Tuesday, September 29, 2026
More
    HomeOpinionNirmal District SI ACB trap : బిగ్ బ్రేకింగ్, నిర్మల్ జిల్లాలో ఏసీబీ దాడులు,...

    Nirmal District SI ACB trap : బిగ్ బ్రేకింగ్, నిర్మల్ జిల్లాలో ఏసీబీ దాడులు, రెడ్ హ్యాండెడ్ గా పట్టు బడ్డ సబ్ ఇన్స్పెక్టర్ 

    📰 Generate e-Paper Clip

    Nirmal District SI ACB trap : ప్రజా దీవెన, నిర్మల్: నిర్మ ల్ జిల్లా మామడలో నిశ్శబ్దంగా సాగుతు న్న ఒక అవినీతి కథకు ఈరోజు థ్రిల్లింగ్ క్లైమాక్స్ కు చేరింది. ప్రజలకు రక్షణ గా నిలవాల్సిన ఒక పో లీస్ అధికారి అదే అధికారాన్ని ఆ యుధంగా మార్చుకుని లంచాల వల వేస్తూ చివరకు రెడ్ హ్యాండెడ్‌ గా చిక్కడంతో కథ కంచికి చేరింది. ఇప్పటివరకు గుట్టుగా నడిచిన ఈ వ్యవహారం ఒక్కసారిగా బహిర్గతమై, ప్రజల్లో షాక్‌తో పాటు ఆగ్రహా న్ని రేపుతోంది. “రక్షకుడే భక్షకు డైతే ఎలా అన్న ప్రశ్న ఇప్పుడు అందరి నోట వినిపిస్తోంది.

    ఏసీబీ దాడుల పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.. నిర్మల్ జి ల్లా మామడ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తు న్న తీగల అశోక్ ఒక భూ వివాదం కేసులో ఫిర్యాదుదా రు కు సహాయం చేస్తానని చెప్పి, “మోసం కేసు నమోదు చేయ కుండా చూస్తాను” అంటూ రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అ ధికారులకు తెలియజేయడంతో వారు జాగ్రత్తగా పన్నిన ఉచ్చులో అశో క్ చిక్కుకున్నారు.

    మధ్యాహ్నం 1 గంట సమయంలో అశోక్ లంచం స్వీకరి స్తుండగానే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకు న్నారు. అతని వద్ద నుంచి రూ. 20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిర్వ హించిన రసాయన పరీ క్ష లో కూడా అతని చేతులకు పాజిటివ్ ఫలితం రావడంతో అ వినీతి ఆరోపణలు బలపడ్డాయి.

    ఈ ఘటనతో అధికార దుర్విని యోగం ఎలా జరుగుతుందో మరో సారి వెలుగులోకి వచ్చింది. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీ సే ఇలాంటి చర్యలు ఎంతతీవ్రమో ఈ కేసు చె బుతోంది. ప్రస్తుతం అశోక్‌ను అరె స్టు చేసి కరీంనగర్‌లోని ప్రత్యేక న్యా యమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నారు. కేసుదర్యాప్తు కొన సాగుతోంది.

    ఇదిలా ఉండగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే, వెం టనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు సమాచారం ఇవ్వాలని మీ వివ రాలు పూర్తిగా గోప్యంగా ఉంచ బ డతా యని అధికారులు బరోసా ఇ స్తున్నారు. అవినీతిని అరి క ట్టడం ప్రత పౌరుడి బాధ్యత మీ ఒక్క స మాచారం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుందని అధికారులు పేర్కొంటున్నా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.