Nalgonda district Police surprise : ప్రజా దీవెన, నల్ల గొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో శబ్దకాలుష్యం తగ్గించి ప్ర శాంతమైన నగర జీవనాన్ని అందించాలనే లక్ష్యంతో నల్ల గొండ పోలీసులు భారీ చర్యలు చేపట్టారు. బుధవారం ని ర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో అధిక శబ్దం సృష్టి స్తున్న ద్విచక్ర వాహనాలపై కఠిన చ ర్యలు తీసుకుంటూ 72 మాడిఫైడ్ సై లెన్సర్లను స్వాధీనం చేసుకుని వాటన్నిటిని రోడ్డురోలర్ తో ధ్వంసం చేశారు.
పోలీసుల కథనం ప్రకారం ఇటీవల కొందరు వాహనదారులు సైలెన్సర్ల లో మార్పులు చేసి అధిక శబ్దం చేస్తూ ప్రజలకు ఇ బ్బంది కలిగిస్తున్న నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగా రు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యం దృష్టిలో పె ట్టుకుని ఈ ప్రత్యేక చర్యలు చేపట్టారు.
క్లాక్ టవర్ కూడలి వద్ద స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను రో డ్ రోలర్ తో నాశనం చేస్తూ, ఇది కేవలం చర్య మాత్రమే కా దు భవిష్యత్తులో ఇ లాంటి తప్పిదాలకు కఠిన హెచ్చ రికగా నిలిచింది. అనుమతి లే కుం డా సైలెన్సర్లు మార్చితే క్రిమి నల్ కేసులు పట్టాల్సి వస్తుందని, మళ్లీ త ప్పు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చే యడంతో పాటు వాహనం సీజ్ చేసే చర్య లు చేపడుతామని హెచ్చరించారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయా ణానికి స హకరించాలని పోలీసులు కోరారు. మీ పరిసరా ల్లో అధిక శబ్దం చేసే వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీ సుల కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇలాంటి ప్రత్యేక డ్రై వ్స్ కొనసాగిస్తూ నల్లగొండను శబ్ద కాలుష్యం లేని నగ రంగా మార్చేం దుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని స్థానిక పోలీసులు స్పష్టం చేశారు.
అంతకు ముందు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాను సారం సుమారు 72 ద్వి చక్ర వాహ నాల మాడి ఫైడ్ సైలెన్సర్లను గుర్తిం చి వాటిని తొలగించి తద్వారా న ల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ కూడలి వద్ద అడిషనల్ ఎ స్పి రమేష్ ఆధ్వర్యంలో రోడ్ రోలర్ ద్వారా ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పి రమేష్ మాట్లాడుతూ ద్వి చక్ర వాహనదారులు కంపెనీ ద్వారా అం దించిన ఒరిజినల్ సైలెన్సర్లను మా త్రమే వినియోగించాలని సూచించారు. సై లెన్సర్లలో అనుమతి లే కుండా మార్పులు చేసి అధికశబ్దం కలిగించే విధంగా ఉపయోగిస్తే సం బంధిత వ్యక్తులపై క్రిమి నల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరిం చారు.
అలాగే తిరిగి మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగించినట్లయితే, అట్టి వా హనదారుల డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేసి, వాహనాన్ని సీజ్ చేయ డం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లను వినియోగించే వారిపై జిల్లా పో లీసులు కఠిన చర్యలు తీసుకుం టూ, ఇలాంటి ప్రత్యేక డ్రైవ్స్‌ను కొనసాగి స్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎ స్పీ శివరాం రెడ్డి, 2 టౌన్ సీఐ రాఘ వ రావు,ట్రాఫిక్ సిఐ మహాల క్ష్మ య్య, వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ ఎస్.ఐ సైదులు, రూరల్ ఎస్. ఐ సైదాబాబు, కనగల్ ఎస్.ఐ రాజీవ్ రెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


