట్టరాదని ట్రైబ్యునల్ ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు నిర్మాణ పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి.
పర్యావరణ అంశాలతో ముడిపడిన ప్రతిపాదనల తదుపరి పరిశీలనకు సంబంధించి సుప్రీంకోర్టు జులై 29న ఇచ్చిన నిర్ణ యాన్ని, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 30న జా రీ చేసిన మెమొరాండాన్ని సమావేశంలో పరిశీలించారు. ప్రాజె క్టుకు సంబంధించిన న్యాయపరమైన సమస్యలు, పర్యావరణ అనుమతుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీనియర్ న్యాయవాదుల సేవలను కూడా వినియోగించుకుంటున్నట్లు చెప్పారు.
పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక, పర్యావరణ నిర్వహణ ప్రణాళిక, ప్రజాభిప్రాయ సేకరణ నివేదికలు, మూడు సీజన్లకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పరివేశ్ పోర్టల్‌లో అప్లోడ్ చేసినట్లు అధికారులు వివరించారు. అక్టోబర్ 8న జరగనున్న పర్యావరణ అనుమతి ప్రతిపాదన పరిశీలన సమావేశానికి అవసరమైన పత్రాలన్నీ సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. సంబంధిత పర్యావరణ అధికారుల పరిశీలన, వారి ఆదేశాలకు అనుగుణంగా అనుమతుల ప్రక్రియ కొనసాగాల్సి ఉంది.
అక్టోబర్ 16న ఎన్జీటీలో జరగనున్న విచారణకు ముందే తాజా న్యాయపరమైన పరిణామాలు, నవీకరించిన ప్రాజెక్టు రికార్డులను ట్రైబ్యునల్ ముందుంచాలని ఉత్తమ్ సూచించారు. ఇందుకోసం అడ్వకేట్ జనరల్, ప్రాజెక్టు తరఫు న్యాయవాదులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.జలాశయానికి అవసరమైన 3,870 ఎకరాల్లో ఇప్పటికే 3,850 ఎకరాలు సేకరించినట్లు మంత్రి తెలిపారు. మిగిలిన 20 ఎకరాలకు సంబంధించిన పరిహారాన్ని హైదరాబాద్‌లోని భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపన అథారిటీ వద్ద జమ చేసినట్లు పేర్కొన్నారు. కాలువల కోసం చేపట్టాల్సిన భూసేకరణకు జిల్లాలవారీగా గడువులు నిర్ణ యించాలని సూచించారు.
నిర్వాసిత కుటుంబాల నుంచి అందిన పెండింగ్ వినతులను పరిశీలించి, సంబంధిత రికార్డులు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అర్హత ఉన్న పునరావాస ప్రయోజనాలను త్వరగా అందించా లని మంత్రి ఆదేశించారు. పరిహారం, పునరావాస సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఎడమ, కుడి ప్రధాన కాలువల్లో వినియోగానికి అను వుగా ఉన్న భాగాల నిర్వహణ, మరమ్మతులపైనా సమీక్షిం చారు. పంపిణీ కాలువల పనులకు అవసరమైన అంచనాలు, భూసేకరణ, టెండర్ల ప్రక్రియకు ఆచరణ సాధ్యమైన గడువులు నిర్ణయించాలని ఉత్తమ్ సూచించారు.
వచ్చే సాగు సీజన్‌కు నీటిని అందించేలా కాలువల వ్యవస్థను సిద్ధం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. మిగి లిన ప్రధాన కాలువలు, పంపిణీ కాలువలు, అనుబంధ పను లకు సంబంధించిన రూ.88.89 కోట్ల సవరించిన అంచనాపై తదుపరి చర్యల కోసం చర్చించారు.సమావేశంలో నీటిపారు దల శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్, ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్) ఓ.వి. రమేష్ బాబు, ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) మధుసూదన్ రావు, సంయుక్త కార్యదర్శి కె. శ్రీనివాస్, భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపన కమిషనర్ శివకుమార్ నాయుడు, సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి తదితర నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారు లు పాల్గొన్నారు.

