Nakrekal MLA : ప్రజా దీవెన, రామన్నపేట: తెలంగాణ ప్ర జాప్రభుత్వం నకిరేకల్ నియో జకవర్గంకు తొలివిడతగా 3,5 00 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించినట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వెల్లడించారు. ఇండ్లులేని ప్రతి పేద కుటుం బానికి విడతలవారిగా ఇళ్లు మంజూరు చేసి వారి సొంతింటి క లను సాకారం చేస్తామని స్పష్టం చేశారు.యాదాద్రి భువన గిరి జిల్లా రామ న్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామా నికి చెందిన ఏర్వ మమత, గణేష్ లు నూతనంగా నిర్మించు కున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ పే దల సంక్షే మమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సా గుతోందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇం దిరమ్మ ఇండ్లు వచ్చాయని, గత ప్రభుత్వ 10 సంవత్సరాల పా లనలో ఏ ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వలేదని గుర్తు చేశారు.
పేదల జీవన ప్రమాణాలు మెరు గు పరచడం ప్రభుత్వ ప్రధా న ధ్యేయ మని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షే మ పథకాలు అందేలా కృషి చేస్తా మని తెలిపారు.ఈ కార్యక్రమంలో మా ర్కెట్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మ ల్లారెడ్డి, మండల ప్రజాప్రతిని దులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

