CM Revanth Reddy : ప్రజా దీవెన, అచ్చంపేట: శ్రీశైలం ఎ డమ గట్టు కాలువ (SLBC) టన్నె ల్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించా రు. ఎన్ని అడ్డంకులొచ్చినా తొలగిం చుకుంటూ ఈ ప్రాజెక్టును పూర్తి చే స్తామని స్పష్టం చేశారు.ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనుల కోసం నేషనల్ జి యోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NGRI) శాస్త్రవేత్తల నేతృత్వంలో అచ్చంపేట మండలం మన్నెవారి ప ల్లి వద్ద ముఖ్యమంత్రి సమక్షంలో హెలికాప్టర్ ద్వారా హెలిబోర్న్ ఏరి యల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే ప్రా రంభమైంది. ఈ సందర్భంగా మం త్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమ టిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక శాసన స భ్యులతో కలిసి ముఖ్యమంత్రి మీ డియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ వ్యా ఖ్యలు ఆయన మాటల్లోనే..రెండు దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును మా ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తర్వాత తిరిగి చే పట్టాం. ఆ క్రమంలో ఎదురైన అను భవాలను దృష్టిలో పెట్టుకుని మిగి లిపోయిన 9.8 కిలోమీటర్ల పనుల కోసం ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు, టన్నె ల్ నిర్మాణాల్లో అనుభవం కలిగిన ఆర్మీ అధికారుల సేవలను వినియో గించి ముందుకు వెళుతున్నాం.
ఎన్జీఆర్ఐ నేతృత్వంలో నిర్వహిస్తు న్న సర్వే వల్ల భూగర్భంలో 800 నుంచి 1000 మీటర్లలోపు ప్రతి 2. 5 మీటర్లలో రాయి, నీటి ప్రవాహా ల కు సంబంధించిన పరిస్థితి ఎలా ఉం దన్నది తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు ప్రాంతమంతా టైగర్ రిజర్వ్ ఉంది. పర్యావరణం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
గ్రావిటీ ద్వారా 30 టీఎంసీలను 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు సరఫరా కు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు 1983 లో పునాది పడినప్పటికీ ఆ తర్వా త రెండు దశాబ్దాల పాటు పనులు జరగలేదు. తిరిగి 2004 లో నల్గొం డ జిల్లా ప్రజాప్రతినిధుల ఒత్తిడి మే రకు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రాజెక్టు టన్నెల్-1, టన్నెల్ 2 పనులు ప్రారం భమయ్యాయి.
గ్రావిటీ ద్వారా నీటిని తరలించే ఈ ప్రాజెక్టు 44 కి.మీ టన్నెల్ కోసం ఆ నాడు దాదాపు 33 కి.మీ పూర్తి చే యగా, గత ప్రభుత్వ హయాంలో ద శాబ్దకాలం ఈ ప్రాజెక్టు పూర్తిగా నిర్ల క్ష్యానికి గురైంది. ప్రాజెక్టును ప్రారం భించిన నాడు ప్రపంచంలోనే అ త్యంత అధునాతన టన్నెల్ బోర్ మిషన్ ఉపయోగించి ప్రయోగా త్మ కంగా పనులు చేపట్టారు.
దేశంలోనే ఇదొక అత్యుత్తమ ప్రాజె క్టు. 44 కి.మీ టన్నెల్ ప్రాజెక్టు ప్రపం చంలోనే మరెక్కడా లేదు. ఈ ప్రాజె క్టు పూర్తయితే తెలంగాణకు మంచి పేరు రావడమే కాకుండా నయా పై సా ఖర్చు లేకుండా గ్రావిటీతో నీటిని సరఫరా చేయొచ్చు. ప్రస్తుతం ఏఎం ఆర్ ప్రాజెక్టు ద్వారా తరలిస్తున్న నీ టికి కేవలం విద్యుత్ చార్జీల కోసం ఏటా 500 కోట్ల రూపాయలు చెల్లిం చాల్సి వస్తోంది. గడిచిన పదేండ్లలో కేవలం విద్యుత్ చార్జీలే 5 వేల కో ట్లు చెల్లించాం.
ఎస్ఎల్‌బీసీతో పాటు కృష్ణా నదిపై బీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్ లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయక పోవడం వల్ల సాధించుకున్న తెలం గాణ లక్ష్యం నెరవేరలేదు. కృష్ణా న దిపై ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూ ర్తి చేయని కారణంగా మన వాటా మనం వాడుకోలేకపోయాం. నికర జలాల హక్కులు కలిగినప్పటికీ ప దేండ్లలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చే యకపోవడంతో తెలంగాణలోని ప్రా జెక్టులపై ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అ భ్యంతరం చెబుతోంది.
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత ఎస్ఎల్‌బీసీని పూర్తి చే యాలని సంకల్పంతో ముందుకు వె ళ్లినప్పుడు ఊహించని ప్రమాదం సంభవించింది. మాకెంతో బాధ కలి గించింది. ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ఆదుకున్నాం. అం దుకే అనుభవం, అత్యంత నైపు ణ్యం ఉన్న వారిని ఇక్కడికి రప్పిం చాం. ప్రాజెక్టును పూర్తి చేయడానికి భారత సైన్యం నుంచి కూడా అధికా రిని డిప్యుటేషన్‌పై తెచ్చుకున్నాం.
ఈ క్రమంలో టన్నెల్ పనులను ముందుకు తీసుకెళ్లడానికి భూగ ర్భంలో ఉన్న పరిస్థితులను అధ్య యనం చేయడానికి ఈ సర్వేను చే పట్టాం.పైగా అదనంగా పైగా ఖర్చు లేకుండా ఆనాడు వేసిన అంచనాల తోనే ఈనాడు పనులు పూర్తి చేయ నున్నాం.
నీటి పారుదల ప్రాజెక్టుల విష యం లో ఉమ్మడి మహబూబ్‌నగర్, న ల్గొండ జిల్లాలకు ఇప్పటికే తీవ్ర న ష్టం వాటిల్లింది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ప్రజలు క్షమించరు. ఇ ప్పుడు పూర్తి చేసుకోలేకపోతే మరె ప్పుడూ పూర్తి చేసుకోలేం.ఎన్ని అ డ్డంకులొచ్చినా తొలగించుకుంటూ దీన్ని పూర్తి చేసుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉంది. నిధులకు ఎ లాంటి ఆటంకం లేదు. గ్రీన్ చానెల్ ద్వారా మంజూరు చేస్తాం.
ప్రాజెక్టు పనులను పూర్తి చేయడా ని కి మర్లపాడు తండా, కేశీ తాండా, న క్కలగండి తాండా వాసులకు డిసెం బర్ 31 నాటికి ఆర్ అండ్ ఆర్ ప్యా కేజీ చెల్లింపులు పూర్తి చేస్తాం. ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పో తు న్న వారికి ఎలాంటి నష్టం లేకుండా ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


