Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda road accident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరి...

    Nalgonda road accident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరి దుర్మరణం 

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda road accident:  ప్రజా దీవెన, నల్లగొండ క్రై మ్: నల్లగొండ జిల్లాలో తెల్లవారు జామున  ఘోర రోడ్డుప్ర మాదం చోటు చేసుకుంది. ఊహిం చని విధంగా జరిగిన ప్రమాదం ఒక సాధారణ సంఘటనగా అనిపించినా అది క్ష ణాల్లో రెప్పపాటులో జరిగిన విషాదoగా చెప్పవచ్చు. హై ద రాబాద్–విజయవాడ జాతీయ రహ దారిపై నల్గొండ ఎక్స్‌ రోడ్ ఫ్లైఓవర్ దగ్గర మంగళవారం ఉద యం ఇంకా వెలుతు రు పూర్తిగా రాని సమయం. రోడ్డుపై వా హనాలు తక్కువగా ఉన్నప్పటికీ, వేగం మాత్రం ఎక్కువగానే ఉంది. అప్పుడు మోజో ట్రావెల్స్ బస్సు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉం డగా, ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో అది ముందున్న లారీని స్వల్పంగా ఢీకొట్టింది.

    ఢీకొన్న వెంటనే ఇద్దరు డ్రైవర్లు బస్సు డ్రైవర్ శ్రీనివాస్ తో పాటు లారీ డ్రైవర్  వాహనాలను పక్కకు ఆపి ఏమి జరి గిందో క్షణాల సమయంలో చర్చించుకుంటున్నారు.  కానీ అ దే సమయంలో ప్రమాదం మరింత ఘోరంగా మారింది. అక స్మాత్తుగా వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన మరో లారీ, ముందే నిలిపి ఉన్న వాహనాలను గమనించక పోవ డంతో నేరుగా ఢీకొట్టింది. ఒక్కసారిగా ఘోర శబ్దం వినిపిం చి, అక్కడ ఉన్నవారు భయంతో పరుగులు తీశారు. వాహ నాల మధ్యలో ఉన్న మోజో ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు శ్రీనివా స్ మరియు బంగారయ్యలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దురదృష్టవశాత్తూ వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయా రు.

    ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ సురేష్ తీవ్రంగా గాయపడి, ప్రా ణాపాయ స్థితిలో ఆసుపత్రికి తరలించబడ్డాడు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరు కుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మృతదేహాలను నల్గొండ ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటన మరోసారి రోడ్లపై అతివేగం ఎం త ప్రమాదకరమో గుర్తుచేసింది. ఒక్క క్షణం నిర్లక్ష్యo ఎన్నో జీవితాలను తారుమారు చేస్తుందన్న వాస్తవికతను నిరూ పిస్తోంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.