Tuesday, September 29, 2026
More
    HomePoliticsNutritious Food for 60,000 Students : బిగ్ బ్రేకింగ్, 100 రోజుల్లో60వేల మంది విద్యార్థులకు...

    Nutritious Food for 60,000 Students : బిగ్ బ్రేకింగ్, 100 రోజుల్లో60వేల మంది విద్యార్థులకు పౌష్టికాహా రం

    📰 Generate e-Paper Clip

    — సయ్యద్‌ ముజావర్‌పేటలో ప్ర పంచస్థాయి కేంద్రీకృత వంటశాల రూ.9.60 కోట్లతో నిర్మాణం
    –1,029 విద్యాసంస్థలకు తాజా ఆహారం
    –నల్లగొండలో 7,972 మంది వి ద్యార్థులకు ప్రయోజనం

    Nutritious Food for 60,000 Students : ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలం గాణ ప్రభుత్వ పాఠశాలలు, జూ నియర్‌ కళాశాలల్లో చదువుతు న్న వేలాది మంది విద్యార్థులకు మరింత నాణ్యమైన, పౌష్టికాహా రం అందించేందుకు భారీ స్థాయి కేంద్రీకృత వంటశాల రూపుదిద్దు కుంటోంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం సయ్యద్‌ ముజావర్‌పేటలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ వం టశాలను వచ్చే 100 రోజుల్లో అందుబాటులోకి తీసుకురావడ మే లక్ష్యంగా పనులు వేగంగా సాగుతున్నాయి.

    హరే కృష్ణ మూవ్‌మెంట్‌ ఛారి ట బుల్‌ ఫౌండేషన్‌ సహకారంతో చే పట్టిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమి టెడ్‌ తన సీఎస్‌ఆర్‌ నిధుల నుం చి రూ.9.60 కోట్ల ఆర్థిక సహా యం అందించింది. వంటశాల అందుబాటులోకి వస్తే మొత్తం 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లోని సు మారు 60 వేల మంది విద్యార్థు లకు ప్రతిరోజూ తాజాగా తయా రు చేసిన పౌష్టికాహారం సరఫరా చేయనున్నారు

    ఆధునిక సాంకేతికతతో వంట.. ప్యాకింగ్‌.. పంపిణీ

    భారీ స్థాయిలో ఒకేచోట ఆహా రా న్ని తయారు చేయడంతోపాటు నాణ్యతా పరీక్షలు, ప్యాకింగ్‌, ర వాణా, పంపిణీ వ్యవస్థలను ఆ ధునిక సాంకేతికతతో అనుసం ధానం చేయనున్నారు. పరిశు భ్ర త, ఆహార భద్రత, పోషక విలు వలు, నిర్ణీత సమయానికి ఆహా రం చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చే స్తున్నారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పర్య వేక్షిస్తున్నారు. సింగరేణి, హరే కృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌,సూర్యాపేట–నల్లగొండ జిల్లా యంత్రాంగాలు, సంబం ధిత శాఖల మధ్య సమన్వయం తో పనులను ముందుకు తీసు కెళ్తున్నారు.

    100 రోజుల్లో పూర్తి చేసేలా కా ర్యాచరణ

    సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ మాట్లాడు తూ వంటశాలను 100 రోజుల్లో అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భవన నిర్మాణం, మౌలిక సదు పాయాలు, వంట, ప్యాకింగ్‌, ర వాణా, పంపిణీ వ్యవస్థలను స మాంతరంగా సిద్ధం చేస్తున్నా మని చెప్పారు. ప్రతి విద్యాసం స్థ కు నిర్ణీత సమయానికి తాజాగా తయారు చేసిన ఆహారం చేరేలా ప్రత్యేక రూట్‌ మ్యాప్‌ రూపొంది స్తున్నట్లు వివరించారు.

