Monday, September 28, 2026
More
    HomeOpinionSuryapet brutal murder : సూర్యాపేట జిల్లాలో దారుణం, ఎర్కారం కాలువలో ముక్కలుముక్కలుగా మృతదేహం

    Suryapet brutal murder : సూర్యాపేట జిల్లాలో దారుణం, ఎర్కారం కాలువలో ముక్కలుముక్కలుగా మృతదేహం

    📰 Generate e-Paper Clip

    Suryapet brutal murder :  ప్రజా దీవెన, సూర్యాపేట: ఆ ఊరి కాలువ నీరు శనివారం ఉదయం మునుపటిలా ప్రశాం తంగా ప్రవ హించలేదు. ఒక గోనె సంచి దాని చుట్టూ ము సురుతున్న అనుమా నాలు చివరకు తేలింది ఏమిటంటే, అది కేవలం సంచి కాదు, ఒక ప్పటి ఊరి పెద్ద భర్త శవం. సూర్యా పేట మండలం ఎర్కారం గ్రామంలో జరిగిన ఒక దారుణ హత్య ఇప్పు డు స్థానికంగా సంచలనం సృష్టి స్తోం ది. ఎర్కారం మాజీ సర్పంచ్‌ భర్త చింతలపాటి మధు  దా రు ణ హత్యకు గురయ్యాడు. అయితే, ఇది మామూలు హత్య కాదు..నిందితులు ప్రదర్శించిన కిరాతకం చూసి పోలీసులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.

        మూడు ముక్కలు.. ఒకే సంచి

    మధును సజీవంగా హతమార్చిన దుండగులు, అంతటితో ఆగలేదు. శవాన్ని ఎవరికీ దొరకకుండా చే యాలనే పక్కా ప్లాన్‌తో అతని శరీ రాన్ని మూడు ముక్కలుగా నరికా రు. ఆ ముక్కలన్నింటినీ ఒకే గోనె సంచిలో కుక్కి గుట్టుచప్పుడు కా కుండా ఊరి పక్కనే ఉన్న ఎస్‌ఆర్‌ ఎస్పీ (SRSP) కాలువలో పడేశా రు. ఉదయం కాలువలో అనుమా నాస్పదంగా తేలు తున్న సంచిని గ మనించిన స్థానికులు పోలీసులకు సమా చారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.ఈ హత్య వెనుక బలమైన ‘ఫ్లాష్‌ బ్యా క్’ ఉన్నట్లు తెలుస్తోంది. పోలీ సు లు ప్రాథమికంగా దీనిని ఒక ప్ర తీ కార హత్యగా భావిస్తున్నారు. గ తంలో ఇదే గ్రామానికి చెందిన స ర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కే సు లో ఈ చింతలపాటి మధునే ప్రధా న నిందితుడు.

    నాటి పగ మనసులో పెట్టుకున్న మిద్దె రవీందర్ కుమారుడే, తన తండ్రిని చంపిన మధుపై సరైన స మయం చూసి పగ తీర్చుకున్నాడని గ్రామస్తులు గుసగుసలాడుకుం టున్నారు. తండ్రిని చంపిన వాడిని అంతే క్రూరంగా ముక్కలు ముక్క లుగా నరికి కాలువలో పారేసి ఉం టాడనే కోణంలో పోలీసు లు విచా రణ జరుపుతున్నారు. గ్రామంలో పాత కక్షలు మ ళ్లీ రగిలడంతో ఎ ర్కారంలో ఉత్కంఠ భరిత వాతా వరణం నెలకొంది. అయితే నింది తుడి కోసం పోలీసులు వేట ప్రారం భించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.