    నల్లగొండలో 7,972 మంది వి ద్యార్థులకు ప్రయోజనం

    ఈ కేంద్రీకృత వంటశాల సేవలు సూర్యాపేట జిల్లాకే పరిమితం కాకుండా నల్లగొండ జిల్లాకూ విస్తరించనున్నాయి. నకిరేకల్‌, శాలిగౌరారం, కేతేపల్లి, వేముల పల్లి మండలాల్లోని 131 ప్రభు త్వ విద్యాసంస్థలకు ఇక్కడి నుం చే ఆహారం సరఫరా చేయను న్నారు. దీంతో ఆయా విద్యాసం స్థల్లో చదువుతున్న 7,972 మం ది విద్యార్థులు ప్రయోజనం పొం దనున్నారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కలెక్టర్‌ బి.చంద్ర శేఖర్‌ మాట్లాడుతూ కేంద్రీకృత వంటశాల ద్వారా అన్ని విద్యా సంస్థల్లో ఒకే స్థాయి పరిశుభ్రత, నాణ్యత, పోషక విలువలు, ఆ హార భద్రత ప్రమాణాలను పా టించే అవకాశం ఉంటుందని తె లిపారు. ఆహారం ఎలాంటి అం తరాయం లేకుండా ప్రతి పాఠ శాలకు చేరేలా పటిష్టమైన రవా ణా ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.

    పోషకాహారంతో చదువుపై మరింత దృష్టి

    విద్యార్థుల్లో పోషకాహార లోపా న్ని నివారించడమే ఈ కార్యక్ర మం ప్రధాన లక్ష్యం. ప్రొటీన్లు, వి టమిన్లు, ఖనిజ లవణాలతో కూ డిన సమతుల ఆహారాన్ని అం దించనున్నారు. ఉదయం పౌష్టి కాహారం తీసుకోవడం ద్వారా వి ద్యార్థుల శారీరక ఆరోగ్యంతో పా టు తరగతి గదిలో ఏకాగ్రత, అభ్యసన సామర్థ్యం మెరుగుప డేందుకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
    అలాగే విద్యార్థుల హాజరు, సమ యపాలన మెరుగుపడటంతో పాటు బడి మానేసే వారి సంఖ్య తగ్గేందుకు కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడి న కుటుంబాలకు చెందిన విద్యా ర్థులకు ఇది అదనపు ప్రయోజ నం కలిగించనుంది.

    చిరుధాన్యాల వంటకాలకు ప్రాధాన్యం

    మెనూలో చిరుధాన్యాలతో త యారు చేసే సంప్రదాయ పౌష్టిక వంటకాలను చేర్చాలని ప్రతి పా దించారు. ఇందుకోసం హరే కృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌం డేషన్‌, భారతీయ వ్యవసాయ ప రిశోధన మండలి–భారత చిరు ధాన్యాల పరిశోధన సంస్థ సహ కారంతో శాస్త్రీయంగా వంటకాల రూపకల్పన, పోషక విలువల ప్ర ణాళిక సిద్ధం చేయనున్నారు.
    హరే కృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిట బుల్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు, అక్ష యపాత్ర ఫౌండేషన్‌ ప్రాంతీయ అధ్యక్షుడు శ్రీ సత్య దౌర చంద్ర దాస మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించి, వారు చ దువులో మెరుగైన ఫలితాలు సా ధించేలా సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

    విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టు బడి

    మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమా ర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, చదువు, భవిష్యత్తుకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టుకు రూ.9.60 కోట్ల సహాయం అందిం చిన సింగరేణి సంస్థకు కృతజ్ఞత లు తెలిపారు. ప్రభుత్వరంగ సం స్థలు తమ సీఎస్‌ఆర్‌ నిధులతో ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే మౌలిక సదుపాయాల ను ఎలా సృష్టించవచ్చో ఈ కేంద్రీ కృత వంటశాల చాటిచెబుతుంద ని పేర్కొన్నారు.వంటశాల అందు బాటులోకి వచ్చిన తర్వాత ప్రతి పనిదినం వేలాది మంది విద్యా ర్థులకు తాజాగా తయారు చేసిన పౌష్టికాహారం అందుతుందని మంత్రి తెలిపారు. సయ్యద్‌ ము జావర్‌పేట కేంద్రీకృత వంట శాల ను రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపే లా అన్ని చర్యలు తీసు కుంటా మని వెల్లడించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.